Telugu Blogs
భావోద్వేగాల ప్రయాణం ‘ద వే హోం’
మా చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మగారింటికి మా అమ్మ తీసుకెళ్ళేది. వెళ్ళేటప్పుడు సరదాగానే ఉండేది కాని వచ్చేటప్పుడు ఒకటే ఏడుపు. నేనయితే పారిపోయేవాడ్ని.నన్ను వెతకటానికి మా మామయ్యలు పరుగెట్టేవారు. అలాంటి అనుభవం మళ్ళీ ఇన్నాళ్ళకు ద వే హోం సినిమా చూస్తూంటే కలిగింది. అప్పటి సంగతులన్నీ కలసికట్టుకుని ఒక్కసారిగా కళ్ళముందు ఆడాయి. అందుకేనేమో టైటిల్  ఇంటికి దారి అనే పేరు పెట్టారు.
నిజానికి ఇది పెద్ద కధేమీ కాదు. ఊహకందని ట్విస్టులు అస్సలే లేవు.రెండు  పాత్రలు ఒకరితో మరొకరు తప్పని స్ధితిలో మొదలు పెట్టిన ప్రయాణం…స్నేహ పూర్వకంగా ముగియటమే ఈ సినిమా. డెభ్భై ఏళ్ళు పై బడిన ఓ మాటా మంతి లేని మూగ అమ్మమ్మ పల్లెలో ఆధునికతకు అతి దూరంగా జీవిస్తూంటూంది. ఆవిడ కూతరు ఎప్పుడో పదిహేడేళ్ళ వయస్సులో ..గ్రామీణ జీవితానికి స్వస్తి పలకి నచ్చిన వాడితో ఆధునికతను వెతుక్కుంటూ సిటీ వెళ్ళిపోతుంది. అందరిలాగానే అక్కడ అతి సహజంగా మోసపోయి…పిల్లాడుతో మిగిలిపోతుంది. ఉదరపోషనార్ధం ఉద్యోగాన్ని వెతుక్కునే క్రమంలో కొడుకు శాంగ్ ఫూ ని ఓ నెల రోజుల పాటు తల్లి దగ్గర  వదిలి పెట్టాలని  బయిలుదేరుతుంది. అలా తను వదిలిన మూలాలను చాలా కాలం తర్వాత వస్తూండటంతో సినిమా ప్రారంభమవుతుంది
పిజ్జాలు,బర్గర్ లు ,ఎలక్ట్రానిక్ బొమ్మలు,వీడియో గేమ్స్తో సిటీ జీవితానికి అలవాటు పడ్డ ఆ పిల్లాడుకి ఆ పల్లె సహించదు. అందులోనూ మూగ అమ్మమ్మ ముసలి డొక్కులా కనిపిస్తుంది. మరో ప్రక్క అమ్మమ్మ కొండపై ఇల్లు,ఏ మాత్రం డవలప్ కాని  రిమోట్ విలేజ్ విచిత్రంగా ఉంటాయి. మట్టి గోడలు,ముడుతలు పడి నడుం వంగిన అమ్మమ్మ అసహ్యంగా కనిపిస్తాయి. తల్లికోసం తప్పదనుకుని ఆ గందరగోళాన్ని భరించటానికి రెడీ అవుతాడు.
కానీ అమ్మమ్మ మనకన్నా గొప్పది కదా..మొదటిసారి వచ్చిన ముద్దుల  మనవడుని గారాబంగా చూసుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.వాడి సంతోషం కోసం  కష్టపడుతుంది.కెంటకీ చికెన్ కావాలంటే ఇంట్లో వస్తువులు అమ్మి కోడి కూర చేస్తుంది. కానీ పిజ్జాలకు,బర్గర్స్ కు అలవాటు పడిన ఆ చంటోడి నాలుకకు అది సయించదు. కాళ్ళు కొట్టుకుంటూ ఏడ్చి నానా గోల చేస్తాడు. కానీ కాస్సేపటికి వర్షంలో తన కోసం తడిసి జ్వరంతో వణుకుతున్న అమ్మమ్మకు దుప్పటి తెచ్చి కప్పుతాడు. రక్త సంభంధం కదా.మళ్ళీ అంతలోనే చిరాకు…ఈలోగా వంగిపోయిన నడుముతో అమ్మమ్మ ఆ వయిస్సులో ..తన పల్లెలో ఎవరికో ఒంట్లో బాగోపోతే వెళ్ళి పలకరించటం చూసి విస్మయం చెందుతాడు. సిటీల్లో …నన్ను ముట్టుకోకు…నామాల కాకి అన్నట్లు ఉండే తమ ఒంటరితనం..అక్కడి సహజీవన సౌందర్యానికి సలాం చేస్తుంది.
ఇక కూరగాయలు పండించి,వాటిని అమ్ముకుంటూ పొట్ట పోసుకునే అమ్మమ్మ..వాడ్ని తీసుకుని ప్రక్కనున్న టౌన్ కి వెళ్తుంది.అక్కడ తెచ్చిన కూరగాయలు అమ్మి మనవడుకి ఇష్టమైనవి అడిగి కొనిపెట్టి తృప్తిగా బస్సెక్కిస్తుంది. తనకి టిక్కెట్ కి డబ్బుల్లేక  చేతిలో బరువుతో ..అన్ని కిలోమీటర్ల దూరం నడిచివస్తుంది. అప్పుడు ఆ పసి హృదయంలో స్పందన వస్తుంది. వెంటనే వెళ్ళి ఆర్తితో కౌగిలించుకుంటాడు. అంతకుముందు ఆవిడ ప్రక్కన నడవటానికి సంకోచిస్తూ..ఆవిడ చేతిలో వస్తువులు తీసుకోవటానికి నామోషి పడేవాడు తెలియకుండానే ఆమె ఒడి చేరతాడు.
అలా మెల్లి మెల్లిగా వాళ్ళిద్దరూ మన మనస్సులను గెలిస్తూ ముందుకెళ్తూంటే వాళ్ళ అమ్మ తిరిగి తీసుకెళ్ళటానికి వస్తుంది. భాధతో ఆ పిల్లాడు తన అమ్మమ్మకు(ఫోన్ లో మాట్లాడలేదని) ఉత్తరాలు రాయమని, కొన్ని గుర్తులు నేర్పుతాడు. ఒంట్లో బాగోపోతే ఏమీ  రాయకుండా ఖాళీ ఉత్తరాన్ని పోస్ట్ చేయమంటాడు. అలాగే తను గీసిన బొమ్మలు బహమతి గా ఇస్తాడు. ఆ ఇద్దరూ ఒక్క మాట మాట్లాడుకోపోయినా కొన్ని లక్షల పదాలతో ఏడుస్తూ సెండాఫ్ ఇచ్చుకుంటారు. మనం మూలాలని మరిస్తే మసైపోతాం అని స్పష్టంగా అంతకు మించి పొరలు పొరలుగా విడివడే సీన్లతో హెచ్చరించే ఈ దర్శకురాలే కథకురాలు. ఆవిడ పేరు జియాంగ్ హ్యాంగ్ లీ.
అలాగే సినిమాలో అమ్మమ్మగా జీవించిన ఇల్-బూన్-కిమ్ కిదే మొదటి సినిమా. షాకయ్యే విషయం ఏమిటంటే ఈవిడ తన 78 ఏళ్ళ జీవితంలో ఒక్క సినిమా కూడా చూసి ఎరగదు.ఇక మనవడుగా వేసిన సియాంగ్ హోయూ..చిచ్చర పిడుగే.ఇక ఈ సినిమా హైలెట్స్ లో ఒకటి చెప్పుకుని ముగిద్దాం. ఆ సిటీ కుర్రాడు తను తెచ్చుకున్న వీడియో గేమ్ సెట్ లో బ్యాటరీలు అయిపోతే ..అమ్మమ్మ తల పిన్ను అమ్మి కొనుక్కుందామని తాపత్రయపడతాడు. ఆవిడకు తెలియకుండా దొంగిలించి పల్లెలోకి పరుగెడతాడు. కానీ ఆ పల్లె ఆ పనికి అవకాశమివ్వదు. దాన్నే సినిమా మొత్తానికి మెటాఫర్ గా వాడాడు. సిటీలైఫ్ ఇచ్చే ఎనర్జీ..బ్యాటరీలో పవర్ లాంటిదంటూ ఛార్జింగ్ అయిపోతే చలనం ఉండదని పల్లే శాశ్వతం అంటూ చెబుతుందా సన్నివేశం. గ్రేట్ కదా.
ఇక ఉత్తర కొరియాలో 2005 లో నిర్మించిన ఈ లొ బడ్జెట్ చిత్రం ఉత్తమ స్క్రీన్ ప్లే,ఉత్తమ చిత్రంగా కొరియన్ అకాడమీ గోల్డెన్ భెల్ అవార్డులను సొంతం చేసుకుంది. ఓ నాయని పచ్చ నాకు సాక్షి కధలా కమ్మగా సాగిపోయే ఈ సినిమా చూస్తూంటే మనస్సు అమ్మమ్మ చంక ఎక్కుతుంది.తాత గోచి లాగుతుంది. మామయ్యలతో పరుగులు గుర్తుకు తెస్తుంది. మరో ప్రక్క రోజురోజుకీ గ్లోబలైజేషన్ వంకతో మారి పోతున్న మన బ్రతుకులు సానుభూతితో పరికిస్తుంది. ఇక ఈ సినిమా చూసాక అమ్మమ్మ గారింటికి వెళ్ళాళని బలంగా అనిపిస్తుంది…అందుకే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని చూడండి.
బ్లాగులు: కొత్త తెలుగు బ్లాగుల సంకలిని (Aggregator)
మీరు చూశారా?  బ్లాగులు -కొత్త సంకలిని.
మనకు తెలియని మన ఘంటసాల
ఈ రోజు డిసెంబర్ 4వ  తారీఖు.  ‘అయితే ఏమిటి?’ అంటారా? ఈ రోజు మన గాన కళానిధి, అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జన్మదినం.  1922 జనవరి నాలుగున కృష్ణా జిల్లా చౌటుపల్లి గ్రామంలో జన్మించారాయన.
అంతకుమించి, మిగిలిన వివరాలలోకి వెళ్ళకుండా, ‘మనకు తెలియని మన ఘంటసాల’ అని ఎందుకన్నానో చెప్తాను. ఘంటసాల ఒక తెలుగు సినీ నేపధ్యగాయకుడిగా మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయన గాన గాంధర్వం ఒక్క తెలుగు భాషకే పరిమితం కాలేదు.  తమిళం, కన్నడం, మళయాళం, సింహళం, చివరకు హిందీలో కూడా పాడారన్న విషయం బహుశా ‘నవతరంగం’ పాఠకుల్లో చాలామందికి తెలిసి ఉండొచ్చు కాని, సామాన్య జనాలకు తెలిసింది చాలా తక్కువ. ఒకవేళ తెలిసిన వాళ్లైనా ఆ పాటలు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 11 న ఘంటసాల వర్ధంతికి ఒక నెల రోజుల ముందు నేను ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం వారికి ఒక ఉత్తరం రాస్తూ, ఆ రోజున ఘంటసాల గురించి మొక్కుబడి కార్యక్రమం కాకుండా, ఆయన ఇతర భాషల్లో పాడిన పాటలతో పొందుపరిచిన (తెలుగు పాటలతో పాటు) కార్యక్రమం ప్రసారం చెయ్యమని సూచించాను. హైదరాబాదులోనే నూకల ప్రభాకర్ అని ఒకాయన ఉన్నారని, ఘంటసాల పాటల మీది ప్రేమతో ఆయన ఘంటసాల తెలుగులో పాడిన ఎన్నో అరుదైన పాటలతోపాటు, ఇతర భాషల్లో పాడిన పాటలుకూడా, ఎంతో శ్రమకోర్చి సేకరించారని, ఆయనను సంప్రదించి ఒక కార్యక్రమాన్ని చేయమని ప్రభాకర్ గారి వివరాలు ఆకాశవాణి వారికి అందజేశాను.
ప్రభాకర్ గారి గురించి నాకెలా తెలిసిందంటే - కొంతకాలం క్రితం ఒకసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు, ఘంటసాల గారి కూతుళ్ళలో ఒకరైన డా. ఘంటసాల శ్యామల గారిని కలవటం జరిగింది.  ఆమె ద్వారానే ప్రభాకర్ గారి గురించి నాకు తెలిసింది.
నా సూచనను మన్నించి, ‘ఆకాశవాణి’ వారు ప్రభాకర్ గారిని తమ స్టూడియోకి రప్పించి, ఫిబ్రవరి 10న  ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారు (ఆరోజు ఆదివారం కాబట్టి).  అయితే, అది FM Rainbow లో ప్రసారం చేశారు. నేను ఢిల్లీలో DTH ద్వారా హైదరాబాదు రేడియో ప్రసారాలు వినగలిగినా, DTH లో FM Rainbow ప్రసారాలు రావుగనుక, వినలేకపోయాను. తర్వాత ప్రభాకర్ గారు నాకు ఈ మొత్తం కార్యక్రమాన్నీ మెయిల్లో పంపించారు.
అది ఈ రోజున ‘ఘంటసాల జన్మదినం’ సందర్భంగా ‘నవతరంగం’ సభ్యులతో పంచుకోవాలని నాకు అనిపించింది. అరుదైన ఈ ఘంటసాల పాటలు అందరూ వినే అవకాశం ‘నవతరంగం’ నిర్వాహకులు కలుగజేస్తారని ఆశిస్తాను.
ఈ పాటలు ఎలా సేకరించిందీ, ఎలా భద్రపరిచిందీ నూకల ప్రభాకర్ గారు కార్యక్రమంలో వివరించారు కాబట్టి నేనిక్కడ మళ్ళీ ప్రత్యేకంగా పేర్కొనటంలేదు. ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలు నేరుగా ప్రభాకర్ గారికే ఈ క్రింది చిరునామాకు తెలియజేయండి.
E-mail: prabhayen@yahoo.com
Cell: 9440674477
ఘంటసాల శ్యామల గారి చిరునామా: shyamala_ghantasaala@yahoo.com
ఘంటశాల-రేడియో కార్యక్రమం-మొదటి భాగం
ఘంటశాల-మొదటి భాగం
ఘంటశాల-రేడియో కార్యక్రమం-రెండవ భాగం
ఘంటశాల-రెండవ భాగం
ఘంటశాల-రేడియో కార్యక్రమం-మూడవ భాగం
ఘంటశాల-మూడవ భాగం
Awaara (1951)
“ఆవారా” - చిత్రానికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదేమో అన్న అనుమానం ఓ పక్క ఉంది కానీ, నాలాంటి వారు ఈ చదువరుల్లో ఉండే ఉంటారన్న నమ్మకమే నా చేత ఈ వ్యాసం రాయిస్తోందనుకుంటాను. “ఆవారా” 1951 నాటి బాలీవుడ్ చిత్రం. నిర్మాత, దర్శకుడు : రాజ్ కపూర్, కథ-సంభాషణలు: కె.ఎ.అబ్బాస్, వీ.పీ.సాథే, సంగీతం: శంకర్-జైకిషన్. తప్పక చూడవలసిన బాలీవుడ్ సినిమాల జాబితాలలో ఆవారా పేరు తరుచుగా కనిపిస్తూ ఉండేది నాకు. కానీ, ఆవారా అంటే “ఆవారా హూ..” పాట తప్ప ఇంకేమీ తెలీదు నాకు. ఆ పాట వీడియో కూడా మొదట మొన్న సినిమా చూస్తున్నప్పుడే చూశాను.
కథ: కథ ఓ కోర్టు సీనుతో మొదలౌతుంది. ఆ దృశ్యంలో ముద్దాయి రాజ్ (రాజ్ కపూర్) తాను నేరస్థుడననీ, ఖూనీకోరుననీ, తనని ఉరితీయమనీ కోర్టు వారితో అన్నప్పుడు రాజ్ తరపున వాదించేందుకు రీటా (నర్గీస్) వస్తుంది. జడ్జి రఘునాథ్ (పృథ్వీరాజ్ కపూర్) ఈ కేసుకి సంబంధించినంత వరకూ జడ్జి బాధ్యత పక్కన పెట్టి బోనులో ఉంటాడు. ఇక్కడ రీటా రాజ్ పరిస్థితి ఏమిటి? అతను ఎలా నేరస్థుడు కాడో చెప్పడం మొదలుపెడుతుంది. ఫ్లాష్ బ్యాక్- కథా సమయానికి ఓ పాతికేళ్ళముందు రఘునాథ్ భార్యని అతను శిక్ష విధించిన జగ్గా అన్న దొంగ కిడ్నాప్ చేస్తాడు. నాలుగురోజుల్లో ఆమెని అతను వదిలిపెట్టేసినా కూడా రఘునాథ్ మనసులో ఆమె గురించి అనుమానం ఏర్పడి, ఆమె గర్భవతి అని తెలిసీ ఆమెని ఇంటి నుండి గెంటేస్తాడు. ఆమె తన పిల్లవాడిని కష్టపడి చదివిస్తూ ఉంటుంది. అతడికీ, రఘునాథ్ స్నేహితుడి కూతురు రీటాకూ మంచి స్నేహం ఏర్పడుతుంది. కానీ, కాలక్రమంలో ఆ అబ్బాయి పరిస్థితులకి ఎదురీదలేక దొంగగా మారతాడు. “ఆవారా” గా తిరుగుతూ ఉంటాడు. పన్నెండేళ్ళ తరువాత రీటాని మళ్ళీ కలుస్తాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. “ఆవారా” రాజ్ దొంగతనాలు అవీ మానేసి కష్టపడి పనిచేద్దామనుకుంటాడు కానీ సమాజం అతన్ని అలా మారనివ్వదు. చివర్లో అతను జగ్గాని హత్య చేసి జైలుకి వెళతాడు. ఆ సమయంలోనే అతనికి తన తండ్రెవరో తెలుస్తుంది. తల్లికి తండ్రి చేసిన ద్రోహానికి ప్రతీకారంగా తండ్రిని చంపుదామనుకుంటాడు రాజ్. ఆ ప్రయత్నం లో మళ్ళీ పట్టుబడతాడు. కథ మళ్ళీ మొదటి కోర్టు సీను వద్దకి వెళ్తుంది. రీటా రాజ్ తరపున వాదిస్తూ రఘునాథ్ కి తన పొరపాటు తెలిసేలా చేస్తుంది. రాజ్ జైలుకి వెళతాడు, రీటా అతని కోసం ఎదురుచూస్తానంటుంది. అదీ కథ.
ఈ సినిమా నాకు నచ్చింది. అందుకు ప్రధాన కారణం సంభాషణలు కావొచ్చని అనిపిస్తోంది. ఒక్కోదగ్గరి డైలాగులు, అవి పలికిన విధానమూ అలా గుర్తు ఉండిపోయాయి. ముఖ్యంగా మూడు సన్నివేశాలు బాగా గుర్తు ఉండిపోయాయి. బహుశా ఈ మూడే ఈ సినిమాని అర్థంచేసుకోడానికి బాగా దోహదపడే సన్నివేశాలేమో. మొదటిది - లీలా చిట్నిస్ ను అపహరించిన జగ్గా “దొంగ కొడుకు దొంగే కావాలా?” అన్న ప్రశ్న లేవనెత్తిన దృశ్యం. రెండవది - మారిన రాజ్ ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అతను ఒకప్పుడు దొంగ అన్న కారణం చేత అతని ఉద్యోగాన్ని తొలగించినపుడు - “మారాలనుకున్న దొంగలకి ఎక్కడా పనివ్వకపోతే వాళ్ళు ఎలా మారతారు?” అని రాజ్ ప్రశ్నించిన దృశ్యం. మూడవది - కోర్టు దృశ్యంలో జడ్జి రీటాతో - “చట్టానికి హృదయాన్ని గురించిన ఆలోచన ఉండదు” అంటే రీటా -”హృదయానికి కూడా ఏ చట్టం గురించిన పట్టింపూ ఉండదు” అని జవాబిచ్చిన దృశ్యం. ఇవి కాక నాలుగవది ఉంది - అది రీటా రాజ్ ఎందుకు అపరాధి కాలేడు - అసలు ఇలాంటి పరిస్థితులు ఎదురవడానికి ఉన్న మూలాలు ఏమిటి? అన్నవి విశ్లేషిస్తూ చేసే వాదన.
నటీనటుల పరంగా చూస్తే, ప్రధానంగా నాకు నచ్చింది - పృథ్వీరాజ్ కపూర్. అతని ఆహార్యం, ముఖ కవళికల్లోనే ఆ పాత్ర స్వభావం తెలిసిపోయేంతగా నటించారు. తరువాత లీలా చిట్నిస్ - రాజ్ కపూర్ తల్లి పాత్రధారి. రాజ్ కపూర్ కొన్ని దృశ్యాల్లో మాత్రమే బాగా అనిపించాడు నాకు. రాజ్ కపూర్-నర్గీస్ ల జంట గురించి వినడమే కానీ, తెరపై చూసింది లేదు నేనెప్పుడూ. ఇద్దరి జోడీ బాగుంది. జగ్గా పాత్రధారి కె.ఎన్.సింగ్ ని చూడగానే విలన్ లాగా అనిపిస్తాడు - అతని మొహంలో అలాంటి భావమే కనిపిస్తుంది సినిమా ఆద్యంతమూ. ఇక సంగీతం విషయానికొస్తే - నాకు ఇవి మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినే పాటల్లాగా అనిపించించలేదు - “ఆవారాహూ” తప్ప.  కానీ, అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు కనుక సాహిత్యం కూడా తగినట్లు ఉంది. పదాలు కూడా సింపుల్ గా ఉండటం నాకు నచ్చింది.
ఈ సినిమాలోని ఆవారా పాత్రని రాజ్ కపూర్ చార్లీ చాప్లిన్ నుండి ప్రభావితమై మలచాడంటారు. సినిమాలోని కొన్ని దృశ్యాలు - ముఖ్యంగా “ఆవారా హూ” పాటలో రాజ్ కపూర్ నటనా, నవ్వూ - ఇదంతా చాప్లిన్ ని పోలినట్లే అనిపిస్తాయి. కానీ, ఈ పాత్రలో ఓ భారతీయత ఉంది. రాజ్ లాంటి వారు మనకు రోజులో కనిపిస్తూనే ఉంటారు. ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో ఓ సినిమా వచ్చింది. ఎన్‍టీఆర్, జమున ఉంటారు. “ఓహో గులాబి బాలా” పాట ఉంటుందాసినిమాలో. “మంచి మనిషి” అనుకుంటా పేరు. అంటే, ఆవారా కి రీమేక్ అని కాదు. ఓ గౌరవనీయ వ్యక్తి కొడుకు చిన్నప్పుడు తప్పిపోయి దొంగ కావడం, తన చిన్నప్పటి స్నేహితురాల్ని ఓ దొంగతనం సందర్భంగా కలిసి తరువాత ఇద్దరు ప్రేమించుకోడం, ఇతను మారడానికి ప్రయత్నించడం - ఇలాంటి దృశ్యాలన్నీ ఆ సినిమాలో కూడా ఉన్నాయి. ఎటొచ్చీ, ఈ తెలుగు సినిమా నేను ఎప్పుడూ పూర్తిగా చూడలేదు కనుకా, ఈ సినిమాలో జగ్గయ్య రూపంలో ఇంకో హీరో ఉన్నాడు కనుకా - ఇది ఆవారా నుండి కాపీ కొట్టారని అనలేను. “ప్రేరణ” అని అనగలను  (ఏమిటో ఖర్మ! ఏ సినిమా చూసినా అందులో దృశ్యాలు ఇంకో సినిమాలో కాపీ కొట్టినట్లు తెలుస్తోంది ఈ మధ్య!!!)
ఈ సినిమాలో మరీ నాటకీయంగా అనిపించే దృశ్యాలు బోలెడున్నాయి. కానీ, దాదాపు అరవై ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది అన్న విషయం దృష్టి లో ఉంచుకోవాలి. అది మనసులో ఉంచుకుంటే తప్ప ఈ సినిమాలోని watchability ని పూర్తిగా ఒప్పుకోగలగడం కష్టం. బ్లాక్ అండ్ వైట్ కనుకే ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా అనిపించిందేమో అని నా అనుమానం. బహుశా కలర్ లో అయితే, ఇంత visual appeal ఉండేది కాదని నా అభిప్రాయం. మొత్తానికి నేనూ ఆవారా చూసేసాను. మంచి ఎంటర్‍టైనింగ్ సినిమా.
గోవా బంగారాలు ఇవే ..
గోవాలో నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్‌, గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ హాజరయ్యారు. ఈ  ముఫ్ఫై తొమ్మిదివ  ‘ఇఫి’ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ముగింపు  రోజు  అవార్డుల ప్రకటన జరిగింది. అందులో కజకస్థాన్‌ చిత్రం ‘తల్పన్‌’ బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు.సెర్గి డివోర్ట్‌ సెవాయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఔత్సాహిక దర్శకుడి అవార్డును కూడా ఆయన దక్కించుకున్నారు. అలనాటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన కజకస్థాన్‌కి చెందిన ఓ యువకుడు నేవీలో శిక్షణ పొందిన అనంతరం అల్లుకున్న పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందించారు. గతంలో కూడా తల్పన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుని,గోల్డెన్ ఐ అవార్డుని మోనోట్రియల్,జ్యూరిచ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో గెలుచుకుంది.అలాగే ఈ చిత్రం ఈయేటి ఆస్కార్ విదేశీ విభాగం కేటగిరిలో కజికిస్దాన్ నుండి అఫీషియల్ ఎంట్రిగా వెళ్ళింది. ఈ అవార్డ్ ని ఆయన అందుకుంటూ…సినిమాలు ప్రపంచాన్ని మార్చకపోవచ్చు కానీ..మనుష్యులను మారుస్తాయి..వారు  ప్రపంచాన్ని మారుస్తారు అంటూ ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.
ఇక గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కింద రూ.40 లక్షల నగదు బహుమతి అందిస్తారు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ బహుమతిని ఈ ఏడాది నుంచి భారీగా పెంచారు. శ్రీలంక నటి మాలిని ఫోయెన్‌సెకా ‘ఆకాశ కుసుమ్‌’ చిత్రానికి స్పెషలీ జ్యూరీ అవార్డు (వెండి నంది) సొంతం చేసుకుంది. ఈ విభాగంలో బహుమతి కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. మహాసత్తా (మరాఠీ), ప్రియదర్శన్‌ రూపొందించిన ‘కాంచీవార’(తమిళ్‌) చిత్రాలు కూడా బరిలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌కి చెందిన పీటర్‌ చాన్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటి టబు కూడా కమిటీలో సభ్యురాలు. 40 దేశాలకు చెందిన సుమారు 225 చిత్రాలను ఇఫిలో ప్రదర్శించారు. ముంబయి ప్రేలుళ్ళ విషాదంతో ఇఫి ఆర్గనైజర్స్ చాలా పోగ్రామ్స్,ఏక్టివిటీస్ ఆపు చేసారు. వచ్చే ఫెస్టివల్ నాటికి నవతరంగం సభ్యుల్లో కొందరైనా   సినిమాలు తీసి ప్రదర్శించాలని కోరుకుంటూ…అవార్డులు అందుకున్న వారికి మనసారా శుభాకాంక్షలు తెలుపుతోంది.
'వాహ్'టె టీమ్!!!
వాహ్! ఇక హిల్లరీ క్లింటన్ 'మేడమ్ సెక్రటరీ' మన పరిభాషలో అమెరికాకు కాబోతున్న కొత్త హోం మినిష్టరు. బరాక్  అధ్యక్షుడు, హిల్లరీ సెక్రటరీ ఆఫ్ స్టేట్! ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రిందట చెబితే ఎవరైనా "పోబ్బా! భలే చెప్పొచ్చావు కానీ" అని ఎగతాళి చేసేవారు. ఎవరో అన్నట్టు  "స్కిజోఫ్రినియా"  అని అనుమానపడినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా కొత్త అధ్యక్షుడి ఒక్కో నిర్ణయం ఎంతో విజ్ఞతతో, సమయస్ఫూర్తితో తీసుకొంటున్నట్లు ఋజువవుతోంది. I strongly applaud him for his non-partisanship and to move forward with a team of rivals.
ఇక ఒబామా మీద చాలా విమర్శలే వచ్చాయి మన బ్లాగుల్లో. అక్కడ వ్యాఖ్యానిస్తే మళ్లీ ఓ 'రచ్చ' కు తెరతీసినట్లవుతుందని ఏదో నాకు తోచింది నా బ్లాగులో రాసుకొంటున్నాను. (బ్లాగుబద్ధమైన హెచ్చరిక: ఇది ఎవరినీ వ్యక్తిగతంగా  కించపరచడానికి రాస్తున్నది కాదని, వారి భావాలకు నా ప్రతిస్పందన అని గమనించ ప్రార్థన.) ఆయన ఎన్నిక చారిత్రాత్మకం కాదన్నారు, సరే. సమానత్వమా...హ!హ!హ! అని నవ్వారు, సోషలిస్టు అని నిందించారు(ఏం చేస్తాం ఈ కాలంలో కమ్యూనిస్టు, సోషలిస్టు పచ్చి బూతు పదాలైపోయాయి, ఇక్కడ కాపిటలిస్టుల కోటలు కూలుతున్నా!) , తొక్క,తోలు అని...ములట్టో అని ఎగతాళి చేసారు. హి ఈజ్ హాఫ్ బ్లాక్ అంటూ రుసరులాడారు. బరాకేశ్వరుడంటూ 'పన్ను' పొడిచారు.
ఇన్ని చేసినా మరీ నోర్మూసుకొని కూర్చొంటే బరాకాకింతుణ్ని(నేను వ్యక్తిగత పూజకు 'సిద్ధయ్య'ను అని ఇప్పటికే మీకు తెలుసును కాన!) ఎలా అవుతానని, ఈ టపా:-) కేవలం తన 'తోలు' గురించి అవమానపరిచారనే ఓ సగటు మనిషి, రవి అస్తమించని సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్ముడైయ్యాడు. "All men are created equal" అని రాసుకొన్న రాజ్యాంగం కింద ఓ నల్లవాడు, ఆఫ్కోర్స్ హాఫ్ నల్లవాడు, అధ్యక్షుడైన క్రమాన్ని భరించలేని వారు కోకొల్లలు (మా లూసియానా రండి, చూద్దురు గానీ). సో సమానత్వమా...వంకాయా! అన్నా 'వాకే'. ములట్టో, హాఫ్ బ్లాక్`ల గురించి కొంత- లించింగ్ అంటే తెలుసుగా, ఊరంతా పండుగలా చూస్తోంటే, ఊరి నడిబొడ్డున- చెట్టుకు ఉరి తీయడం, చచ్చేదాక! కారణాలు ఎన్నో ఉండొచ్చు- తెల్ల పిల్లను, నల్లవాడు కన్నెత్తి చూడడం దగ్గర నుంచీ- అలాంటి స్థితి నుంచీ ఒక తెల్లపిల్లకు-నికార్సైన ఆఫ్రికా నల్లనయ్యకు పుట్టినోడు అదే అమెరికా అధ్యక్షుడైయ్యాడు చూడండి, అది ఫుల్ బ్లాక్ అధ్యక్షుడైన  దానికన్నా వెయ్యిరెట్లు చెంపపెట్టు! ఇది చారిత్రాత్మకం కాదనే వాళ్లుంటే, వారికి చరిత్ర తెలియదని మనం సరిపెట్టుకోవాలి.
మైనారిటీ ఓట్లతో అధ్యక్షపీఠం అలకరిస్తున్నాడు, అనేవారికి ఓ సూచన- అందరికన్నా అమెరికా ననవయువతలో బరాక్̍కు ఎక్కువ ఓట్లు పడ్డాయి, అమెరికా భవిష్యత్తు వీరిదే, వారి స్వరాన్ని తమ ఓటు ద్వారా ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఈ రొడ్డకొట్టుడు రాజకీయాలు, మతం పేరిట ఓట్లు దండుకోవడాలు, ప్రజలను భయవిహల్వులను చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవడాలు మొదలైన 'రోవియన్' పాలిట్రిక్సు చూసి, చూసి విసుగెత్తి పోయి, చేవ చచ్చిన 'పెద్ద ముదుసలి' పార్టీని పాడెక్కించారు. కొత్త ఆలోచనలతో ముందుకు రావడం మాని, పాచిపోయిన భావాలకు అందమైన మేలిముసుగు వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. అది ప్రజలు తిప్పికొట్టారు. ఇకనైనా మేలిముసుగుల్ని, అందమైన మైనపుబొమ్మల్ని, ముద్దుగుమ్మల్ని కాదని, కాస్త సత్తా ఉన్న యువరక్తంతో పార్టీని నింపితే తప్ప, భవిష్యత్తు లేదు. రాబోయే కొద్ది రోజుల్లో ఈ దేశంలో 100% ప్యూర్ వైట్- సంప్రదాయక- మతాభిమాన- జాత్యాహంకార-శతాధిక వృద్ధులు మైనారిటీ కాబోతున్నారని గుర్తెఱిగితే వారికే మంచిది.
నా బుర్ర వేడెక్కిపోయింది ఈ టపాతో, చదవిన మీ బుర్ర వేడెక్కితే కాస్త ఈ 'కాఫీ'పాఖ్యానం చూసి, చదివి, తాగి రిలాక్స్ కండి. తోటరాముడు గారు మీకు డిజైనింగు పాఠాలు, అవిడియాలు ఇందులో ఎన్నో ఉన్నాయి:-) ఇక Thanksgiving కు మా థాయ్`లాండ్ నర్స్ మిస్టర్ వచారా కచాట్రాన్ తన adopted అమ్మా, నాన్న ఇంటిలో జరుపుకొంటూ మమ్మల్ని ఆ విందుకు ఆహ్వానించి మాంఛి టర్కీ వంటకాన్ని, బీన్స్ విత్ మాష్డ్ పొటాటో, స్వీట్ పొటాటో (అదే మన గెనసు గడ్డ) pie ను కడుపు నిండా పెట్టి, మా మనస్సంతోషపరచినారని ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయుటకు సంతసిస్తున్నాను. తాంబూలమొక్కటీ తక్కువైంది:-)
ప్రముఖ సినీ నిర్మాత త్రివిక్రమరావు మృతి
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రముఖ తెలుగు సినీ నిర్మాత టి.త్రివిక్రమరావు ఈ రోజు  హైదరాబాద్ లో కన్నుమూశారు.  విశాఖపట్నానికి చెందిన త్రివిక్రమరావు స్వర్గీయ ఎన్‌.టి. రామారావుతో గల పరిచయంతో, ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితర ప్రముఖ నటులతో పలు చిత్రాలు నిర్మించారు.
ఆయన ఎన్టీఆర్‌తో నిర్మించిన జస్టిస్‌ చౌదరి చిత్రం అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఆయనకు, ఎన్టీఆర్‌కు ఎంతో పేరు తెచ్చింది. ఖైదీ రుద్రయ్య, ఆహ్వానం వంటి పలు చిత్రాలను ఆయన నిర్మించారు. హిందీలో సైతం అప్పటి అగ్రనటుడు జితేంద్ర హీరోగా పలు చిత్రాలు నిర్మించారు. ఆయన ఆఖరు సినిమా బద్రి..పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చింది.  కొంతకాలంగా నిర్మాణరంగానికి ఆయన దూరంగా ఉన్నారు. త్రివిక్రమరావు మృతికి నవతరంగం శ్రధ్ధాంజలి ఘటిస్తూ…..
ఆంద్రె బాజిన్ - ఒక పరిచయం (50వ వర్థంతి సందర్భంగా)
ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut, Erich Rohmer లాంటి విమర్శకులు తదుపరి కాలంలో, New wave అనే సినీ ఉద్యమం ద్వారా తీసిన సినిమాలతో ఫ్రాన్సు సినిమా పరిశ్రమనే కాదు, ప్రపంచ సినిమాలన్నింటినీ ఒక కొత్త బాటన నడిపించాడు.
చాలా మంది అంటుంటారు - సినిమా తీయాలనే ఆసక్తి కలిగిన వారెవ్వరైనా మొదటగా చదవాల్సింది Aristotle రాసిన Poetics అనే గ్రంధం మరియు Andre Bazin వ్యాస మాలిక అయిన What is Cinema? అని. నా దృష్టిలో అది అక్షరాలా నిజంనిపిస్తుంది. Andre Bazin వ్యాసాలు అసాధారణ పరిశీలన మరియు అత్యుత్తమ సమాచారాల కలయికగా వుంటాయి.
Andre Bazin ఎవరో తెలుసుకోవాలంటే గూగుల్ లో వెతుక్కుంటే ఎంతో సమాచారం దొరుకుతుంది. కానీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయమున్న ఇద్దరు వ్యక్తులు Andre Bazin గురించి ఏమన్నారో తెలియచేయడమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు Francois Truffaut మరొకరు Jean Renoir. ఫ్రెంచ్ సినిమాల గురించి ఏ మాత్రం పరిచయమున్నా, మీకు వీరిద్దరి పేర్లు ఇప్పటికే తెలిసివుంటాయి. Francois Truffaut తన మొదటి సినిమా అయినా 400 Blows తో ఫ్రాన్సులో New Wave అనే సినీ వుద్యమానికి శ్రీకారం చుట్టాడు. Jean Renoir తన సినిమాలైన The Grand Illusion, The Rules of The Game లాంటి సినిమాలతో చిరస్మరణీయుడు.. నాదృష్టిలో Citizen Kane తో పోల్చదగిన సినిమా ఏదైనా వుందంటే, అది The Rules of the Game మాత్రమే!
Andre Bazin వ్యాసాలతో కూడిన రెండు సంపుటాలు “What is Cinema” పేరుతో లభ్యమవుతున్నాయి. ఆ సంపుటాలలో, ఒక దానికి ముందు మాట రాసిన వాడు Renoir మరో దానికి Truffaut. Bazin ఎవరో, సినిమాకు ఆయన చేసిన సేవ ఎంటో తెలుసుకోవాలంటే Renoir మరియు Truffaut రాసిన పరిచయం చదివితే అర్థమవుతుంది. అందుకే వారు రాసిన పరిచయ వాక్యాలను తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేసాను.
Andre Bazin గురించి Frncoise Truffaut రాసిన ముందుమాట.
సినిమా గురించి Andre Bazin రాసినంత గొప్పగా యూరోపులో మరెవ్వరూ రాయలేదు. 1948 లో నాకు మొదటి ఉద్యోగం ఇప్పించిన నాటి నుండి, అతనితో పని చేస్తూ, నేనాయనకు దత్తతిచ్చిన కొడుకయి పోయాను. ఆ తర్వాత, నా జీవితంలో జరిగిన ప్రతి మనోహరమైన విషయం ఆయన పుణ్యమే.
ఆయన నాకు సినిమాల గురించి రాయడం నేర్పించారు, తప్పులు రాస్తే సరిదిద్దారు మరియి నా మొట్టమొదటి వ్యాసాలనూ ప్రచురించారు. అంతే కాదు నేనొక సినిమా దర్శకుడు కావడానికి సహాయపడ్డారు. నా మొదటి సినిమా షూటింగ్ చేయడం మొదలుపెట్టిన రోజే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. ఆఖరి ఘడియల్లో ఆయన స్నేహితుడు Piere Leger పిలుపునందుకుని, Nogent లో వున్న ఆయనింటికి చేరుకున్నాను. నా వైపైతే చూసారు గానీ కానీ నోట మాట లేదు. భయంకరమైన భాధననుభవిస్తున్నారని మాత్రం తెలిసింది. అంతకు ముందు రోజు సాయంత్రమే టీవీలో ”Le Crime de Monsieur Lange” సినిమా చూస్తూ దర్శకుడు Jean Renoir గురించి రాస్తున్న పుస్తకం కోసం నోట్సు రాసుకున్నారు.
ఎవరైనా నన్ను Andre Bazin గురించి చెప్పండి అంటే మొదటగా నాకు గుర్తొచ్చేది, నేను అమెరికన్ పత్రికలో చూసిన వాక్యమొకటి: “The most unforgettable character I’ve met.”
Giraudoux నాటకాల్లో పాత్రల్లాగే Andre Bazin కూడా పాపం పుట్టకముందు నాటి జీవి అనిపిస్తుంది. ఈయన మంచితనం, నిజాయితీల గురించి మాకందరికీ తెలిసినప్పటికీ ఆయన మంచితనం నిరంతరం సాగే ఒక అధ్భుతం అని తోచేది. అలాగే ఆయన చేసే మంచిపనులకూ అంతులేదు. హైందవునికి గంగలో స్నానమాడడమెంత పుణ్యకార్యమో ఆయనతో మాట్లాడడమూ అంతే. ఆయన మంచితనం రుచి చూడడానికే ఒక్కోసారి నేను తెలిసిన వాళ్ళతో కావాలని గొడవకి దిగేవాడిని. అలాంటి సమయాల్లో ఆయన వారి పక్షాన చేరి వారికి అండగా నిలిచేవాడు.
లంకంత హృదయం గలిగినవాడయినప్పటికీ తర్కమే తనైన వాడాయన. Bazin స్వఛ్ఛమైన జ్ఞాని, ఉత్కృష్టమైన తార్కికుడు. హేతుబధ్ధంగా వాదించడమనే శక్తిని నమ్మిన వాడీయన. మహామహులెందరినో తన వాదంతో చిత్తుచేయడం నా కళ్ళారా చూశాను. నత్తి కారణంగా తడబడుతూ మాట్లాడినా, శ్రోతలను ఆకట్టుకోవడంలో మాత్రం ఆ లోపాలేవీ ఆయనకు అడ్డు రాలేదు. యోగ్యతలేని వాదనతో తన వద్దకొచ్చిన వాళ్ళని, ముందుగా ఆ వితర్కనీయ విషయాన్ని ఆ వచ్చిన వారు చెప్పిన దానికంటే బాగా వికసింపజేసి, ఆ తర్వాత కఠినమైన తర్కం ద్వారా ఆ వాదాన్ని కూలదోసేవాడు. Bazin ఎంతో ప్రేమగా ఆరాధించిన Sartre వ్యాసాల్లో మాత్రమే ఇటువంటి బుధ్ధి జ్ఞానము మరియు మనో సంబంధమైన యోగ్యతా కనిపిస్తాయి.
తీవ్ర అస్వస్థతతో కూడిన ఆయన ఆరోగ్యానికి సమాంతరంగానే ఆయన మనోబలమూ, గుండే ధైర్యమూ వుండేవి. వూరందరికీ తెలిసేలా అప్పులూ చేసేవాడు, మరో కంటికి తెలియకుండా దానాలూ చేసేవాడీయన. ఈయన సమక్షంలో అన్ని విషయాలూ చక్కగానూ, సరళంగానూ, స్వచ్ఛంగానూ తోచేవి. నాలుగు సీట్లున్న కారులో ఒక్కడే ప్రయాణం చేయడం ఇష్టంలేక Nogent బస్సు స్టాపులో మరో ముగ్గురిని తన కారులో ఎక్కించుకుని వారి గమ్య స్థానం చేరడంలో సహాయపడేవాడు. ఎప్పుడైనా తన కుటుంబంతో పాటు కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సివస్తే తనకి తెలిసిన పేద కుటుంబీకులెవరికైనా తన ఇంట్లో వుండే ఏర్పాట్లు చేసి వెళ్ళేవాడు. అంతేకాదు తన కారు కూడా అవసరమున్న వారెవరికైనా ఇచ్చే వెళ్ళేవాడు.
ఈయన సినిమాని ప్రేమించాడు. అంతకంటే కూడా జీవితాన్నీ ప్రేమించాడు. ఆ ప్రేమతోనే మనుషులకు, జంతువులకూ, శాస్త్రానికి, కళలకూ తన జీవితంలో స్థానం కల్పించాడు. చనిపోయే కొద్దిరోజులముందు పెద్దగా ప్రచారం లేని Romanesque చర్చ్ ల గురించి ఒక లఘు చిత్రం తీయాలనే ఆలోచనలో కూడా వున్నాడు. అతనింట్లో అన్ని రకాల పశు పక్ష్యాదులనూ పెంచుకున్నాడు. ఊసరవెల్లి, చిలుక, ఉడుత, తాబేలు, మొసలి ఇలా ఎన్నో జంతువులు ఆయనింట్లో కాపురం చేసేవి; వీటిలో కొన్నింటి పేర్లను ఎలా ఉచ్చరించాలో కూడా నాకు తెలియదు. చనిపోవడానికి కొద్దిరోజులముందు, బ్రెజిల్ కి చెందిన ఒక రకమైన తొండకు జబ్బు చేయడంతో బలవంతంగా తిండి తినిపిస్తూ “ఈ జీవి చనిపోవడం కంటే ముందే నేనే పోతానని భయమేస్తోంది” అన్నారు.
ఈ లోకం మంచిదో చెడ్డదో నేను చెప్పలేను కానీ, Andre Bazin లాంటి వారి వల్లనే ఈ లోకం మేలైనదిగా వుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మంచితనమే మేలైనదని నమ్ముతూ, ఆ మంచితనాన్ని జీవితంలో అమలుపరుస్తూ జీవించడం వల్లనే ఆయనతో పరిచయం కలిగిన వారందరికీ ప్రయోజనం కలిగింది. అందుకే Andre Bazin తో గొడవలు పెట్టుకున్న వారిని వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆయనతో సంభాషించిన వారెవరైనా, కేవలం ఒక్కసారి మాత్రమైనప్పటికీ, ఆయన్ని తమ ప్రియతమ మిత్రుడిగా భావిస్తారు. ఆయన లోని నిష్కాపట్యముతో ఎలాంటి వారైనా తమ లోని మంచిదనాన్ని ఒక్కసారైనా బయటకు తేవల్సిందే.
“ఇప్పటికీ మన మధ్యనే వున్నారు” అనో, లేదా “ఇంకా జీవిస్తూనే వున్నారు”అనో మాయ మాటలతో, బూటకపు పదజాలంతో వర్ణించడం ఆయనకి తప్పకుండా నచ్చుండేది కాదు. ఒక దారుణమైన, అత్యంత క్రూరమైన, శోకభరితమైన నిజమేంటంటే ఆయన మరణించారు; ఇక లేరు. మనం చేయగలిగిందేదైనా వుందంటే అది విలపించడం మరియు ఆయన వ్యాసాలను మళ్ళీ మళ్ళీ చదవడం. చనిపోవడానికి కొన్ని రోజుల క్రితమే ఆయన రాసిన ఒక వుత్తరంలోని ఈ విషయం చదివితే ఈయన అవలంబించిన సూక్ష్మమైన ఆగమం ఎట్టిదో తెలుస్తుంది: “Cinematheque లో మీతో పాటు Mizoguchi సినిమాలు మరోసారి చూడలేకపోయినందుకు నన్ను క్షమించండి. Mizoguchi ని మీరెంత ఇష్టపడతారో నేను అంతే విధంగా ఆయన్ని ఇష్టపడతాను. అందుకు కారణం నాకు Kurosawa ఇష్టం కావడమే. వీరిద్దరూ నాణేనికి చెరో వైపూ. చీకటేంటో తెలియకుండా మనకి వెలుగంటే ఏంటో తెలిసే అవకాశం వుందా? Mizoguchi నచ్చినంత మాత్రాన Kurosawa నచ్చకపోవడమనేది వారిద్దరినీ అర్థం చేసుకోవడంలో మొదటి అడుగు. అలా కాకుండా కేవలం Kurosawa నే ఇష్టపడేవాడు నిస్సందేహంగా గుడ్డివాడే. అలాగే కేవలం Mizoguchi నే నచ్చేవాడికి ఒక్క కన్నే వున్నట్టు లెక్క. కళలన్నింటిలోనూ కొన్ని భావగర్భితమై, ఆలోచనలు రేకెత్తించేవిగానూ వుంటే మరికొన్ని ఆలోచనకి అతీతంగానూ, భావోద్వేగాలతోనూ వుంటాయి.”
Andre Bazin గురించి Jean Renoir రాసిన ముందుమాట.
ఏ రోజుల్లో అయితే రాజులు మనసున్న మారాజులో, ఏరోజుల్లో నయితే పేద వాడి పాద పూజకు సైతం రాజులు ముందడుగువేసేవారో, ఏ రాజుల అడుగుల సవ్వడికే విపరీతమైన జాడ్యముతో బాధ పడుతున్నవారు సైతం స్వస్థత చెందేవారో, ఆ రోజుల్లో ఆ రాజుల గొప్పతనాన్ని కీర్తించడానికి కవీశ్వరులుండేవారు. కానీ చాలా పర్యాయల్లో గేయం కంటే గాయకుడు, కవిత్వం కంటే కవి, కథ కంటే కథకుడూ గొప్పగా ప్రస్తావించబడడం చుస్తూనే వుంటాం.. సినిమా విషయంలో Bazin సరిగ్గా ఇలాంటి వాడే. కానీ కథలోని ఆ భాగం భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు జరుగుతున్నదంతా మూలవస్తువలన్నింటినీ ఒక సమూహంగా చేర్చడమే. నాగరికత అంటే పనికిరాని వాటిని జల్లిస్తూ వెళ్ళడమే కదా. చివరికి మేలైనదే మిగుల్తుంది. Villon రోజుల్లో Seiene నది ఒడ్డున కవులు విస్తారంగా వుండే వాళ్ళని నేనొప్పుకుంటాను. కానీ ఇప్పుడు వారంతా ఎక్కడ? ఎవరు వారంతా? ఎవ్వరికీ తెలియదు. కానీ Villon మాత్రం ఇంకా అక్కడే వున్నారు, పరిపూర్ణంగా మరియు పవిత్రంగానూ.
గతం మిగిల్చిన అపూర్వ అవశేషాలను క్రమ పర్చుకోవడంలో రాబోయే తరాల వారికి వెలకట్టలేని సాయం అందుతుంది. వారికి చేయూతగా Bazin వాళ్ళతో వుంటాడు. ఆ రోజుల్లో రాజులను కీర్తించడానికి కవీశ్వరులున్నట్టే, సినిమాకీ ఒక కవి ఉంటాడు. అప్పటి రాజులకు కవీశ్వరులు ఎలా అయితే కీర్తి కిరీటాన్ని అందజేసారో అలాగే అల్పాయుష్కుడు, అశక్తుడు, నిగర్వి, సాత్వికుడు అయిన Bazin సినిమాకీ రాజత్వం కలిగిన నూతన కల్పనాధికారాన్ని అందచేసారు. ఏ రాజుకైతే కిరీటం పొదిగి ఎంతటి గుర్తింపు నద్దిచ్చాడో అదే రాజు ధరించిన కృత్రిమమైన తళుకు బెళుకులను పీలికలు చేసి బంధాలనుంచి విముక్తి గావించి అభివృధ్ధి పథాన్ని సూచించాడు. అశుధ్ధాల నుంచి శుభ్రం చేయబడి, పరిశుధ్ధాత్మగా గావింపబడ్డ మేలైన మహరాజునే మన మనవళ్ళు మనమరాళ్ళు కలుసుకొని, తెలుసుకొని అహ్లాదోత్సాహాలు పొందుతారు. అదే సమయంలో ఆ రాజునంతటి వాడిని చేసిన ఆ కవి కూడా వారికి గోచరిస్తాడు. ఎలా అయితే గాయకుడు ఒక్కోసారి గేయం కంటే గొప్పవానిగా పరిగణించబడతాడో అలాగే వారు Andre Bazin ను మరో సారి కనుగొంటారు, ఆయన సేవల్ని శ్లాఘిస్తారు.
రాబోయే తరాల వారిపై Bazin ఎంతటి ప్రభావం కలుగచేస్తాడో అన్న విషయంలో సందేహం లేదు. సినిమా అనే ప్రక్రియ అంతమొందినప్పటికీ ఆయన సినిమా గురించి చేసిన రచనలు మాత్రం పదిలంగానే వుంటాయి. సినిమా అనే కళ ఒకటి వుండేదని రాబోయే తరాల వారికి ఈ వ్యాసాలే సాక్ష్యాలవబోతాయి కాబోలు. ఈయన రచనల ద్వారా, మానవులు తమ మనసులో ఒక తెరను ఊహించుకుని, దానిపై వేగంగా పరిగెట్టే ఒక గుర్రాన్ని, ఒక అందమైన యువతి క్లోజప్ ను, తుది శ్వాశ విడుస్తున్న ఒక వీరుని చూడగలుగుతారు. ఆ చిత్రాలకు ఎవరికి తగ్గట్టు వారు అర్థాలు వెతుక్కుంటారు. కానీ వీరందరు మాత్రం What is Cinema? గ్రంధం యొక్క నాణ్యత గురించి మాత్రం ఏకీభవిస్తారు. ఎలా అయితే గతించిపోయిన నాగరికతకు చెందిన ఆనవాళ్ళు ఒక్కో సారి మన ఊహలకందవో అలాగే ఈ వ్యాసాలు కూడా గతించిన పోయిన సినిమా అనే కళను గురించి మనతో మాట్లాడ గలుగుతాయి, అచ్చెరువు కలుగచేస్తాయి.
రాబోయే తరాలకు Bazin వ్యాసాల ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నది సత్యం. తన సమకాలీనులపై ఈయన ప్రభావమే ఆయనపై నాకీ ఉన్నత అభిప్రాయం కలిగేలా చేసింది.అందుకే నా హృదయంలో ఆయనకు ఎప్పటికీ పదిలంగా స్థానం కల్పించబడింది. ఒకప్పటి సత్పురుషులు బానిసలకు మానవ ధర్మం యొక్క విలువను తెలియచేసినట్లు గానే Bazin, మాకూ మా వృత్తి యొక్క పవిత్రతని తెలియచేసారు.
ముగింపు
సినిమాల గురించి ఆసక్తి కలిగిన వారందరూ చదవాల్సిన పుస్తకాల్లో ఒకటి “What is Cinema?” అలాగే Gilles Deleuze అనే ఫ్రెంచ్ తత్వవేత్త రాసిన సినిమా వ్యాసాలు కూడా సినిమా అనే ప్రక్రియ కేవలం వినోదాన్నందించే సాధనంలా కాకుండా మానవ మేథస్సుని ఇనుమడింపజేసే సాధనంలా చూడడంలో వుపయోగపడతాయి. సినిమాలు తీయడంతో పాటు వాటి గురించి విశ్లేషించడం కూడా సినిమా అభివృధ్ధి చెందడంలో ఎంతో దోహదం చేస్తాయి.
అలాగే సినిమాలు తీసే దర్శకులు కూడా ఒక్కోసారి తాము చూసిన, తీసిన సినిమాలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలు ఇప్పుడు వెలకట్టలేని గ్రంథాలుగా మనకి లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు సత్యజిత్ రే వ్యాసాల సంపుటం “Our Films - Their Films” అయినా, Alfred Hitchcock తో Francois Truffaut చేసిన ఇంటర్వ్యూలతో కూడిన పుస్తకమైనా, Andrei Tarkovsky రచించిన Sculpting in Time అనే గ్రంథమైనా సినిమా అనే ప్రక్రియకు పవిత్రతను చేకూరుస్తాయి.
ఒక దేశం యొక్క సినిమాలలో మార్పు రావడానికి ఇలాంటి విశ్లేషణా వ్యాసంగాలు ఎంతగానో ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ ఇలాంటి ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. www.passionforcinema.com అనే website ఈ మధ్యనే సినీ ప్రముఖులను, ప్రేక్షకులను, విశ్లేషకులను ఒక చోటికి చేర్చే ప్రయత్నంలో దాదాపు సఫలం కాగలిగింది. మూస సినిమాల ఒరవడిలో కొట్టుకుపోతున్న మన సినీ పరిశ్రమను రేపటి రోజున ఇలాంటి ప్రయత్నాలే కాపాడతాయని ధృఢమైన నమ్మకం.
బాజిన్ 50 వ వర్థంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాము.ఈ వ్యాసం మొదట పొద్దులో, ఆ తర్వాత నవతరంగంలో ప్రచురింపబడింది.
జ్ఞాపకాలు, ఆలోచనలు, విశేషాలు -14
మహా నటి సావిత్రి
గతంలో ఎన్నడూ చూడని అరుదైన చిత్రాలు అందించినందులకు అభినందనలు. మీ వ్యాసం మరో సారి మహా నటిని గుర్తుకు తెచ్చింది. ఆమె జీవితం ఇప్పటి నటీమణులకు ఒక కనువిప్పు కాగలదు.
http://aradhanaa.blogspot.com/2008/11/blog-post_22.html
సిటిజెన్ కేన్
ఆస్ర్టేలియా
‘ఒక మూటలో పట్టేవాటి కన్నా ఎక్కువ నాదగ్గర ఏమీ లేవు. మనతో కూడా ఏమీ తీసుకెళ్ళలేం, మనగురింఛి చెప్పుకోడానికి ఒక కథ తప్ప’ అన్న అర్ధంలో ఒక మాట అంటాడు ‘ఆస్ట్రేలియా’ సినిమాలో డ్రోవర్ (హ్యూజ్ జాక్ మాన్) తన వాహనంలో డజన్ల పెట్టల సామన్లతో ప్రయాణం చేస్తున్న లేడీ సారా ఆష్లీ (నికోల్ కిడ్ మాన్)తో. ఒక మంచి మహాకావ్యం (epic) చూపిస్తానన్నాడు కదా అని కూర్చుంటే అరడజను కథలు కలగాపులగం చేసి, దానికి యింకొన్ని డజన్ల కొత్తదనం లేని  సన్నివేశాలని (cliché) కలిపి మూడుగంటలు కూర్చో పెట్టాడు బజ్ లుహ్ర్మన్. మధ్యలో, కనీసం రెండు సార్లు సినిమా అయిపోయివుంటుదనుకుని లేవబోయి, నికొల్ కిడ్ మాన్ ఇంకా తెరమీద కనబడుతుంటే లేవడానికి మనసొప్పక వుండిపోయాను.
సినిమా మొదట్లో, రెండో ప్రపంచ యుద్ధంలో జపాను సేనలు పెరల్ హార్బరు మీద బాంబులేసేసాకా వెనక్కి వస్తూ ఆస్ట్రేలియాలోని ఉత్తర భాగంలో డార్విన్ అనే చిన్న పట్టణం మీద దాడిచేసారని చెప్పడంతో మొదలై, వెంటనే ‘దొంగిలించబడ్డ తరాలు’ (Stolen Generations)  మీదకి మళ్ళుతుంది. ఆస్ట్రేలియాకి వచ్చిన తెల్ల మిషనరీలు, అక్కడి స్థానికులైన అబొరిజనల్ (Aboriginal) పిల్లల్ని ‘నాగరీకుల్ని’ చేయడానికి వాళ్ళకుటుంబాల నుంచి బలప్రయోగంతో విడదీసి వాళ్ళదికాని సంస్కృతిని వాళ్ళ మీద రుద్దడానికి తరతరాలుగా చేసిన దాడిని, దొంగిలించబడ్డ తరాలపేరుతో వ్యవహరిస్తారు. ఈ విధానాన్ని 1973లో ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టవ్యతిరేకం చేసింది.
నుల్హా (బ్రాండన్ వాల్టర్స్) అనే పిల్లవాడికి ‘కింగ్’ జార్జ్ అనే అతని తాత ప్రకృతిలో మనిషి మనుగడకి అవసరమైన విద్య నేర్పుతుండడంతో కథనం మొదలవుతుంది. ఈ పిల్లవాడి తల్లి అబొరిజనల్ స్త్రీ. ఆమెకీ, ఆమెని బలవంతంగా లోబరుచుకున్న తెల్లవాడికీ – ఫ్లెచర్ కి - పుట్టిన సంతానం నుల్హా. అతని లాంటి వాళ్ళని అధికారులు చూస్తే బంధించి తీసుకుపోతారు. కింగ్ జార్జ్ మనవడికి చేపలుపట్టడం, పాటలూ నేర్పుతుండగా ఒక తెల్లవాడి హత్య జరుగుతుంది. ఈలోపు ఇంగ్లాండ్ లో వున్న లార్డ్ ఆష్లీ భార్య సారా, భర్త ఆస్ట్రేలియానుంచి తిరిగిరాకపోవడానికి కారణం నిజంగా అతను తన పశువుల్ని డార్విన్ కి తోలుకెళ్ళి అమ్మడానికి కాదని, అక్కడి ఆడవాళ్ళకోసం వుండిపోయాడని అనుమానంతో భర్త వారిస్తున్న వినకుండా అస్ట్రేలియా వస్తుంది. ఆయన, తనకి డార్విన్ రావడం కుదరక తన స్నేహితుడు డోవర్ ని భార్యని ఫారెవే డౌన్స్ కి తీసుకురావడానికి పంపుతాడు. ఆ తరవాత, మనం చాలా సినిమాల్లో చూసేసిన సన్నివేశాలే – స్వతంత్రేచ్ఛే తప్ప ఏమీకోరని అందగాడైన భార్య చనిపోయిన పేదవాడికి, అంతకంటే అందగత్త అయిన స్నేహితుడులాంటి గొప్పవాడి భార్యకి భవిష్యత్తులో ప్రేమ బంధ ఎర్పడాలంటే ముందు ఏమేమి జరగాలో అవన్ని - జరిగాక యింటికొచ్చి, హతుడైన భర్తని చూసి ఎస్టేట్ ని ఏదో ఒక ధరకి ఆస్ట్రేలియా భీఫ్ వ్యాపారంలో రారాజుగా వెలుగుతున్న కార్నేకి అమ్మి వెనక్కి వెళ్ళిపోదామనుకుంటుంది సారా. ఆ రాత్రి నుల్హా ద్వారా ఎస్టేట్ లో పనిచేసే ఫ్లెచర్ కుట్ర తెలుసుకుని ఫ్లెచర్ ని పనిలోంచి తీసేస్తుంది. పశువుల్ని కార్నేకి అమ్మకుండా ఎలాగైన డార్విన్ తీసుకువెళ్ళి సైనికులకి ఆహరం కోసం పశువులు కొనాలనుకుంటున్న ఆర్మీకి అమ్మడానికి నిశ్చయించుకుని నుల్హా, కింగ్ జార్జ్, డ్రోవర్ మొదలైన వాళ్ళ సహాయంతో ప్రత్యర్ధులు సృష్టించిన అవరోధాలు దాటుకుని డార్విన్ కి తీసుకువెళ్ళి ఆర్మీకి అమ్ముతుంది. ఈ లోపు డ్రోవర్ మీద ప్రేమ కలగడం, పిల్లవాడు నుల్హా మీద అభిమానం పెరగడం, అతన్ని పెంచుకోవాలనుకోవడం వగైరా సన్నివేశాలు జరగుతాయి. సినిమా అయిపోయిందేమోనని భ్రమ కలుగుతుంది.
తరవాత కథ డ్రోవర్, సారా దగ్గర, వేసవిలో తన రవాణా వ్యాపారానికి అడ్డుపడననే హామీ తీసుకుని సహజీవనం ప్రారంభిస్తాడు. సారా, డ్రోవర్ల పనితనం, మంచితనంతో ఫారవే డౌన్స్ లో గొప్పగొప్ప మార్పులు వస్తాయి. సారా నుల్హాని పెంచుకుంటుంది. అది తెలిసీ, స్థానిక పోలీసులు ఆమె మంచితనం వల్ల దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు, మనకీ సినిమా చివరికి వచ్చిందోమోనన్న ఆశ చిగురిస్తుంది. ఈ లోపు ఫ్లెచర్, కార్నేని చంపి అతని కూతుర్ని పెళ్ళి చేసుకుని ఆతని వ్యాపారాలకి నాయకుడై సారా ఫారెవే లాండ్స్ మీద కన్నువేసి ఆమెని వెళ్ళగొట్టాలనే ప్రయత్నాలు చేస్తుంటాడు, పిల్లవాణ్ణి పోలీసులు పట్టుకుపోతారు, డ్రోవర్ కి, సారాకి గొడవలు జరుగుతాయి, మనకి సినిమా అయిపోతుందన్న ఆశ అడుగంటుతుంది.
జపాను వాళ్ళ బాంబుదాడి, ఆ యుద్ధంలో సారా, డ్రోవర్, నుల్హా, ఫ్లెచర్, కింగ్ జార్జ్ వగైరాలు ఏం చేసారు, మిగిలారా, కడతేరారా, సారా నుల్హాని పెంచుకోగలిగిందా, తాత దగ్గరకి పంపిందా లాంటి వన్నీ తరవాతి ముఫై నిమిషాల క్లైమాక్స్ లో చూడచ్చు.
ఔట్ బేక్ లాండ్ స్కేప్, మంచి ఫొటొగ్రఫీ, నేపథ్య సంగీతం, నికొల్ కిడ్ మాన్ నటన యిలా, సాంకేతికంగా ఎన్ని హంగులు వున్నా, ఎపిక్ తీయాలనే తాపత్రయంలో విస్తృతమైన పరిధిలో కథ తీసుకుని, దాన్నినడిపించడంలో తీవ్రంగా వైఫల్యం చెందడం ఈ సినిమాలో కనిపిస్తుంది. విస్తృతమైన విషయాన్ని ఎంచుకున్న ప్రయోక్తకి తను వ్యక్తం చేయదలచిన అభిప్రాయాలపట్ల వుండవలసిన తాత్వికమైన స్పష్టత కనబడదు. ఉదాహరణకి అబరొజినల్ మనుషుల్ని బలవంతంగా తీసుకువెళ్తున్న తెల్లవాళ్ళు ఆ సంస్కృతికి చేస్తున్న అపకారం లాంటిదే, మంచివాళ్ళు – సారా లాంటి వాళ్ళు – నల్హా పట్ల ప్రేమతో అతన్ని తాత దగ్గరకు వెళ్ళకుండా ఆపడం కూడా అన్న డ్రోవర్ అభిప్రాయం, అతనికీ, సారాకి మధ్య ఒక ఘర్షణకి కారణం. మంచి దర్శకుడు అలాంటి వైరుధ్యలకి వున్న సామర్ధ్యాలని డ్రామాకి బాగా వుపయోగించుకోగలుగుతాడు.
లుహ్ర్మన్ కి సహజత్వం పట్ల అంత పట్టింపుకూడా వున్నట్టులేదు. పాత్రల పరివర్తనలు పెద్ద మోటివేషన్ లేకుండానే జరిగిపోతుంటాయి. ఈ సినిమా కథనంలో సృజనాత్మకత వెతకాలనుకునే వాళ్ళు చాలా కష్టపడాల్సిందే. ప్రతి సన్నివేశం అంతకుముందు ఎక్కడే చూసినట్టే అనిపిస్తుంది, బహుశా లుహ్ర్మన్ ఉద్దేశించిన ప్రేక్షకులు పాతసినిమాలు చూడని టీనేజర్స్ కావచ్చు. అయితే అస్ట్రేలియన్ లాండ్ స్కేప్ ని యింత సమర్ధవంతంగా వుపయోగించుకున్న చిత్రం యిదేకావచ్చు.
ఈలాంటి సినిమాలని థియేటర్ లోనే చూడాలి, అప్పుడే వైల్డ్ అస్ట్రేలియా సౌందర్యం పూర్తిగా కనపడడం మాత్రమే కాక, మధ్యలో లేచి వెళ్ళగలిగే అవకాశం కూడా తక్కువగా వుంటుంది. నావరకైతే, నికొల్ కిడ్ మాన్ అద్భుతమైన పాత్రధారణ వుంది కనక, యింకోసారి చూడాల్సివస్తే కూడా పెద్దగా విచారించను.
దర్శకత్వం: బజ్ లుహ్ర్మన్
నిర్మాతలు: బజ్ లుహ్ర్మన్, కేథరిన్ నాప్మన్, జి. మాక్ బ్రౌన్
చిత్ర రచన: బజ్ లుహ్ర్మన్, రోనాల్డ్ హార్వుడ్, స్ట్రాట్ బీయాట్టి, రిచర్డ్ ఫ్లాన్గన్
నటులు: నికోల్ కిడ్ మాన్, హ్యూజ్ జాక్ మాన్, బ్రాండన్ వాల్టర్స్
విడుదల: నవంబరు 26 2008
–రమణ (స్వగతాలు)