స్త్రీలను సతీ అనసూయలుగానూ, సతీ సావిత్రులుగానూ, మహా పతివ్రతలుగానూ చిత్రిస్తూ మన భారతీయ సినిమాల్లో అనేక చలన చిత్రాలు వచ్చాయి. కాని సతీ సహగమనాన్ని కథాంశంగా తీసుకుని దాన్ని సమర్ధిస్తూనో, లేదా వ్యతిరేకిస్తూనో వచ్చిన చిత్రాలు స్వల్పం. సతీ సహగమనాన్ని మూఢాచారంగా ఖండిస్తూ సాహిత్య రంగంలో అనేక రచనలు వచ్చాయి. ఓ పెద్ద సామాజికోద్యమమే వచ్చింది. అయితే సతీ సహగమనాన్ని కమల్ కుమార్ మజుందార్ రాసిన నవల ఆధారంగా గౌతం ఘోష్ నిర్మించిన “అంతర్జలీ యాత్ర” విషయ పరంగానూ, చిత్రనిర్మాణ పరంగానూ దర్శకుడి ప్రతిభకు ఆనవాలుగా నిలిచింది. గౌతం ఘోష్ మన తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమయిన పేరు.. ‘మాభూమి’ చిత్రం ద్వారా మన తెలుగు చిత్రసీమకి నవ్య చిత్ర దృక్పధాన్ని, ఒరవడిని చవి చూపించిన ప్రతిభావంతుడాయన. తెలంగాణాలో పెల్లుబికిన నిజాం వ్యతిరేక పోరాటాన్ని నడిపిన అశేష జనవాహిని చరిత్రను ‘ మాభూమి ‘ నిజాయితీగా చిత్రించింది. ‘మాభూమి’ తర్వాత గౌతం ఘోష్ ‘ థకల్, పార్’ లాంటి చిత్రాల్ని నిర్మించాడు. 1987 లో ఆయన ‘అంతర్జలీ యాత్ర’ కు దర్శకత్వం వహించాడు. 1960లో శుద్ధ బెంగాలీ భాషలో విరచితమైన నవలను మూలకథగా తీసుకొని స్వల్పమైన మార్పులతో చిత్ర నిర్మాణం చేపట్టాడు గౌతం. నవలలోని మౌళికాంశం చెడకుండా అతి సున్నితత్వంతో కళాత్మకతతో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

నిజానికి ‘సతీ సహగమనం’ స్త్రీలకు వ్యతిరేకమైన విషయం. ఆ విషయాన్ని కథాంశంగా ఎన్నుకొని దాన్ని వ్యతిరేకిస్తూ స్త్రీల పక్షాన నిలబడి చిత్రాన్ని పాజిటివ్ నోట్‌తో ముగిస్తాడు. సరిగ్గా ‘అంతర్జలీ యాత్ర’ చిత్రం నిర్మాణంలో ఉండగానే రూప్ కన్వర్ సతీ సహగమనం సంఘటన జరిగింది. దేశవ్యాప్తంగా దానికి వ్యతికేఅకంగా ఉద్యమ స్థాయిలో నిరసనలు పెల్లుబికాయి. ఆ సందర్భంలోనే అంతర్జలీ యాత్ర చిత్రం నిర్మితమవుతూ ఉండడంతో గొప్ప ఉత్కంటత రేకెత్తింది. ప్రగతిశీలి అయిన గౌతం ఎలాంటి గందరగోళానికి గురవకుండా ముందుకు సాగిపోయాడు.

‘అంతర్జలీ యాత్ర’ చిత్ర కథ 1830 ప్రాంతం నాటిది. గంగానదీ తీరాన డెల్టా ప్రాంతంలో చిత్రకథ యావత్తూ జరుగుతుంది. గంగానదికి దాని పక్కనే ఉన్న చిన్న గ్రామానికి నడుమ కథాకథనం కొనసాగుతుంది. ఆ ఒడ్డుపక్కనే స్మశానముంటుంది. దాని కాపరి చండాల్ భైజూ అక్కడనే నివసిస్తూ ఉంటాడు. ఓ పక్క ప్రవహించే నది జీవితానికి సంకేతంగా ఉంటే మరోవైపు స్మశానం చావుకు ప్రతీకగా ఉంటుంది. ఇందులో ప్రధాన పాత్రధారి చావుకు సిద్ధంగా ఉన్న ముసలి బ్రాహ్మడు సీతారాం. చావుబతుకుల మధ్య కొడిగట్టనున్న దీపంలా రెపరెపలాడుతున్న సీతారాంని గంగానది ఒడ్డుకు తెస్తారు. స్థానికంగా ఉన్న ఓ జ్యోతిష్కుడు సీతారాం మరో మూడు రోజుల్లో చనిపోతాడని అయితే అతనితో సహగమనం చేసే భార్య ఉంటే పున్నామ నరకాలనుండి తప్పించుకుని ఉన్నత లోకాలకు వెళతాడని చెబుతాడు. కాని చట్టరిత్యా సహగమనం అప్పటికే నేరం. అయినా ఆ ఊరి పెద్దలంతా కలిసి చావుకు సిద్ధంగా ఉన్న సీతారాంకి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తారు. ఆ ఊర్లోనే అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న కృష్ణప్రసాద్(బసంత్ చౌదరీ) తన కూతురు యశోబతిని సీతారాంకివ్వడానికి అంగీకరిస్తాడు. ఆమెకు కర్మ సిద్ధాంతాన్ని తన పేదరికాన్ని చూపి సతికి అంగీకరింప చేస్తాడు. నది ఒడ్డునే సీతారాం, యశోబతిల పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతాయి. ఊరంతా ఈ పెళ్ళిని అంగీకరించినా కాటికాపరి బైజూ మాత్రం వ్యతిరేకిస్తాడు. కాని నిమ్న జాతికి చెందిన అతని ఎవరూ లక్ష్యపెట్టరు. పెళ్ళి జరిపించి తర్వాత ఆ ఇద్దరిని అక్కడే వదిలేసి అంతా వెళ్ళిపోతారు. పెళ్ళి అవగానే ఉరకలేసిన సీతారాం భార్యతో శోభనానికి సిద్ధపడతాడు. కాని ముసలి శరీరం సహకరించక విఫలం చెందుతాడు. తన వైఫల్యాన్ని కప్పి పుచ్చి ఆ స్థితిలో కూడా సీతారాం యశోబతిపై విరుచుకు పడతాడు. ఆ అమ్మాయి అపప్టికే కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించి సతివల్ల ఒనగూడనున్న మంచిని తలపోస్తు అన్నీ సహిస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న బైజూ ముసలివాన్ని వదిలేసి పొమ్మని యశోబతికి బోధిస్తాడు. పలు విధాలుగా కోపంతోనూ, దుఃఖంతోనూ యశోబతికి చెప్పి చూస్తాడు. సతి గురించి అధికారులకు చెప్పేందుకు కూడా విఫలయత్నం చేస్తాడు. ఎంతగా చెప్పినా యశోబతి అంగీకరించకపోవడంతో సీతారాంను గంగలోకి తోసేందుకు కూడా బైజూ ప్రయత్నిస్తాడు. దాంతో యశోబతి కోపంగా బైజూను కర్రతో బాదుతుంది. నది ఒడ్డున బురదలో గాయపడ్డ బైజూ విలవిలలాడతాడు. కొంతసేపటికి యశోబతి బైజూ చెంతకు చేరి గాయల్ని తడిమి బాధగా ఉందా అని అడుగుతుంది. ఆమె స్పర్శ బైజూలోనూ, బైజూ శరీరం ఆమెలో సంచలనం కలిగిస్తుంది. ఇద్దరూ ఒకటవుతారు. ఇంతలో ఉప్పొంగిన నది సీతారాంని ముంచెత్తుతుంది. అతన్ని రక్షించే యత్నంలో యశోబతి కూడా ప్రవాహంలో పడిపోతుంది. రక్షించండి.. రక్షించండి అంటూ యశోబతి నీటిలో కొట్టుకుపోతుంది. బైజూ ప్రేక్షకుడిలా నిలుచుండిపోతాడు. మొదట్నించీ చివరి దాకా నది ఒడ్డునే ఉన్న కర్ర పడవపై ముద్రించి ఉన్న రెండు కళ్లు ఈ మొత్తం జీవన్మరణ సంఘటనల్ని వీక్షిస్తూనే ఉంటాయి.

నవలలోంచి మొత్తం వివరాల్ని చిత్రంలో అందించిన దర్శకుడు చిత్రీకరణలో ఎనలేని ప్రతిభను కనబరుస్తాడు. అతని సృజనాత్మక ఆలొచనలకు, ఆయనకున్న సాంకేతిక పరిజ్ఞానం తోడై గొప్ప చిత్రంగా రూపొందింది. మొత్తంగా నది ఒడ్డునే సాగె ఈ చిత్రంలో రాత్రిని, పగటిని రోజులోని భిన్న స్మాయాల్ని చిత్రించడంలో దర్శకుడి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయయ ఉపయోగించిన లైటింగ్ ఆయా మూడ్స్ ని సాధించడంలో విజయవంతమయింది. చిత్రంలో ధ్వని గొప్ప భావుకతను అందిస్తుంది. కేవలం సంభాషణలున్నప్పుడు మాత్రమే నేపధ్య సంగీతం వినిపించి మిగతా సమయాల్లో గంభీర నిశ్శబ్దం చిత్రనికే విలక్షణతను ఆపాదించింది. అపుడపుడూ గంగానది పైనించి వీచే గాలి సృష్టించే మంత్రధ్వని దుఃఖాన్ని, తీవ్రమైన ఎమోషన్ ని ధ్వనింప చేస్తుంది. నిజానికి చిత్రంలోని నిశ్శబ్దమే గొప్ప సినిమాటిక్ సంగీతం. చిత్రం చివరన నది ఉప్పొంగి ఉధ్వేగభరితమయిన సన్నివేశంలో సంగీత ధ్వని కోపాన్ని, ఆవేశాన్ని ప్రతిధ్వనింప చేస్తాయి. నటీనటుల విషయంలో శతృఘ్న సిన్హా తన జీవిత కాలంలో గొప్ప పాత్ర పోషించారు. ఇక యశోబతి పాత్రలో నూతన నటి షంపా ఘోష్, ముసలి సీతారాం పాత్రలో ప్రమోద్ గంగూలి (80) సజీవంగా నటించారు. అలనాటి స్త్రీ సమస్యని అత్యంత ప్రతిభతో చలన చిత్రంగా మలచి గౌతం ఘోష్ గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా వచ్చింది. ‘అంతర్జలీ యాత్ర’ బెంగాలీ చిత్రం కాగా, ‘మహాయాత్ర’ హిందీ చిత్రం.

అంతర్జలీ యాత్ర ( బెంగాలీ )

సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం – గౌతం ఘోష్,

నిర్మాణం – ఎన్.ఎఫ్.డి.సి,

నటీనటులు – శతృఘ్న సిన్హా , షంపా ఘోష్,

Posted by వారాల ఆనంద్ on July 02, 2009 06:30 PM · permalink

ఈ వారం అనుకోకుండా ఒక మంచి సినిమా చూసాను. ఇది ‘ద లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్లాండ్’. ఏదో మామూలు మూడ్ లైట్ చేసుకుందామని, దీని ఓ, నా, మా లు తెలీకండా, ఇదేదో ఫన్నీ సినిమా అనుకుని, చూసాను గానీ, కొంచెం కధ లో మునిగేదాకా నేనెందులో పడ్డానో తెలిసిరాలేదు. ఒకసారి నా బ్లాగ్ లో ‘ఇండిపెండెంట్’గారు, ‘కొలంబియా లో ఇంగ్రిడ్ విడుదల’ గురించి రాసినపుడు, వ్యాఖ్యానిస్తూ, ఆపరేషన్ ఎంటెబ్ గురించి వీడియో లింక్ ఇచ్చారు. వీడియో పని చెయలేదు గానీ, దాన్ని గురించి అపుడే వికీపీడియాలో చదివి థ్రిల్ అయ్యాను. ఈ సినిమాలో ఆపరేషన్ ఎంటెబ్ కొంచెం కల్పితంగా ఉంటుంది.

ఈ సినిమా ప్రధానంగా, ఉగాండా నిరంకుశ అధినేత, నరరూప రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న ‘ఈడీ ఆమిన్’ జీవితం గురించి – సగం నిజం, సగం కల్పనా కలిపి, ప్రముఖ జర్నలిస్ట్ గైల్స్ ఫోడెన్, తన కళ్ళారా చూసిన వాస్తవాల సాయంతో రాసిన నవల, ‘The Last King of Scotland’ ఆధారంగా తీసినది. సినిమా – స్కాట్లాండు లో అపుడే వైద్య విద్య లో పట్టబధ్రుడైన – విలాస పురుషుడు – జీవితంలో కొంత వినోదం, కొంత సాహసం ఉండాలనుకునే నవ యువకుడి పరిచయంగా – హీరో – డా.నికోలస్ గారిగన్ పరిచయంతో మొదలు ! కేవలం – సరదాకి, కొంచెం సాహస జీవితం అంటే ఉన్న కుతికీ – కోతి లాంటి బుద్ధితో, కేవలం చాన్సు తీసుకుని ఆఫ్రికన్ దేశమయిన ఉగాండా కి ఒక మిషనరీ కోసం పనిచేయడానికి వస్తాడు నికోలస్.

నికోలస్ దిగేసరికీ, దేశం అంతా, తుపాకులూ, టాంకులూ, సైనికులూ – భీభత్సంగా ఉంటుంది. ఇదేంటీ – అని అడిగితే, మిషనరీ నడిపే వ్యక్తి భార్య ఇది ‘కూ’ (సైనిక తిరుగుబాటు) అనీ, ‘మిల్టన్ ఒబటు’ ప్రభుత్వాన్ని కూలదోసి, కొత్తగా ‘ఈడీ అమిన్’ అధ్యక్షుడయ్యాడనీ, అందుకే ఈ సంత అంతా అని, కూల్ గా చెప్తుంది. ఉగాండా చాలా అస్థిరమైన దేశం. ఇక్కడ సైనిక పాలనా, తిరుగుబాట్లూ, నియంతృత్వం, ఆటవిక పాలనా, సర్వ సాధారణం.

మొత్తానికి ఆ దేశంలో జరుగుతున్న ‘సంబరాన్ని ‘ కాస్త దగ్గరగా చూసే అవకాశం వస్తుంది. కొత్త అద్యక్షుడి స్వాగతం (!) కోసం నికోలస్ పని చేస్తూన్న మారుమూల ప్రాంతాల్లో, గన్ పాయింటు కింద ఉత్సవాలు జరుగుతాయి. ఈ సంబరాలకు ఈడీ అమిన్ వస్తాడు. ప్రజల ముందు ‘నేనూ మీ వాడినే – అని ఉపన్యసిస్తాడు. ఆఫ్రికన్ పాటలు పాడతాడు. నృత్యాలు చేస్తాడు. అచ్చం మన రాజకీయ నాయకుల్లానే, ప్రజల మనసు గెలుచుకునే ఫీట్లు చేస్తాడు. ఇక్కడే అమిన్ ను మొదటి సారి చూసిన నికోలస్, ఈ అధ్యక్షుడు మంచివాడేనేమో అనుకుంటాడు. కానీ ఆ దేశంలో చాలా ఏళ్ళుగా ఉన్న మిషనరీ సభ్యురాలు మాత్రం, ఇదంతా బూటకమని చెప్తుంది.

ఇలా ఉంటూండగా, ఒకసారి, డాక్టర్ని వెతుక్కుంటూ, నికోలస్ దగ్గరికి సాయుధ సైనికులు కొందరు వస్తారు. అధ్యక్షులవారికి ఆ పల్లెటూరి దారెమ్మట వెళ్తూంటే, రోడ్డు పక్కన నడుస్తున్న ఒక ఎద్దు కొమ్ము తగిలి, చేతికి గాయమైంది. ఎద్దు కూ ఆయన ప్రయాణిస్తున్న జీపు తగిలి గాయాలయ్యాయి. ఎద్దు మరణ యాతన పడుతూ ఉంటుంది. దాన్నీ, దాన్ని పట్టుకున్న రైతునూ రోడ్డు పక్కకు ఈడ్చి, అధ్యక్షులు నొప్పితో చిందులు వేస్తుంటే, ఆ పల్లె లో డాక్టరు కోసం వస్తారు వీళ్ళు. నికోలస్ – వెంటనే వెళ్ళి, ఆమిన్ కు పరిచర్య చేస్తాడు. ఈ లోగా ఎద్దు – ఆ పక్కనే పడి, గోల గోలగా రోదిస్తూంటే, విసుక్కుని, ఆమిన్ పిస్టల్ తీసుకుని దాన్ని కాల్చి చంపేస్తాడు నికోలస్. ఆ ధైర్యానికి, ఈడీ అమిన్ పిస్టల్ నే తీస్కుని, అతని ఎదుటనే – ఎద్దుని చంపిన అతని సాహసాన్నీ, ఈడీ అమిన్ అభిమానిస్తాడు. మాటలు పొడిగిస్తూ, నికోలస్, స్కాట్ లాండ్ నుండీ వచ్చినట్టు తెలుసుకుని, ఈడీ ఆమిన్ స్నేహ హస్తం చాస్తాడు.

తనకు పెర్సనల్ డాక్టర్ గా ఉండమని, నికోలస్ ను కంపాలా వచ్చేయమని, ఆహ్వానిస్తాడు. మొదట ఈ ఆహ్వానాన్ని తిరస్కరించినప్పటికీ, అమిన్ చరిష్మా ని చూసి, భ్రమలో – నికోలస్ ఒప్పుకుంటాడు. సహజంగా, అతను స్కాటిష్ బూర్జువా కుటుంబం నుంచీ వచ్చినవాడు కావడం వల్ల, కంపాలా లో విలాస వంతమైన జీవితం, పూల్ సైడ్ పార్టీలూ, అందమయిన భవంతులూ, అమిన్ స్వయంగా బహూకరించిన మెర్సిడెస్ కారూ, నికోలస్ది కూడా, ఇది ఎన్నాళ్ళు జరుగుతుందో చూద్దాం – అనుకునే తత్వం వల్ల… అతను ఉగాండా దేనికొచ్చాడో మరిచిపోయేలా – చేసి, చూస్తూండగానే నికోలస్ రోజు రోజుకీ ఊబిలో కూరుకు పోతూంటాడు.

ఈ లోగా బ్రిటిష్ డిప్లోమాట్ లు – నికోలస్ తో మంతనాలు చేస్తుంటారు. నికోలస్ ఈ నియంత కు వ్యక్తిగత డాక్టర్, పైగా సన్నిహితుడు గాబట్టి, అతని ద్వారా, ఈ నియంతను తుదముట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. అయితే, ఈడీ అమిన్ – దురాగతాల గురించి చూచాయ గా తెలిసినా, ఉగాండా గురించి అతను ఏదో కల కంటున్నాడనీ, ఉగాండా లో మంచి పరిస్థితులు రావడం కోసమూ, ప్రత్యర్ధులను తొలగించుకోవడం కోసమూనే అమిన్ అలా రాక్షసుడి లా మారణ హోమాలు జరిపిస్తున్నాడనీ, అమిన్ మామూలుగానైతే మంచోడే అని – తాను ఇందులో పార్ట్ కాననీ – నికోలస్ భ్రమల్లో ఉంటాడు.

చూస్తూండగా, ఆమిన్ – 5గురు భార్యల్లో, నాలుగో భార్య, అందమయిన నల్ల శిల్పం, ‘కే’ తో పరిచయం మొదలవుతుంది. అప్పటికి – ‘కే’ కు ఒక మూర్చ వ్యాధిగ్రస్తుడైన కొడుకు పుట్టినప్పట్నించీ, అమీన్, ఆమెను దురదృష్టవంతురాలిగా భావించి, మిగిలిన భార్యల కు దూరంగా వేరొక భవంతి లో పెడతాడు. ఈ దురదృష్టవంతురాలికీ, నికోలస్ కూ ప్రేమ – ఆకర్షణా, రహస్య ప్రణయం కొనసాగుతాయి. కే కు తాను గర్భవతి అని తెలుస్తుంది. ఈ విషయం భర్త కు తెలిస్తే, తనని చంపేస్తాడని భయబ్రాంతురాలైన ఆమె, డా.నికోలస్ ను ఎబార్షన్ చేయమని అడుగుతుంది. కానీ అప్పటికే – అమీన్ – అన్ని రకాలుగా నికోలస్ ను చుట్టుముట్టి ఉంటాడు. తీయగా మాట్లాడుతూ, అనూహ్యమైన ఎత్తులు వేస్తూ, అతని పాస్పోర్ట్ కూడా నాశనం చేసి, అతనికి ఉగాండన్ పాస్పోర్ట్ ఇచ్చి – దిగ్భంధనం చేసేస్తాడు.

తీరా – అనుకున్న సమయానికి నికోలస్ రాలేకపోవడంతో నాటు వైద్యుడి దగ్గరకు వెళ్ళిన ‘కే’ ను అమిన్ ఆదేశాల మేరకు సైనికులు హత్య చేసి, ఆమె శరీరాన్ని ఖండఖండాలు గా నరికి, ప్రదర్శనకు పెడతారు – ‘అధ్యక్షుడిని మోసం చేసే వారి గతి ఇంతే!’ అని ప్రజలను భయపెట్టేందుకు. ఆ తరువాత అక్కడికి చేరుకున్న నికోలస్, ఆమె శవంలో, ఆమిన్ – రాక్షసత్వాన్ని చూసి, వెర్రెక్కిపోతాడు. అంతకు ముందే అధ్యక్షుడిని వ్యతిరేకించిన వారూ, ఉదారవాద ఉగాండన్లూ – అహింసావాదులూ ఒక్కొక్కరూ అదృశ్యం అవుతూండటం గురించి బ్రిటిష్ డిప్లొమాట్లు నికోలస్ తో ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలా ‘కే’ చావు, తదనంతరం-తన చావు, తన ముందు కనిపిస్తూండే వరకూ, అమిన్ రాక్షసత్వాన్ని అర్ధం చేసుకోలేని నికోలస్, ఆ క్షణంలో ఆవేశంతో ఊగిపోతాడు. బ్రిటిష్ డిప్లొమాట్ ను కలిసి, తన పరిస్థితి చెప్పి, దేశం వదిలి వెళ్ళడానికి సహాయం కోరతాడు. ఆ డిప్లొమాట్ – అమిన్ ను చంపే షరతు మీద సహాయం చేస్తానంటాడు.

క్లైమాక్స్ లో అమిన్ కు తల నొప్పి మందు ఇచ్చే మిష మీద కలవడానికి వెళ్తాడీ డాక్టర్. అక్కడ ఈలోగా వివిధ దేశాల్లో జైళ్ళలో మగ్గుతున్న కొందరు కరుడుగట్టిన పాలస్తీనియన్ తీవ్రవాదుల విడుదల కోసం, ఏర్ ఫ్రాన్స్ విమానం ఒకటి పాలస్తీన్ తీవ్రవాద సోదరుల చేత హైజాక్ చేయబడి కంపాలాలో ఎంటెబ్ విమానాశ్రయంలో దిగిందని కబురొస్తుంది. వెంటనే అక్కడికి వెళ్తాడు అమీన్, వెంటే, నికోలస్! ఈ లోగా నికోలస్ మీద అనుమానంతో అతన్ని అరెస్ట్ చేస్తారు అధ్యక్షుడి అంగరక్షకులు! నికోలస్ అధ్యక్షుడికి ఇవ్వబోయేవి తలనొప్పి మందులు కావనీ, విషం అనీ కనిపెడతారు. అమిన్, ఇజ్రాయెలు ప్రభుత్వం తోనూ, అంతర్జాతీయ సమాజం తోనూ సంప్రదింపులు జరుపుతూ, తన దేశపు విమానాశ్రయాన్ని తీవ్రవాదుల అడ్డా గా ఉపయోగించుకోవడాన్ని సమర్ధిస్తూ – ఈ మధ్య లో ఒక సారి – నికోలస్ ను కలుసుకోవడానికొచ్చి, ‘నీ గురించీ, కే గురించీ నాకు తెలుసు నికోలస్ – మా గ్రామంలో ఇలా ఇంకొకరి భార్య ను తీసుకున్నవాణ్ణి ఏమి చేస్తారో తెలుసా ? వాడి చర్మానికి హుక్స్ తగిలించి, వాణ్ణి అలానే చెట్టుకి ఎత్తులో వేలాడేస్తారు – ఆ రక్తం కారి కారి ఏ మూడు నాలుగు రోజులకో వాడు చస్తాడు. నువ్వూ అలానే చావాలి కాన్నా !’ అని చెప్పేసి, విశ్రాంతి తీసుకోవడానికి వెళిపోతాడు. సరిగ్గా ఇదే శిక్ష ని నికోలస్ కి అమలు చేస్తారు !

అప్పటికి – బందీ ల విషయం లో కొంత నిగోషియేష్ నడిచి, ఒక 100 మంది దాకా యూదులు కాని వారినీ, ఇజ్రాయిలీ లు కానివారినీ విడుదల చెయాలని నిర్ణయం జరుగుతుంది. మిగిలిన 122 మంది బందీలూ ఎంటెబ్ లాబీ లో ఉండిపోతారు. వీరిని తీసుకెళ్ళడానికి ఒక కార్గో విమానం వస్తుంది. దాన్లో వెళ్ళేందుకు బందీలను గుంపులుగా విడదీస్తూ ఉంటారు.

ఈ భయానక పరిస్థితుల్లో ఒక ఆశాకిరణం – అమిన్ కు ఇంతకు ముందు పెర్సనల్ డాక్టర్ గా పని చేసి, ఇప్పుడు కంపాలా లో అధ్యక్షుడు నిర్మించిన ఇంకో ఆధునిక ఆస్పత్రి లో పని చేస్తున్న డాక్టర్ – జుంజూ, ఆ సమయానికి విమానాశ్రయం లో క్షతగాత్రులయిన ఏర్ ఫ్రాన్స్ ప్రయాణీకుల కోసం వచ్చి వుంటాడు. అతనికి నికోలస్ పరిస్థితి మీద జాలి కలుగుతుంది. అప్పటికి – మొదట్లో నికోలస్ ను కొంచెం తిరస్కారంగా చూసినా, నికోలస్ కు మానవత్వం ఉందని, అతను అమిన్ కు అత్యంత సన్నిహితుడయ్యేంత రాక్షసుడు కాడనీ – అతను కేవలం ట్రాప్ చేయబడ్డాడనీ, అర్ధం చేసుకున్న డా. జుంజూ – ఒక హాలు లో చాతి కి ఇనుప కొక్కేలు తగిలించి సీలింగ్ కు వేలాడుతున్న నికోలస్ ను ఎవరూ చూడకుండా రక్షించి, డ్రెస్సింగ్ చేసి, రక్తాన్ని తుడిచి – ఇంక నువ్వీ దేశం లో ఉండొద్దు, బైటి ప్రపంచానికి ఈ దేశాన్ని గురించీ, అమిన్ గురించీ చెప్పు – అని – సగం మంది ప్రయాణీకులు విడుదల అవుతున్నారు – నువ్వు వాళ్ళలో కలిసిపో ! అని చెప్పి, నెమ్మదిగా విడుదల ఔతున్న కొందరు నాన్-ఇజ్రాయిలీ బందీ లతో నికోలస్ ను కలిపేస్తాడు. ఇలా నికోలస్ ను రక్షించినందుకు జుంజూ ను కాల్చి చంపేస్తారు.

నికోలస్ ఆ విమానంలో ఉన్నడని అమిన్ కి తెలిసేసరికీ, విమానం టేక్ ఆఫ్ అయిపోతుంది. అలా మృత్యువు కోరల దాకా వెళ్ళి, వచ్చిన డా.నికోలస్ – కేవలం కల్పిత పాత్రే అయినా, అమిన్ రాక్షసత్వాన్ని, మానసిన అసంతులితనూ బయట పెట్టేందుకు – చక్కని ఉదాహరణ ! కనీసం మూడు మిలియన్ల మంది అమాయక ఉగాండన్ ప్రజల్ని ఈడీ అమిన్ మట్టు పెట్టాడు. ఎపుడు తన మీద దాడి / హత్య కు కుట్ర జరిగినా తను ఎలా చనిపోతాడో,తనకు తెలుసు అనీ , తన చావు తన కల లోచూసాడనీ అంటూ – ఆవేశంతో మరిన్ని హత్యలకు పూనుకునే అమిన్ – ఫక్తు బ్రిటిష్ వ్యతిరేకి. స్వప్రయోజనాల కోసం, వివిధ దేశాల్లో పావులు కదుపుతూ, రాజకీయ అస్థిరత కు వాళ్ళే కారణమనీ, బ్రిటన్ పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసుల్లానే తమదీ, బ్రిటన్ తో పారంపరిక శతృత్వం అనీ, అందుకే స్కాట్లు తమ సోదరులనీ, తాను స్కాటిష్ కింగుననీ, తనకు తానే బిరుదిచ్చుకున్న ఘనుడు !

నెనెన్నో డీటైల్స్ చెప్పకుండా వొదిలేశాను గానీ – ఈ సినిమా లో – అమిన్ నిరంకుశత్వాన్ని, అతని రాక్షసతాన్నీ చూసేసరికీ గుండెలవిసి పోతాయి. పైగా నికోలస్ తో కూల్ గా చరిస్మాటిక్ గా వ్యవహరిస్తూ, పెద్ద ఉదారవాది లాగా ప్రపంచానికి ఫోసిచ్చే ఈ నియంత – రెండో కోణం – అత్యంత హేయం !!

అమిన్ గా నటించిన ఫారెస్ట్ స్టీవెన్ విటేకర్ కు అకాడమీ అవార్డ్ లభించింది. క్షణానికో మూడ్ లో ఉండే ఈ భయంకర పాత్ర పోషించినందుకు అతనికి జోహార్లు. మన ఎక్స్ ఫైల్స్ హీరోయిన్ స్కల్లీ ఎంతో అందంగా కనిపిస్తుంది మిషనరీ నడిపే అతని భార్యగా ! భీభత్సాన్ని తట్టుకోగలిగితే – తప్పకుండా చూడొచ్చు.

ఈ సినిమా కల్పిత ముగింపు తరవాత, ఎన్ని చర్చలు జరిపినా వినట్లేదని, నిజంగానే ఆపరేషన్ ఎంటెబ్ – అనే మిలిటరీ ఆక్షన్ ద్వారా – ఓ చీకటి వేళ, ఎంతో పక్కాగా ప్రణాళిక తొ సిద్ధమయి, నాటకీయంగా దాడి చేసి, ఎంటెబ్ విమానాశ్రయంలో ఏర్ ఫ్రాన్స్ బందీలందర్నీ ఇజ్రాయిలీ సైన్యం విడిపించుకు పోయింది. ఇలా దాడి చేసి, ఒక దేశపు సార్వభౌమత్వానికి విఘాతం కలిగించారని ఉగాండా – ఐక్యరాజ్య సమితి లో దొంగ ఏడుపులు ఏడిచింది. ఇలాంటి సినిమాలు చూస్తే, స్వతంత్ర భారత దేశం లో పుట్టినందుకు మనమెంతో పుణ్యం చేసుకున్నామని అనుకోవాలి.

Posted by సుజాత on July 01, 2009 06:36 PM · permalink

ఇక తెలుగు సినిమ పరిశ్రమకు మంచి రోజులు మొదలయ్యాయి.
టీ. సీ. సీ. పి . యస్ . ప్రధాన కార్యదర్శి నట్టికుమార్

(ఎందుకో … ? ఎందుకంటే … ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ‘ ఏర్పడ్డది కాబట్టి.)

“ఇక్కడ ఎవరి స్వార్ధం వారిది ..అవసరాలు తీరగానే.. స్నేహాలు కూడ మాయమవుతాయి. ఇక్కడ నిజమైన .. స్వచ్చమైన మనుషులు లేరు . స్నేహాలు లేవు అంతా అవసరం మాత్రమే” అని ఈ మధ్య ప్రముఖ బాలి వుడ్ డైరక్టర్ అన్నట్లు పత్రికలలో చదివిన …రెండోరోజే… ‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యం లో విడుదల చేసిన మొట్టమొదటి చిత్రం , ఒక యువ నిర్మాత ,యువ దర్శకుడు తీసిన మొదటి చిత్రం Rs. 999/ మాత్రమే ..

చిన్న చిత్రం ప్రింట్లు బయటకు వెళ్ళే సమయం లో లో దాదాపు 30 మంది నిర్మాతలు మనస్ఫూర్థిగా … వచ్చి ఆ కొత్త నిర్మాత నవీన్ ను అభినందించారు ఇలాంటి సంఘటన …ఇంత చక్కటి ప్రోత్సహం ఇప్పటి వరకు ఎక్కడైన జరిగిందా”…అని ప్రముఖ నిర్మాత ,తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి కార్యదర్శి నట్టి కుమార్ గారు అన్నప్పుడు చాల సంతోషంగా అనిపించింది. It happens only in Andhra!

ఈ సందర్భంగా నట్టి కుమాత్ గారితో ఒక ముఖాముఖి

ఈ సమితి ఏర్పాటుకు ముఖ్య కారణం ?

ఫిల్మ్ చాంబర్ .దాని పని తీరు .అందరికి తెలుసు ప్రముఖ నిర్మాతలుగా, దర్శకులుగా ఫిల్మ్ చాంబర్ పెద్దలు గా చేలామణి అయ్యె కొంతమంది పెద్దలు చిన్న చిత్రాల నిర్మాతలకు ఏటువంటి సహాయ సహకారాలు అందించకుండా.. చాంబర్ ని తమ స్వంత లాభాలకోసం వాడుకుంటూ..చిన్న నిర్మాతలకు దర్శకులకు మిగితా విభాగాల వారికి అన్యాయం చెయ్యడం. వారి వారి లాభాలు చూసుకోవడం ,పెద్ద వారికి మాత్రమే సహకరించడం.. చిన్న నిర్మాతలను ఎవరు సరిగా సహాయ సహకారాలు అందించకపోవడం తో…చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం దీనిని స్థాపించాము

పరిశ్రమలో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది?

ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే .. కొంతమంది పెద్ద నిర్మాతలనిపేరున్న వారు .. ఒక్క సినిమా హిట్ చేసి రెండో సినిమాకు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసే కొంతమంది దర్శకులు కారణం . మీ అందరికి తెలుసు గిన్నిస్ బుక్ లో ఎక్కి మన తెలుగు సత్తా చాటిన ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు గారు ఒకప్పుడు వరుసగా పది సీనిమాలు హిట్ ఇచ్చినప్పుడు కూడ తన రెమ్యునరేషన్ పెంచలేదు . అలాగే అప్పటి కొంతమంది ప్రముఖ దర్శకులు కూడ పరిశ్రమ బాగుండాలి తామే కాకుండా అందరూ బాగుండాలని కోరుకున్నారు కాని ఇవ్వాళ పరిస్థితి అలా లేదు అందుకే..
త్వరలోనే ప్రెస్స్ మీట్ పెట్టి ఫిల్మ్ చాంబర్ పెద్దల భాగోతాలను , అక్కడ జరుగుతున్న మోసాలను కుంభకోణాలను బయటపెట్టబోతున్నాం. ఏది చేసిన చిన్న నిర్మాత కూడ బతకాలి .అనేదె మా లక్ష్యం

ఈ ‘సమితి’ ఆలోచన ఎలా వచ్చింది ?

ఎవరమ్మాయి పెళ్ళయినా కాని ….పెళ్ళిపందిరిలో పెళ్ళిపీటల పై ఆగవద్దని కోరుకున్నట్లే…
అంతా సిధ్ధమైన ఏ సినిమా అయిన ,ఎవరి సినిమా అయిన లాబుల్లో ఆగిపోవద్దని .
ఎప్పటి నుంచో ..ఈ విషయాల పైన దాసరి నారాయణ రావు గారు బాగ స్పందిన్స్తున్నారు …,అలాగే అప్పుడు మరికొంతమంది దర్శకులు కూడ అంతా బాగుండాలి , పరిశ్రమ లో అంతా బతకాలి అని ఉండేవారు . ఇప్పుడు చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 300 పైన సినిమాలకు ప్రాంభోత్సవాలు చేస్తున్నారు . కొన్ని షూటింగ్ దశలోనే ఆగి పోతున్నాయి…చివరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోని బాక్స్ లు బయటకరాలేక ఎన్నో రక రకాల కారణాల వలన విడుదల కు నోచుకోనివి దాదాపు 180 కి పైగా సినిమాలు ప్రస్తుతం ఆగిపోయి ఉన్నాయి .అంటే వందల కోట్ల రూపాయలు అలా నష్టపోబోతున్నారు నిర్మాతలు అని అర్ధం ఇలా లాబుల్లో చిన్న సినిమాలు బాగ నిలిచిపోతుండటం తో… ఇలా అన్యాయంగా , అమాయకంగా మరే నిర్మాత నష్టపోవద్దని , నేను , సాగర్ గారు , శ్రీనివాసరావు గారు చిన్న నిర్మాతల శ్రేయస్సుకోసం ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యలని అనుకోని ప్రారంభించాము .
సినిమా ఆగిపోతే ఒక నిర్మాతకే నష్టం అనుకుంటారు కాని ఒక సినిమా ఆగిపోతే అనేక మంది రోడ్డున పడేపరిస్థితి వస్తుంది దాని వలన అన్నీ రోటేషన్ అవుతాయి .సినిమా ల పై న ఆధార పడి బతికే ఎంతో మంది కి మరి కొన్ని రొజులు ఉపాధి దొరుకుతుంది పరిశ్రమ పచ్చగా ఉంటుంది.

సమితి లక్ష్యాలు?

చిన్న సినిమా బతకాలన్నదే మా ధ్యేయం . కష్టపడి తీసిన సినిమా ప్రెక్షకులకు చేరాలి .పర్సంటేజి విధానం లోనే సినిమా ని ప్రదర్శించాలి.ఇప్పుడు ఎవరు ఏ నిర్మాత ఇక్కడ ఒంటరి వాడు కాకూడదు . ఇప్పుడు ఎక్కడ ఏ లాబు లో సినిమా డబ్బాలు మూలన పడి ఉండకూడదు . ప్రతి సినిమా విడుదల అయ్యి తెలుగు చలన చిత్ర పరిశ్రమ మంచిగా ఉండాలి . ఈ రోజు ఆపదలో ఉన్న ఒక చిన్న నిర్మాతకు అండగ వందమంది నిర్మాతలు తోడు ఉండాలన్నదే…ప్రధాన ఆశయం

చిన్న సినిమా విడుదల చేసే టప్పుడు జాగ్రత్తలు ?

పదిరోజుల ముందె పబ్లిసిటీ అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి

ఈ సేవలన్ని ఉచితమేనా… ?లేకా…

సాటి నిర్మాత కు సేవ చెయ్యడం కోసం అందరం కలిసి ప్రారంభించాము కాని ఇక్కడ కూడ నిర్మాతలనుండి ఏదో ఒక రకం ఫీసు గా డబ్బు లాక్కోవాలని ఏటువంటి దురాశ లేదు .నమ్మండి ఇక్కడ ఏటువంటి సర్వీసు చార్జి కాని కమీషన్ కాని ఏ రూపం లో కూడ వసూలు చెయ్యడం లేదు .ఇక్కడ మీకో విషయం చెప్పాలి కేవలం చిన్న నిర్మాత , దర్శకుడు , నటీనటులకే కాకుండ మిగితా ఎన్నో విభాగాల వారి చిరు జీవితాలు కొద్దిగైన బాగుపడుతాయని మా నమ్మకం.అన్ని సినిమాలు బాగుండక పోవచ్చు కాని కొన్ని ఐనా మంచి చిత్రాలు బయటకు వస్తాయి కదా..అలా వారు మళ్ళీ కొత్త చిత్రాలు తీసే అవకాశం మరి కొంతమంది ప్రతిభావంతమైన కళాకారులు పరిశ్రమకు దొరక వచ్చుకదా

ఎవరేవరు సభ్యులు గా ఉండొచ్చు….

మా ఈ సమితి లో కేవలం చిన్న నిర్మాతలే సభ్యులు కాదు మిగితా అన్ని శాఖల కళాకారులు ఇందులో ఉన్నారు

ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు విడుదల కోసం మీ వద్దకు వచ్చాయి?

ఇప్పటి వరకు 40 సినిమాల విదుదల కోరుతు అప్లికేషన్లు వచ్చాయి .మేము ఒక కమిటి ని నియమించాము . ఆ కమిటి వరుసగా ఎన్నిక చేసిన అన్నీ సినిమాలను విడుదల చెస్తుంది.

సినిమా పూర్తయిన తరువాతె మిమ్మల్ని సంప్రదించాలా?

అలా ఎం లేదు కొత్త నిర్మాతలు కూడ వచ్చి మా సలహాలు తీసుకోవచ్చు .సినిమా ను నమ్మి నమ్మకంగా వ్యవహరించి తమతో పాటు మరి కొంతమందికి బ్రతికే స్వెచ్చను ఇచ్చే ఏ నిర్మాత వచ్చిన మేము స్వాగతిస్తాం .కొత్త నిర్మాతలకు మా సమితి బడ్జెట్ , మార్కెటింగ్ తదితర విషయాల పైన ముందె ఒక అవగాహన కల్పిస్తాము. కాబట్టి అందరికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం.

సంప్రదించండి
నట్టికుమార్
9959488877

‘తెలుగు చలన చిత్ర పరిరక్షణ సమితి ‘

అధ్యక్షులు ; చదలవాడ శ్రీనివాస రావు
కార్య దర్శి ; నట్టికుమార్
సెక్రటరి : రమేష్ N , సంగిశెట్టి దశరధ్
జాయింట్ సెక్రటరి : సాయి వెంకట్ ఆర్ కె
క్యాషియర్ : ఎస్ .వి .రావ్

(నవతరంగం కోసం ఇంటర్వ్యూ లో నాకు సహక రించిన సాధిక్ నవాబ్ అలి కి షుక్రియ. )

Posted by సైఫ్ అలి గొరే సయ్యద్ on June 30, 2009 06:33 PM · permalink

శశాంక్ (అక్షయ్ ఆనంద్) : “పక్షి లాగా ఆకాశం లో ఎగిరిపోవాలి, ప్రపంచాన్ని చుట్టిరావాలి. ఆనందాల్ని అనుభవించాలి”
సూర్య (రమేష్ అర్వింద్): మహావృక్షంలా వేళ్ళూనుకుని ఆకాశాన్ని అంటేలా ఎదగాలి. వేర్లు బలంగా నేలలో ఉంటూనే ఆకాశాన్ని ఏలాలి. పక్షిలాగా ఎంత ఎగిరినా ఏం లాభం ఎప్పుడో ఒకప్పుడు నేలని చేరాల్సిందే. కానీ వృక్షమైతే నింగికీ,నేలకూ,నీడనిచ్చే ప్రజకూ అందరికీ ఉపయోగం.”
భూమిక (హేమ) : “ఏమిటో బాబూ! మీ ఇద్దరి మాటలూ ఎప్పటికప్పుడు సరైనవే అనిపిస్తాయి. ఇద్దరూ నాకు ముఖ్యమే. ఇద్దరి ఆలోచనలూ నాకు అవసరమే.”

శశాంక్ అంటే చంద్రుడు. సూర్య సూర్యుడికి ప్రతీక. భూమిక ఈ ఇద్దర్నీ సమానంగా ప్రేమించే భూమి. ఇవి “అమెరికా! అమెరికా!!” అనే కన్నడ చిత్రంలోని పాత్రలు. ఈ ముగ్గురు స్నేహితుల స్నేహం మధ్యా ప్రేమ-పెళ్ళి-అమెరికా అనే గ్రహణాలు పడితే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర కథ.

1996 లో వచ్చిన ఈ చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించింది నాగత్తిహళ్ళి చంద్రశేఖర్ అనే నవలా రచయిత. అప్పుడప్పుడే కర్ణాటకలో అమెరికా ఆశలు కళ్ళలో నింపుకుని విమానమెక్కే సాఫ్ట్ వేర్ జనాల ఉధృతి పెరిగింది. బ్రెయి డ్రెయిన్ అనే ఆలోచనల్ని పడికట్టుపదాలుగా out dated ideology గా మార్కెట్ ఎకానమీ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. అమెరికాకోసం పనిచేసి డాలర్లు సంపాదించడం భారతదేశానికి మంచిదనే బలమైన నమ్మకాలు ఏర్పడటం మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ పరిణామం యొక్క భవిష్యత్ దర్శనం చేసి, ఏవిధంగా మనం rootlessness దిశగా, emotional deprivation in an alien land దిశగా అడుగులు వేస్తున్నామేమో అనే విషయాన్ని ఒక ప్రేమకథ ద్వారా చెప్పిన చిత్రం ఇది. It was a film way ahead of its time. But still a crowd puller at the time of its release. ఈ రోజు మనం ఆ సినిమా చూస్తే భవిష్యత్తుని ఎంత బాగా రచయిత,దర్శకుడు ఊగించాడా అనిపిస్తుంది.

70 శాతంపైగా అమెరికాలో చిత్రీకరించబడిన ఈ సినిమాలోని మిగతా భాగం కేరళ అందాల్ని తలదన్నే కర్ణాటకలోని ఉడిపి,చిక్ మంగుళూరులో చిత్రీకరించారు. సూర్యగా రమేష్ అర్వింద్ నటన మరుపురానిది.  ఈ నటుడి నటనని కమలహాసన్ నటనతో  పోలుస్తారు. కమల హాసన్ కూడా అర్వింద్ నటనని అభిమానిస్తాడు. శశాంక్ గా అక్షయ్ ఆనంద్ అనే ఉత్తరాది నటుడు పాత్రోచితంగా నటించాడు. భూమికగా హేమకు ఇది మొదటి,ఆఖరి చిత్రం. కానీ ప్రతిభ మాత్రం అమోఘం. మనో మూర్తి సంగీతం చిత్రానికి మరో హైలైట్. ముఖ్యంగా “ఏ లోకపు మోహన మురళి విని దూరతీరాలకు తరలిపోతున్నావో” అనే దరా బేంద్రె భావగీతాన్ని చిత్రంలో వాడిన తీరు హృద్యంగా ఉంటుంది. అప్పుడూ ఇప్పుడూ ఖచ్చితంగా అందరూ చూడావలసిన చిత్రం.

ఈ సినిమా ఇప్పుడు DVD రూపంలో విరివిగా దొరుకుతోంది కాబట్టి ఇంకా చెప్పుకోవడంకన్నా సినిమా చూసెయ్యడం బెటర్. బెంగుళూరులో ఉన్నవాళ్ళు మిగతావాళ్ళకు సహాయపడాలి. హైదరాబాద్ లో నేనెలాగూ ఉన్నాను. ప్రవాస భారతీయుల్లో ముఖ్యంగా కన్నడ కుటుంబాలలో ఈ చిత్రం ఖచ్చితంగా లభ్యమవుతుంది. మరెందుకాలస్యం… కానివ్వండి!

Posted by K మహేశ్ కుమార్ on June 30, 2009 12:19 AM · permalink

అది సాఫ్ట్ వేర్ బూం కి అప్పుడప్పుడే కోరలు వస్తున్న కాలం ….సాధారణంగా ఒక మంచి కుటుంబం లో పుట్టి B.Tech. శ్రధ్ధగ చదివి (ఇంజనీరింగు) కంప్లీట్ చేసి ఉన్నత విద్యలు చదివిన కుర్రోళ్ళు మంచి ఉద్యోగం ఉంటే మంచి కట్నం వస్తదనో ,లేక పోతే మంచి అమ్మాయి దొరుకుతుందనో ..హాయిగ షాది చేసుకోని సెక్యూర్ జిందగి కోసం ఎక్కడినుండో మైత్రివనం ఎగిరొచ్చి బయోడేటలు, జాబ్ అప్లికేషన్లు పట్టుకోని రెకమండేషన్తోనో,మన టాలెంటుతోనో ఒక మంచి జాబ్ సంపాదించుకోని, లేక పోతే జనని జన్మభూమిశ్చ లాంటి కొన్ని పాటలున్న సినిమా క్లాసిక్స్ బ్యాగ్ లో వేసుకోని విదేశాలకు ఏగురుతున్న కాలం.

అలాగే మరో వైపు…..హైదరాబాదు కొచ్చి సినిమా ప్రయత్నాలు చేస్తున్న నేను, నా లాగే సినిమా అంటే జునూన్ ఉన్న మిత్రుడు చారి, ముంబై కి హైదరాబాదు కి తిరుగుతు కమర్షియల్ ప్రకటనలకు కాపి రైటర్ గ చేస్తున్న కరీంనగర్ కు చెందిన మిత్రుడు ఆనంద్, పరిచయం చేయించిన మరో మిత్రుడు మహెందర్ మాకు దోరికిన పీ సి స్రీరాం లాంటి కెమెరామెన్ అన్నదేవర బ్రహ్మం ఇలా మిత్రులంతా కలిసి హైదరా బాదు డిజిటల్ ఫిల్మ్ ఫోరం ఒకటి పెట్టినప్పుడు చాలామంది డిజిటల్ ఫిల్ములా? అంటే ఏంది భాయ్? అని ఎక్కిరించినా జమాన! ఇంక డిజిటల్ ఫిల్మ్ అంటే ఏమిటో చాల మందికి తెలియని ఒకానొక కాలములో…….

నాలుగు గోడలమధ్య కర్టెన్ కప్పుకోని మంచి సినిమాలు లేక తెల్ల బోతున్న ధియేటర్ల తెరలు …. చక్కటి సినిమాలు వచ్చే రోజు మరెంతో దూరం లేదు అని ఎవరో ఒకరు దర్శక నిర్మాతలు తప్పక వస్తారని కలలు చూస్తు ఎదురుచూస్తున్నాయి…..కదా? అలా కలలు చూస్తున్న స్క్రీన్ ఆశయాలను మనం సాధించక పోతే మరెవరు సాధిస్తారు అని …

నగరం మొత్తం పోస్టర్లు వేసినట్లు
మైత్రివనం కేఫులు
అమీర్ పెట్ ఫ్రెండ్స్ రూం
ఎక్కడొ ఎంఎల్ఏ క్వార్టర్స్
ప్రతి చోట కేవలం డబ్బున్న నిర్మాత దొరికితే బాగుణ్ణు అని కాకుండ, కాస్త కామన్ సెన్స్ కూడా ఉన్న నిర్మాత దోరికితే బాగుణ్ణు అని అన్వేశిస్తూ ఎక్కడపడితే అక్కడ కధలు చెప్పుకుంటున్న తరుణం లో…

అదే మైత్రివనం లో చెప్పుకున్న ఎన్నో అందమైన సినిమా కధలలో ….” వీల్లంతా సెలవు పెట్టి మరీ చూసేటటువంటి నా రాబోయె సినిమా కధ చెప్తాను వినండి ” అంటూ మహెందర్ కూడ ఒక కధ చెప్పెవాడు.ఆ కధే “Rs . 999 మాత్రమే”

మహేందర్ గురించి మహేందర్ మాటల్లోనే…

సినిమా పిచ్చి గురించి..సినిమా ఇండస్ట్రీ లో గాడ్ ఫాదర్ గురించి:

మనమంతా రాం గోపాల్ వర్మ గారి ఏక లవ్య శిస్యులం కదా
ఆయనే మనకు సర్కార్. (గాడ్ ఫాదర్ అన్నమాట)

ఫ్యామిలి సప్పోర్ట్?

ఇంట్లో సప్పోర్టా అసలు ఇంటర్ వరకు ఒక్క సినిమా చూడనివ్వలేదు, చూడలేదు
చిన్నప్పుడు టెన్త్ వరకు ఇంట్లో టీవి కూడ లేదు. ఇంటర్ కోసం బయటి కాలేజ్ కొచ్చినం. బస్ అంతే రాం గోపాల్ వర్మ దెయ్యం పట్టేసింది. after B.Tech అంతా దోస్తుల సప్పోర్ట్.

ముందునుంచే (ప్రియురాలు ఎవరు లేక పోయినా …) ఊహించుకోని పాటలు రాసుకోవడం అలవాటు. కానీ…సినిమా తీయకుండ చస్తే మాత్రం నా చావు చాల హీనంగ ఉండేది.
(కాసేపు గతం కళ్ళముందుకొచ్చింది … మా మధ్యలో ఒక నిశ్శబ్ధం … అదేంటి …మనం వర్మ ఏకలవ్య శిస్యులం కదా మన ఆలోచనలో కూడ ఓటమి ఉండకూడదు కదా మహి అంటే)

ఉండదు నిజమే! కాని చదువుకున్న వాడు సినిమ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ కాకపోతే
వాడి బతుకు ఫుట్ పాత్ మీద బతికేటోని కన్న హీనగా అవుతుంది కదా అంటాడు.

సినిమాకు ముందు:

అసిస్టెంట్ గా ఎక్కడైన చేద్దామని చాల తిరిగాను ప్చ్ దోరకలేదు

అప్పుడు…?

అనుభవం లేకపోయినా ఫర్వాలేదు కధ చెప్పడం వస్తే చాలు ఎవరైన డర్శకత్వం చెయ్యొచ్చు అని కొన్ని కోట్ల సార్లు వర్మ గారు ఇంటర్యూలలో చెప్తూ వస్తున్నారు కదా! ఆయన మాటలని పాటిస్తే పోలే అని దర్శకుడిగా అవకాశాలు ఇమ్మని కధలు పట్టుకోని తిరిగా…

అప్పుడు…?

ఒక ఫ్రెండ్ ద్వార వినయ్ అనే ఆయన కలిసారు ఆయనకు మంచి నిర్మాతకుండవలసిన అన్ని లక్షణాలు ఉండటం తో .. కధ ని ఆయనకు చెప్పడం తక్కువలో తక్కువ 35 లక్షల బడ్జెట్ వేసుకోవడం దానికి తోడు 15 రోజు ల అతితక్కువ సింగల్ షెడ్యూల్ ప్రణాలిక వేసుకోవడం
సినిమా తీసెయ్యడం జరిగిపోయింది

అనుకున్నట్లుగానే బడ్జెట్ లో అయ్యిందా?
జనరల్ ఖర్చులకే కాస్త పెరిగింది.అది నిర్మాతకు మొదటి సినిమా కాబట్టి.

నిర్మాత కొత్త వారు అయితే…సినిమా తియ్యడం తోటే దర్శకుడిగా పని అయిపోదు అది రిలీజు చెయించుకోవడం పెద్ద సక్సెస్.

సీనియర్ నటులు గురించి:

హీరో హీరోయిన్ కొత్తవారయినా , బ్రహ్మానందం, భగవాన్, జయప్రకాష్ రెడ్డి లాంటి పెద్ద నటీ నటులు సహకారం చాల చక్క గ ఇచ్చారు. ప్రత్యేకంగా సాయి కిరణ్ ఇచ్చిన సప్పోర్ట్ నేను మర్చి పోలేను. కాని ఏది ఏమయిన కొత్తగా వచ్చే నవ యువ దర్శకులు ఒక సినిమా తీసి తమని తాము నిరూపించుకోననత వరకు ఎక్కడైన సీనియర్లు గుర్తించడం కాస్త కష్టమే కదా ..?

సినిమా విడుల గురించి:
మొత్తం సినిమా మేము అనుకున్నట్లు గానే చాల చక్కగా వచ్చింది. కొత్త సినిమా కాబట్టి అందరికి ఉన్న బాక్స్ కష్టాలే మాకు కొన్ని ఎదురైనవి. చలన చిత్ర పరిరక్షణ సమితి వారి సహకారం తో మొదట ఒక 18 ప్రింట్స్ షేరింగ్ పద్ధతి పైన విడుదల చేస్తున్నాం.

అనుభవంతో ఒక సలహా:
ప్రోఫెషనలిజం , డేడికేషన్, డిసిప్లీన్ లేని వారు కేవలం డబ్బు పట్టుకోని వచ్చి సినిమా ఆగిపోయిందనో , రిలీజు ఆగిపోయిందనో అని బాధ పడవద్దు.

మరి కాస్త వివరంగా… చాలా విషయాలు తరువాత డిస్కస్ చెద్దామని లేచాం రిలీజు హడావుడి ఉంటది కదా.

NOTE:సెలవుపెట్టిమరి చూడవలసిన సినిమా మాత్రమె కాదండి ఇది తీరిక చేసుకోని మరి రివ్యూ రాయాల్సిన సినిమా. జర కోషిష్ చెయ్యండి

Posted by సైఫ్ అలి గొరే సయ్యద్ on June 29, 2009 11:32 AM · permalink

సినిమాకు కావలసింది భారీతారాగణం, కళ్ళుమిరుమిట్లు గొలిపే సెట్లు, హోరెత్తించే పాటలూ, భీకరమైన పోరాటాలు, నిమిషానికి మారే కాస్ట్యూములు, అర్థంపర్థం లేని హాస్యాలూ, ‘పంచ్’ పేరుతో కేవలం ప్రాసతో పలికే మాటలూ, హీరోయిన్ల అర్థనగ్న ప్రదర్శనలూ…కాదు! అని నిరూపించే మరో తమిళ చిత్రం “పసంగ”. పసంగ అంటే పిల్లలు అని అర్థం. ఈ సినిమా అంతా పిల్లలే.ఇద్దరు చిన్నపిల్లలు వారి కుటుంబాలు. కానీ ఇది పిల్లలకోసం పెద్దలు తీసిన సినిమాకాదు. పెద్దలు తీసిన పిల్లల సినిమా అంతకంటే కాదు. పిల్లలకు “మంచిని బోధించే”(?) సందేశాత్మక voyeuristic సినిమా అసలు కాదు. పిల్లాటల సినిమా అస్సలు కాదు. ఇదొక సినిమా. ఒక ని…జ…మై…న పిల్లల సినిమా. అంతే.

ఐదో తరగతి నుంచీ ఆరో తరగతికి వెళ్ళిన కొందరు పిల్లల కథ. ‘అన్బు’(కిషోర్), ‘జీవ’(శ్రీరాం) అనే ఇద్దరు విద్యార్థుల కథ. వాళ్ళ కుటుంబాల ప్రేమలు, గొడలవ కథ. పిల్లల్లోని పిడుగులూ, అల్లరిమూకలూ, బుద్దిమంతులు, క్లాస్ లీడర్ రాజకీయాలు, రైవల్రీలూ అన్నీ కలిపిన అద్వితీయమైన కథ. ఒక చిన్న ఊర్లోని గవర్నమెంటు స్కూళ్ళో ఏంమేమి జరుగుతుంటాయో వాటన్నింటినీ తెరకెక్కించిన చిత్రం.

ఊహల్లో స్కూటరెక్కినట్లు ఊహించుకుని బ్ర్…మని సౌండ్ చేసుకుంటూ వెళ్ళే పిల్లలు. పదిపైసల బిళ్ళని కాగితం క్రిందపెట్టి పెన్సిల్ తో అచ్చుగీసే పిల్లలు. క్లాసులో ఎవరైనా అపానవాయువు వదిల్తే “అగ్గిపెట్టె గిగ్గిపెట్టె” అంటూ ఎవరు బాంబేసారో ఇట్టే కనిపెట్టేసే పిల్లలు. నాలుక మీద మచ్చున్నోళ్ళు ఏంచెబితే అది జరుగుతుందనుకునే పిల్లలు. నెమలి ఈకని పుస్తకంలో పెట్టి పిల్లలు పెడుతుందని నమ్మే పిల్లలు. అబ్రకం ముక్కల్ని నెమలి ఈక తింటుందని నమ్మే పిల్లలు. గట్టిగా చదువుతూ పక్కోళ్ళని చదవకుండా చేసే పిల్లలు. క్లాస్ లీడర్ బోర్డు మీద అల్లరిచేసినవాళ్ళ పేర్లు రాస్తే గొడవపడే పిల్లలు. క్లాసులో నిద్రపోయే పిల్లాడికి మొటిక్కాయలు వేసే పిల్లలు. మార్కులు తక్కువొస్తే ముకుచెంపలు వాయించే పిల్లలు. ఇంకా…ఇంకా ఎన్నెన్నో చేసే చిన్నూరి పాఠశాల పిల్లలు.

తండ్రి ఆర్థిక పరిస్థితి బాగోక ఇంగ్లీషు మీడియంలో చదివే అన్బు గవర్నమెంటు స్కూళ్ళో ఆరవతరగతి చేరుతాడు. అప్పటివరకూ ఒకటి నుండీ ఐదు వరకూ ఎదురులేకుండా ఉన్న జీవా కు కంటగింపుగా మారతాడు. జీవా తండ్రి ఈ ఇద్దరూ ఉన్న క్లాస్ కి క్లాస్ టీచర్. అన్బు చదువులో సంస్కారంలో అందరికన్నా ముందుంటూ మన్ననలు చూరగొంటాడు. క్లాస్ లీడర్ అవుతాడు. జీవా ఈర్ష కోపంగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బుని తక్కువచేసి చూపాలనే ప్రయత్నాలు చేస్తాడు. చివరకు అదే క్లాసులో చదువుతున్న జీవా అత్తకూతురు కూడా అన్బుతో స్నేహంగా మెలగడం మొదలౌతుంది. జీవా కోపం కసిగా మారుతుంది. ఎప్పటికప్పుడు అన్బు జీవాతో స్నేహం చెయ్యాలని చూసినా జీవా పెంకితనం వారి స్నేహానికి అడ్డుగా మారుతుంది. దానికి తోడు జీవా పక్కనున్న ఒక మిత్ర ద్వయం ఎప్పటికప్పుడు జీవాను ఎగదోస్తూ పరిస్థితిని ఇలాగే కొనసాగేలా చూస్తుంటారు.

అన్బు-జీవాల గొడవలు చివరకు వాళ్ళ కుటుంబాల వరకూ పాకుతాయి. అప్పటికే ఆర్థిక పరిస్థితి బాగోలేని అన్బు కుటుంబం మరింత కల్లోలానికి గురౌతుంది. ఈ గొడవల మధ్యలో జీవా అక్క సోబికన్ను(వేగ), అన్బు బాబాయ్ సుందరం(విమల్) ప్రేమించుకుంటారు. ఈ పిల్లల వైరాలు సమసిపోతాయా, కుటుంబాలు కలుస్తాయా, సోబికన్ను -సుందరంల ప్రేమ సఫలం అవుతుందా అనేది చిత్రకథ.

నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన విషయం ఏమిటంటే, పిల్లల్ని పెద్దమాటలు మాట్లాడే ఆరిందాల్లాగానో లేక శుద్ధ అమాయకుల్లాగానో కాకుండా పిల్లల్ని పిల్లల్లాగా చిత్రీకరించడం. వారు మాట్లాడే మాటలదగ్గరనుంచీ వాళ్ళ నమ్మకాలు, ఆనందాలు, కోపాలూ, ఉక్రోషాలూ అన్నీఅన్నీ అత్యంత సహజంగా మనం చిన్నప్పుడు చదివిన స్కూలు గుర్తొచ్చేవిధంగా తీర్చిదిద్దడం. అంతేకాక ఈ పిల్లల భావనల్ని సినెమాటిగ్గా ఎలివేట్ చెయ్యడానికి దర్శకుడు కమర్షియల్ ఫిల్మ్ ఫార్మేట్ను వాడిన విధం అత్యంత ముదాహం. మన సాధారణ కాలేజి సినిమాల్లోని హీరో – విలన్ ల ఘర్షణ దృశ్యాల గ్రామర్ ని ఇక్కడ అన్వయించి దర్శకుడు చూపిన ప్రతిభ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పాటల్లో కూడ ఇదే శైలిలో పాప్యులర్ సినిమాల దృశ్యాల్ని పోలిన షాట్ డివిజన్, నేపధ్య సంగీతం, ఎడిటింగ్ వంటి ప్రక్రియలు వాడి ఆసక్తిభరితం చేశారు. దీని వెనుక రచయిత దర్శకుల శ్రమ ఎంతుందో మనం గుర్తించనంత సహజంగా ఈ సినిమా ఉంటుంది.

సోబికన్ను(వేగ), సుందరం(విమల్) ప్రేమ దృశ్యాల్లో టెలిఫోన్ రింగ్ టోన్లలాగా ఇళయరాజా ట్యూన్లు వాడి మనల్ని 70-80 ల సినిమాలలోకి తీసుకొచ్చి ఈ చిత్రంలోని ప్రేమ కథకు మరింత లోతు తీసుకొస్తాడు. చాలా సరదాగా, సహజంగా, విన్నూత్నంగా సాగుతుంది ఈ ఉప(ప్రేమ) కథ.

పిల్లలతో సహా ఈ చిత్రంలోని నటీనటులెవ్వరూ నటించలేదు. జీవించారు. కాబట్టి వారి నటన గురించి నేను ఏమీ చెప్పను. సుజాత సినిమాలో చూసిన వేగ కూ ఈ చిత్రంలోని వేగకూ చాలా తేడా ఉంది. నటనలో ఈజ్ సుస్పష్టంగా తెలిసొస్తోంది. జేమ్స్ వసంతన్ సంగీతం ఈ చిత్రానికి మరింత ప్రాణాన్ని పోస్తే సినెమాటోగ్రఫీ (ఎవరో నోట్ చేసుకలేకోయాను) ప్రతి ఫ్రేములోనూ జీవాన్ని నింపింది.  సుబ్రహ్మణ్యపురం (తెలుగులో ‘అనంతపురం -1980′ ) నిర్మించి దర్శకత్వం వహించిన శశికుమార్ ఈ చిత్రానికి నిర్మాత. పాండియరాజన్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. తప్పకుండా అందరూ చూడవలసిన చిత్రం ఇది. ఈ చిత్రం తెలుగులోడబ్ అయ్యివస్తే ఆనందమే. కానీ తమిళ్ లో అర్జంటుగా చూసెయ్యమని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ సంవత్సరంలో భాతదేశంలో వచ్చిన సినిమాలు పదిలెక్కెంచితే ఈ సినిమా లేకపోతే ఆ లిస్టు తప్పని వాదించగలిగేంత మంచి సినిమా ‘పసంగ’.

Posted by K మహేశ్ కుమార్ on June 28, 2009 11:07 AM · permalink

27 June, 1939 – 4 January,1994

1986 బొంబాయిలోని ఒక మ్యూజికల్ సిట్టింగ్. సినిమా దర్శకుడు పాటల రచయిత గుల్జార్ ఒక కాగితాన్ని సంగీతదర్శకుడికి ఇచ్చాడు.

కళ్ళద్దాల్లోంచీ ఆ కాగితంలోని వాక్యాల్ని చదివి “మంచి సీను. చాలా కవితాత్మకంగా ఉంది” అని క్రిందపెట్టేసాడు ఆ సంగీత దర్శకుడు.
“సీను కాదు అదే నేను రాసిన పాట. నువ్వు కంపోజ్ చెయ్యాలి” అన్నాడు గుల్జార్.
“నీ కేమైనా పిచ్చిపట్టిందా! రేపు టైంమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ తీసుకొచ్చి దాన్ని కంపొజ్ చెయ్యమనేట్టున్నావే!!”
“నువ్వు చెయ్యగలవు. నువ్వే చెయ్యగలవు. అందుకే నీకిస్తున్నాను”
“హ్మ్…చూద్ధాం. ఏదీ ఒకసారి చూపించు. పదాలు పైకిచెప్పు”

ఆ సీనులాంటి పదాల్లోంచీ పాట పుట్టింది. ఇజాజత్ (1987) సినిమా సూపర్ హిట్టయ్యింది. పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. ఆ పాటలో నటించిన అనురాధాపాటేల్ కి రాతికిరాత్రే కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ తయారయ్యారు. పాటపాడిన ఆశాభోంస్లేకి, రాసిన గుల్జార్ కి జాతీయ అవార్డు వచ్చింది.

ఆ సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్. ఈ రోజు ఆ మహానుభావుడి జయంతి. ఆ పాట “మేరా కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడాహై”. ఈ పాటలోని “సామాన్లు”  శబ్ద ప్రయోగానికి ఒక చిన్న నేపధ్యం ఉంటుంది. నాయకుడు తన పెళ్ళి తరువాత ప్రియురాలి సామాన్లు ఇంకా ఇంట్లోనే ఉంటే వాటిని పంపించేస్తాడు. ఆ సామాన్లు అందుకున్న ప్రియురాలు, ఈ భౌతికమైన సామాన్లు కాకుండా మరెన్నో సామాన్లు నీదగ్గరున్నాయి, అవి పంపించెయ్యగలవా? అని ప్రశ్నిస్తూ ఒక లేఖ రాస్తుంది. ఆ లేఖే ఈ పాట.

मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है – २
सावन के कुछ भीगे भीगे दिन रखे हैं
और मेरे एक खत में लिपटी रात पड़ी है
वो रात भुला दो, मेरा वो सामान लौटा दो – २
मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है – २

पतझड़ है कुछ … है ना ?
पतझड़ में कुछ पत्तों के गिरने की आहट
कानों में एक बार पहन के लौट आई थी
पतझड़ की वो शाख अभी तक कांप रही है
वो शाख गिरा दो, मेरा वो सामान लौटा दो – २

एक अकेली छतरी में जब आधे आधे भीग रहे थे – २
आधे सूखे आधे गीले, सुखा तो मैं ले आयी थी
गीला मन शायद बिस्तर के पास पड़ा हो !
वो भिजवा दो, मेरा वो सामान लौटा दो

एक सौ सोला चांद कि रातें एक तुम्हारे कांधे का तिल – २
गीली मेंहदी कि खुशबू, झुठ-मूठ के शिकवे कुछ
झूठ-मूठ के वादे सब याद करा दूँ
सब भिजवा दो, मेरा वो सामान लौटा दो – २

एक इजाज़त दे दो बस, जब इसको दफ़नाऊँगी
मैं भी वहीं सो जाऊंगी
मैं भी वहीं सो जाऊंगी

పాట వీడియో లింక్

ఈ పాట తెలుగు స్వేఛ్ఛానువాదం

నా వస్తువులు కొన్ని
నీదగ్గరుండిపోయాయి
కలిసి తడిసిన వర్షపు రోజులు
జాబులో మడిచిన మధురరాత్రి
ఆ రాత్రిని మర్చిపో
నా సామాన్లు నాకు తిరిగిచ్చేసెయ్
నా వస్తువులు కొన్ని
నీదగ్గరుండిపోయాయి
నా సామాన్లు నాకు తిరిగిచ్చేసెయ్

ఆకులురాలే కాలంలో
ఆకులసవ్వడి నా చెవుల్లో నింపుకొచ్చాను
ఓ ఆకింకా కొమ్మకు వేలాడుతూనే ఉంది
ఆ ఆకుని తుంచేసెయ్
నా వస్తువులు కొన్ని
నీదగ్గరుండిపోయాయి
నా సామాన్లు నాకు తిరిగిచ్చేసెయ్

ఒంటరి గొడుగులో
జంటగా నడిచిరోజున
సగం తడిచాం
సగం పొడిగానే మిగిలాం
పొడిని నేను తీసుకొచ్చేశాను
బహుశా నా తడిహృదయం
పరుపు పక్కనే పడిపోయిందేమో
దాన్ని నాకు పంపేసెయ్
నా వస్తువులు కొన్ని
నీదగ్గరుండిపోయాయి
నా సామాన్లు నాకు తిరిగిచ్చేసెయ్

కలసిగడిపిన
నూటపదహారు వెన్నెల రాత్రులు
ఒక ప్రేమకాటు
గోరింటాకు ఘుమఘుమలు
ఉత్తుత్తి కోపతాపాలూ,ప్రేమ ప్రమాణాలూ
అన్నీ తీసి గట్టునపెట్టి ఇచ్చేసెయ్
నా వస్తువులు కొన్ని
నీదగ్గరుండిపోయాయి
నా సామాన్లు నాకు తిరిగిచ్చేసెయ్

Posted by K మహేశ్ కుమార్ on June 27, 2009 01:27 AM · permalink

సినిమా చూడటం అంటే చిన్నప్పుడు ఓ సరదా. అంతకుమించి మరేమీ లేదు. కాని ఆ బాల్య, కౌమారావస్థలు దాటి ఒక విధమైన మానసిక పరిణితి వచ్చిన తర్వాత, సినిమా అనే కాదు, ఏ విషయం పట్లైనా మన అభిప్రాయాలు మారిపోతాయి (మారాలి కూడా). ఎన్నిరోజులని, సంవత్సరాలని ఈ కాకమ్మ కథలతో తయారయ్యే చిత్రాలు చూస్తూ కూర్చుంటాం? కొత్త విషయాలు తెలుసుకోవటంలో మన చుట్టూ ఉండే వాతావరణం, మనకు లభించే వనరులు మొదలైనవి కూడా ప్రధానపాత్ర వహిస్తాయి. అయితే, సినిమా అనేది కేవలం ఒక వినోదంగా మాత్రమే కాకుండా, మన తెలుగువాళ్ళకు ఒక జీవనవిధానంగా మారిపోయింది. సినిమా లేని జీవితాన్ని చాలామంది ఊహించుకోలేరు. అంతటి శక్తిమంతమైన మీడియం మనలను కేవలం రెండూ రెండున్నర గంటల పాటు తెరమీద ఏవో బొమ్మలు ఆడించి, మట్టిముద్దల్లా సీట్లకు కట్టిపడేసినట్లుగా కాకుండా, మన బుర్రకు పదునుపెట్టే సాధనంగా ఉంటే ఎంత బాగుంటుంది? ఇలాంటి నేపధ్యం ఉన్న చిత్రాలు చూడటం నిజంగా ఒక మంచి అనుభవం. అవి మనలో మంచి అనుభూతులు మిగులుస్తాయి – కలవరపెట్టినా సరే. మనలను చాలాకాలం వెంటాడతాయి.

ఓ ఐదారేళ్ళ క్రితం అటువంటి తెలుగు చిత్రమే ఒకటి మన రణగొణ చిత్రాల మధ్య Talk of the Town అయింది. ఆ సంవత్సరం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాకుండా, ఉత్తమ స్క్రీన్ ప్లేకు కూడా జాతీయ అవార్డు గెలుచుకుంది. అదే సినీ నటుడు కృష్ణ కూతురు మంజుల నిర్మించిన ‘షో’. తను అందులో నటించింది కూడా. అప్పుడు ఆ చిత్రం గురించి వినటమే గాని, చూసే అవకాశం నాకు రాలేదు. అందుకే, రెండు మూడు నెలల క్రితం మా ఊరెళ్ళినప్పుడు ఏరికోరి ఆ సినిమా సిడి తెచ్చుకున్నాను. ఇది సినిమా విద్యార్థులకు రికమెండ్ చేయాల్సిన చిత్రంగా నేను భావిస్తున్నాను.

ఈ చిత్రంగురించి అందరూ చెప్పిన ఒక్క మాట – ఈ చిత్రంలో రెండే పాత్రలు అని. కాబట్టి నేనూ అక్కడినుంచే ప్రారంభిస్తాను. ఈ సినిమా గురించి తెలియని వాళ్లకు ఈ విషయం ఒకింత ఉత్సుకతను కలిగిస్తుంది – రెండే పాత్రలతో సినిమా ఏమిటి అని. ఆ రెండు పాత్రలూ – ఒక యువతి (రిధిమ) ఒక యువకుడు (మాధవ్) (అపరిచితులు)(ఈ పాత్రల్లో మంజుల, సూర్య నటించారు). అనుకోకుండా ఒక కొత్త ప్రదేశంలో కలిసి, కొన్ని గంటలు గడపాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా టైం పాస్ చేస్తారు అనేదే ఈ సినిమా కథ. టైం పాస్ చేయటానికి వాళ్ళు ఒక నాటకం ఆడాలనుకుంటారు. (నాటకం అంటే సినిమా నాటకం అనుకునేరు. నిజమైన నాటకమే). ఆమె భార్యగానూ, అతను భర్తగానూ. ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు. వాళ్ళ గొడవలు చూడలేని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరినీ తమ గొడవలు పరిష్కరించుకోవటానికి ఈ ఏకాంత ప్రదేశానికి పంపించారన్నమాట. అదీ నాటకంలోని అంశం (ముందు ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకున్నా, భార్యా భర్తలైతే బాగుంటుందని సజెస్ట్ చేస్తాడు మాధవ్).

నాటకం అంటే మరి నటించాలి కదా. ఆ అమ్మాయికేమో నటనంటే బొత్తిగా తెలియదు. ఎంతో కొంత నటనతో పరిచయమున్న మాధవ్ ఆమెతో నటింపజేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అవేవీ ఫలించవు. (మాధవ్ సినిమాల్లో నటించాలని కొంతకాలం ప్రయత్నం చేసినా సరైన అవకాశాలు దొరకవు. తర్వాత జూనియర్ లాయర్ గా జీవితంలో స్థిరపడతాడు. జీవితంలో పైకెదగలెక పోతున్నావని, తన నటన ఎందుకూ పరికిరానిదని భార్య ఎప్పుడూ తనను సాధిస్తూ ఉంటుందని చెప్తాడు. రిధిమ డిల్లీనుంచి వచ్చిన ఒక ఫార్మాషుటికల్ కంపెనీ ఎక్జిక్యూటివ్. వాళ్ళిద్దరూ ఒక మందు పేటెంటు కేసు విషయంలో ఒక ప్రొఫెసరు గారిని కలవటానికి వస్తారు. ఆయన పక్క ఊరికి అర్జెంటు పని మీద వెళుతున్నానని మెసేజ్ పెట్టి వెళ్తే, ఆయన బంగళాలో వెయిట్ చేస్తూ ఉంటారు). మొత్తంమీద ఆ నాటకం ముందుకు సాగక అర్థాంతరంగా ఆగిపోతుంది.

ఇద్దరూ కాఫీ చేసుకుని తాగుతారు. ఆ బంగాళా లంకంత కొంప. బంగాళా చుట్టుపక్కలంతా పచ్చని చెట్లతో, పక్షులతో, ఒక చక్కటి కొలనుతో అభయారణ్యాన్నితలపిస్తూ ఉంటుంది (ఆ లొకేషన్ ఎక్కడిదోగాని, అద్భుతంగా ఉంది). అక్కడ కాసేపు తిరుగుతూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. ఎంతకూ సమయం గడవక బోరు కొడుతున్న ఆ అమ్మాయి, తనని ఒక గంట entertain చేస్తే, తన ఒక నెల జీతం (ముప్ఫై వేలు) ఇచ్చేస్తానంటుంది (సరదాగానే). అతను అది సీరియస్ గా తీసుకుని ‘అవును. మీరు డబ్బుతో ఎవరినైనా కొనగలరు. మనుషులంటే మీకంత చులకన. మనుషులంతా ఇంతే. డబ్బుతో ఏమైనా చేయగలమని అనుకుంటారు. నిజానికి ప్రశాంతతలో ఉన్న entertainment ఎవరికీ అర్థం కాదు. అది పోయిన తర్వాతే అర్థమవుతుంది…….’ ఇలా అనేసి, ఎటో వెళ్ళిపోతాడు. తను సరదాగా అన్న మాటలకు కోపం తెచ్చుకుని అతను అలా వెళ్లిపోయాడని, ఆమె చాలా బాధపడి అతన్ని వెతుక్కుంటూ బంగాళా బయటికి వెళుతుంది. అంతకుముందు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు కూడా, అతను అన్న కొన్ని మాటలు, చేష్టలు గుర్తు తెచ్చుకుని ఆమెకు అతనిపట్ల ఒక అనుమానాస్పద ధోరణి కలుగుతుంది. కొంతసేపటి తర్వాత ఒక చెట్టు వెనుక నవ్వుతూ కనిపిస్తాడు. ‘నేనిందాక మాట్లాడిందంతా నిజమే అనుకున్నారు కదూ. నన్ను సైకో అనుకున్నారు కదూ. మిమ్మల్ని entertain చెయ్యడానికే అలా చేశాను’ అంటాడు. అతని ప్రవర్తన తనకు నిజంగానే భయం కలిగించిందని, ఇంకోసారి అలా చెయ్యొద్దని ఆమె చెప్తుంది. తర్వాత అతను అక్కడ ఉన్న కొలను దగ్గిరకు వెళ్లి సీరియస్ గా పుస్తకం చదువుతూ ఉంటాడు. అతను మళ్ళీ సీరియస్ అయ్యాడని ఆమె అతన్ని తేలిక పరచడానికి ప్రయత్నిస్తుంది. ఇద్దరూ మళ్ళీ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

కడుపులో కరకరమని ఆకలి కావటంతో భోజనం తయారు చేసుకోవాలనుకుంటారు. తనకు వంట బాగానే వచ్చని ఆమె చెప్తున్నా వినకుండా, అతను తన పాక విద్యా ప్రావీణ్యతను ప్రదర్శిస్తాడు (అంటే వంట చెడగొట్టడు. నిజంగానే చాలా బాగా చేస్తాడు). కొలనులో చేపను పట్టుకొచ్చి, ఆమెకిష్టమైన చేప వంటకం కూడా చేస్తాడు.

లంచ్ తర్వాత ప్రొఫెసర్ గారు రావటానికి ఇంకా చాలా సమయం ఉంటుంది (ఆయన మధ్యలో ఫోన్ చేసి, తను అనుకున్న సమయానికి రాలేకపోతున్నానని, వచ్చేసరికి సాయంకాలం అవుతుందని, వెయిట్ చెయ్యమని చెప్తాడు). మళ్ళీ వాళ్ళ మాటల మధ్యలో నాటకం ప్రస్తావన వస్తుంది. అతనిది నిజంగా బ్రిలియంట్ ఐడియా అని, తనే సరిగా అర్థం చేసుకోలేకపోయానని అంటుందామె. ఆ నాటకమే మళ్ళీ వేద్దామనుకుంటారు – ఆమె ప్రోద్బలంతో. ఈ సారి అతను, నటనలోని కొన్ని ప్రాధమిక అంశాలు ఆమెకు బోధిస్తాడు. ప్రతి వ్యక్తిలోనూ సహజంగానే ఒక నటుడుంటాడని, కొంచెం కృషి చేస్తే, ఆ నటుడిని బైటకు తీసుకురావటం కష్టమేమీ కాదని చెప్తాడు. ఆమెతో ఒక చిన్న యాక్షన్ బిట్ చేయిస్తాడు (తన ప్రియుడితో ఫోనులో మాట్లాడుతున్నట్టుగా). మొదట సరిగా చేయలేకపోయినా, తర్వాత అతని సూచనలకు అనుగుణంగా స్పందిస్తూ ఆమె బాగా చేస్తుంది.

అప్పుడు అసలైన నాటకం ప్రారంభిస్తారు. ఆమె ఒక మధ్య తరగతి గృహిణిలా తన గెటప్ కూడా కొంచెం మారుస్తుంది. నాటకంలో వాళ్ళు అంశంగా తీసుకున్నది అతని ఇంటి పరిస్థితే. తను ఎడ్డెం అంటే, భార్య తెడ్డెం అనాలి. అలాగే, అతనన్న ప్రతి మాటకూ, ఆమె రిటార్టు ఇస్తూ ఉంటుంది. అంతే కాదు. అలా నాటకం వేస్తూ వేస్తూ ఆమె అతని భార్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తుంది. అతను కూడా ఆమె అచ్చు తన భార్యలాగానే మాట్లాడుతోందే అనుకుంటాడు. ఆమె గొంతు తన భార్య గొంతులాగానే వినిపిస్తుంది. అది ఎంతవరకూ వెళ్తుందంటే, అతను తాము ఒక నాటకం వేస్తున్నామన్న సంగతి పూర్తిగా మరిచిపోతాడు. అది తమ ఇల్లేనని, తను తన భార్యతోనే మాట్లాడుతున్నానని అనుకుంటాడు. మాటకు మాట జవాబు ఇస్తూ ఆమె, తనకీ కాపురంలో సుఖం లేదని, తనను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతానని, తనకు విడాకులివ్వమని కూడా అంటుంది. మరి తను వదిలేసిపొతే, తన పరిస్థితి, కొడుకు పరిస్థితి ఏమిటంటాడు అతను. ‘మీతో నాకు సంబంధం లేదు. మీరిద్దరూ, దేంట్లోనన్నాదూకి చావండి’ అంటుందామె. అతను ఆ మాటలకు ఆవేశపడిపోయి, అక్కడే ఉన్న కత్తి పట్టుకుని ఆమె వెంటబడతాడు. ఈ హఠాత్ పరిణామానికి అవాక్కైన ఆమె, ‘మాధవ్ గారూ, ఏం చేస్తున్నారు మీరు. ఇది నాటకం. నిజం కాదు. నేను మీ భార్యను కాదు’ అని వారిస్తున్నా, అప్పటికే ఒక ట్రాన్స్ లో ఉన్న అతను, ఆ మాటలకు మరింత రెచ్చిపోయి కత్తితో ఆమె వెంట పడతాడు. మధ్యలో కత్తి కింద పడిపోతే, ఆమె తలను గోడకేసి కొడతాడు. రక్తం కూడా వస్తుంది. అప్పటివరకూ, అదొక నాటకమనుకొని నటిస్తున్న ఆమె అతని ప్రవర్తనకు షాక్ అవుతుంది. తనను వదిలి వెళ్లిపోవద్దని, అది పిల్లవాడిపైన చాలా చెడు ప్రభావం చూపిస్తుందని, తల్లి తనను వదిలేసి మరొక పెళ్లి ఎందుకు చేసుకుందో వాడి లేతమనసుకు అర్థం కాదని ఆవేదనగా అంటాడు. అక్కడే అందుబాటులో ఉన్న కత్తిని తీసుకుని, తన ప్రాణమే తీసుకోవటానికి సిద్ధమవుతాడు. ఇదంతా చూస్తున్న ఆమె ఏం జరగబోతుందో అర్థంగాక, మాటలురాక అవాక్కవుతుంది. మరి కొద్ది క్షణాల్లో కత్తి అతని గుండెల్లో దిగబోతున్నదనగా….

రిధిమ అభినందన పూర్వకంగా చప్పట్లు కొడుతుంది. ‘మాధవ్ గారూ. అద్భుతంగా నటించారు. అద్భుతం మీ నటన. అపూర్వం. ఫాంటాస్టిక్, ఎక్సెలెంట్’ ఇలా ఒక ఐదు నిముషాల పాటు చప్పట్లు కొడుతూ అతన్ని అభినందనలతో ముంచెత్తుతుంది. మాధవ్ మెల్లమెల్లగా ఈ లోకంలోకి వస్తాడు. ఆ అభినందనలకు ఉబ్బి తబ్బిబ్బవవుతాడు. తనలోని నటునికి ఇంతకాలానికి గుర్తింపు వచ్చిందని మురిసిపోతాడు. క్రమంగా అతని పెదవులపై చిరునవ్వు మొలుస్తుంది. ఆమె అతన్ని అభినందిస్తూనే ఉంటుంది. సడన్ గా అతను ‘ఇంకో నాటకం వేద్దామా?’ అంటాడు. ఆమె అతన్ని సుతారంగా వారిస్తుంది. ఇద్దరూ పగలబడి నవ్వుకుంటారు.

గోడ గడియారం ఆరు గంటలు కొడుతుంది. ప్రొఫెసరు గారు వచ్చేస్తారు. ‘హలో. మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించినందుకు సారీ. I hope everything is OK.’ అంటూ విష్ చేస్తారు. ఆయన మాటలు వాళ్ళ నవ్వుల్లో కలిసిపోతాయి. ఆ palatial బంగళాలో వాళ్ళ నవ్వులు ప్రతిధ్వనిస్తూ ఉండగా ‘శుభం’ కార్డు పడుతుంది. తెరమీద ఈ కొటేషన్ వస్తుంది.

“ఆ జగన్నాటక సూత్రధారి, కేవలం మన వినోదం కోసం సృష్టించిన అద్భుత నాటకమే ఈ జీవితం – శ్రీ పరమహంస యోగానంద

“This world is but a cosmic drama created by God for our entertainment only” – Sri Paramahamsa Yogananda

ఈ మధ్యకాలంలో నాకు చాలా సంతృప్తినిచ్చిన తెలుగు సినిమా ఇది. దీనిని గురించి రాయాలనుకున్నదంతా రాయలేకపోయాననుకుంటున్నాను. ఆందుకే దీనిని మొదటిభాగం అన్నాను. ఇందులో కథ చెప్పటం వరకే జరిగింది. దీన్ని ఇంకా కొంచెం విశ్లేషిస్తే బాగుంటుంది. అది త్వరలో రెండో భాగంలో చేస్తాను. నిజానికి దీన్ని గురించి మంచి చర్చ జరగాలనే, జరుగుతుందనే అనుకుంటున్నాను.

బ్యానర్: ఇందిరా క్రియేషన్స్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నీలకంఠ
నటీనటులు: మంజుల, సూర్య
సంగీతం: రాజ్
కెమెరా: రవి యాదవ్
ఎడిటింగ్: అనిల్ మల్నాడ్
నిర్మాత: మంజుల
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2002

- మేడేపల్లి శేషు, కొత్త ఢిల్లీ

Posted by మేడేపల్లి శేషు on June 25, 2009 09:56 PM · permalink

ఈ వ్యాసం యొక్క మొదటి భాగం ఇక్కడ చదవండి.

కథా రచయితలూ ఉన్నారు

ఈ సినిమాకైనా ఆరంభం కథతోనే అనేది నిర్విదాంశం. 24 డిపార్ట్మెంట్స్ లో ’స్టోరీ’ డిపార్ట్మెంటే మొదటిది. కొత్త తరం కథ రచయితలలో చాలామంది కూడా విద్యాపరంగా అత్యున్నత చదువులు చదివినవారే. ’గమ్యం’, ’సొంతవూరు’ వంటి సినిమాలకు కథ భాగస్వామిగా, మాటల రచయితగా పేరు పొందిన నాగరాజు గంధం అత్యున్నత విద్యావంతుడే. ఆయన కొంతకాలం ఖమ్మంలోని బిబిఎం కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశాడు.

అలాగే, రాం గోపాల్ వర్మకు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన కథ-మాటల రచయిత కోన వెంకట్ కూడా తక్కువవాడేం కాదు. ఆయన పూనేలో ఎంబిఏ చేసిన మాస్టర్ గ్రాడ్యుయేట్! ఢీ, దుబాయ్ శీను, చింతకాయల రవి వంటివి ఆయన రచనలే! ప్రస్తుతం ఆయన మాధవన్ హీరోగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ’రెడీ’ చిత్రంతో తెలుగు సినీ ప్రపంచంలోకి ప్రవేశించిన కథ-మాటల రచయిత గోపి మోహన్ కూడా ఇంజనీరింగ్ పట్టభద్రుడే. ఆయన బెల్గాంలో ఇంజనీరింగ్ చేశారు.

సంగీతకారుల సంగతేంటి?

తెలుగు సినిమాకు సంగీతం – పాటల ప్రాణం! మన సినీ రంగంలో ఇప్పటివరకూ సంగీతంలో కూడా సినీ కుటుంబాల పరిచయస్థులకే ప్రవేశం ఉండేది. గత కొంతకాలం నుంచి వస్తున్న మార్పుల ఫలితంగా నవతరం సంగీత దర్శకులకెంతో మందికి ప్రవేశం దక్కింది. అలా వచ్చి ప్రతిభను నిరూపించుకున్న వారిలో మిక్కీ జే మేయర్ ముఖ్యుడు. ’పోతే పోనీ’ సినిమాతో పరిచయమైన ఈయన టెన్త్ క్లాస్, నోట్ బుక్ సినిమాలకు సంగీతాన్నందించారు. ఇక ’హ్యాపీడేస్’ సంగీతం యూత్ లో జాతీయ సంగీతం అయింది. ఈయన మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ లోని ప్రఖ్యాత ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో పట్టాని సాధించారు. ఈ సంస్థలో ప్రతిష్టాత్మకమైన 8 ఏళ్ళ కోర్సును పూర్తి చేసిన మూడవ దక్షిణ భారతీయుడు ఈయనే. మిగతా ఇద్దరు ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ కావడం విశేషం.

ఇక కొంతకాలం క్రితం తెలుగు సినిమా సంగీతరంగంలో నవ్య పోకడలను సృష్టించిన సంగీతకళాకారుడు రమణ గోగుల! పనవ్ కల్యాణ్, వెంకటేశ్ సినిమాలెన్నింటికో సంగీతాన్నందించిన రమణ ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ చదివారు. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ గా అమెరికాలో పనిచేసిన ఆయన తన సినిమా కలని నిజం చేసుకుని సంగీత దర్శకులయ్యారు. ఈ మధ్యే నిర్మాతగా మారి సుమంత్ తో ’బోణి’ సినిమాని రూపొందించారు.

అలాగే ’ఆనంద్’, ’గోదావరి’, ’చందమామ’ సినిమాలతో ఆహ్లాదకరమైన సంగీతానికి కేరాఫ్ గా నిలిచిన సంగీతకారుడు కె.ఎం.రాధాకృష్ణన్. ఆయన బి.ఎస్సీ డిగ్రీ తర్వాత హైదరాబాద్ మ్యూజిక్ కాలేజీలో సంగీతంలో డిప్లొమాను చేయడమే కాక, భారతీయ సంగీతంలో రెండు సంప్రదాయాలైన కర్ణాటక-హిందుస్థానీ సంగీతాల మేళవింపుపై పరిశోధనలు చేశారు.

’వెన్నెల’ సినిమాకి సంగీతాన్ని అందించిన మహేశ్ శంకర్ కూడా ఉన్నత విద్యావంతుడే.ఆయన చెన్నై విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుండి డిగ్రీని, అమెరికాలో మాస్టర్స్ డిగ్రీని చేశారు. ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి తో కలిసి వందలాది స్టేజ్ షోలు ఇచ్చిన ఈయన తాజాగా ’ప్రయాణం’ చిత్రానికి సంగీతాన్నందించారు.

అనతికాలంలో సంచలన సంగీత దర్శకుడిగా వందలాది హిట్ సాంగ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్! ’చిత్రం’ తో సంగీత దర్శకుడిగా మొదలెట్టి, ’శ్రీను వాసంతి లక్ష్మి’ తో నటుడిగా ఆ తర్వాత దర్శకుడిగా మారిన ఆర్పీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ పోస్ట్ గ్రాడ్యుయేట్!

వీరే కాకుండా గీత రచయితలైన చేగొండి అనంత శ్రీరామ్ ఇంనీరింగ్ పట్టభద్రుడుకాగా, ’వనమాలి’ కలం పేరుతో పాటలు రాస్తున్న మణిగోపాల్ డాక్టరేట్ పట్టాపొందిన అత్యున్నత విద్యావంతుడు. అలాగే మరో గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి వరంగల్ లోని రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజి (ఇప్పుడు ’నిట్’) లోనూ, ఆ తర్వాత ఖరగ్ పూర్ లోని ఐఐటిలోనూ చదివిన అత్యున్నత వృత్తి నిపుణుడు.

సినిమాటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు

ఇక తెరపైన చిత్రాన్ని అందంగా ప్రదర్శించడంలో అసమాన ప్రతిభను చూపేవారు సినిమాటోగ్రాఫర్స్! తెలుగులోని కొత్తతరం సినిమాటోగ్రాఫర్స్ లో సైతం చాలామంది విద్యాపరంగా గొప్పవాళ్ళే కావడం విశేషం. ’అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్’ సినిమాతో పరిచయం అయిన సినిమాటోగ్రాఫర్ – మాలిని దాసరి! సినిమాటోగ్రఫీలో అత్యంత ప్రతిభావంతమైన మహిళగా పేరొందిన మాలిని ’తారే జమీన్ పర్’ ’జానే తు య జానేన’ వంటి సూపర్ హిట్ సినిమాలకు అసిస్టెంట్ కెమెరాఉమెన్ గా పనిచేసింది. ఆమె బెంగళూరులోని ఇండయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబియే పూర్తి చేసింది. ఆ తర్వాత పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో మూడేళ్ళ సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేసింది. అలాగే ’ఇదీ సంగతి’ సినిమాకు కెమెరామెన్ గా పనిచేసిన జయకృష్ణ గుమ్మడి, ’పౌరుడు’ సినిమాకు తళుకులద్దిన సుధాకర్ రెడ్డి కూడా ఉన్నత విద్యావంతులే. వీరంతా కూడా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో క్లాస్ మేట్స్ కావడం విశేషం.

వృత్తి నిపుణులే ఎక్కువ

తెలుగు సినిమాకు కొత్త జవజీవాలను కొత్త గ్రామర్ ను నిర్మిస్తున్న ఈ నవతరం కళాకారులు ఎక్కువమంది ఇంజనీరింగ్ వంటి సాంకేతిక వృత్తి నిపుణులే కావడం గమనార్హం. అలాగే, ఉన్నత విద్యా నేపథ్యం అని సందర్భాలలో అత్యున్నత సినిమాని సృష్టిస్తుందని చెప్పలేము. ’అనుభవాన్ని మించిన విద్య లేదు’ అని నిరూపించిన ఎంతోమంది గతకాలపు తెర మహానుభావులు అజరామరమైన సినిమాలను తీశారు. అలా అని న్యూజెన్ తెలుగు సినీ రంగంలో కనిపిస్తున్న ఈ అత్యున్నత విద్యా నేపథ్యం తాలూకు మార్పు పవనాల్ని విస్మరించలేము. ఎందుకంటే, తెలుగు సినీరంగంలో ఇన్నేళ్ళ కాలంలో వచ్చిన మార్పుకన్నా గత ఐదారేళ్ళ కాలంలో కనిపిస్తున్న నవ్య ధోరణే అత్యంత వేగంగా ఉందనేది గమనించాలి…ఉన్నత విద్యా నేపథ్యం తెలుగు సినిమాల్లో చూపిస్తున్న ప్రభావం ఇప్పటికే సుస్పష్టం. అది మరింత నిర్మాణాత్మక, సృజనాత్మక సినిమా సృష్టివైపు అడుగులేస్తుందనడంలో సందేహం లేదు.

ఏది ఏమైనా మంచి ’విజువల్’ కు చక్కనైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కలిస్తే సీన్ ఎలా పండుతుందో, ఈ నవతరం దర్శకులు, సాంకేతిక నిపుణులకు వారి చదువులు కూడా అంతే విజన్ ని ఇస్తున్నాయనేది నిజం.

అమెరికా రిటర్న్డ్…

ఉన్నత విద్యతో వచ్చే అత్యున్నత ఉద్యోగావకాశాలకు నెలవైన ప్రదేశంగా అమెరికాకు పేరుంది. ఆమెరికా వెళ్ళడమే మన తెలుగు సామాజిక జీవనంలో ఎంతో ఉన్నత స్థాయి దశగా భావించడం మామూలు. అలాంటిది అమెరికాలో చదువుకోసమో, ఉద్యోగం కోసమో వెళ్ళడం, అక్కడే స్థిరపడటం అనేది ప్రతీ పది తెలుగు కుటుంబాలలో దాదాపు ఆరు కుటుంబాల కల అంటే అతిశయోక్తి కాదు. ’డాలర్ డ్రీమ్స్’ తో వేర్వేరు వృత్తి నైపుణ్యాలతో అమెరికాకు వెళ్లిన తెలుగు వారు కొంతమంది వృత్తి ఉద్యోగాలకు అతీతంగా సినిమాను ప్రవృత్తిగా భావించినవాళ్ళున్నారు. వారు స్వదేశానికి, స్వరాష్ట్రానికి తిరిగొచ్చి తమ అభిరుచులు, తాము సినిమా కళను అర్థం చేసుకున్న తరహాలోనే సినిమాలను తీయడానికి చొరవచూపించారు. ఇంకా కొంతమందైతే, తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న ధోరణులను గమనించి, ఇక్కడి హీరోలను, నిర్మాతలను తమ కథలతో ఒప్పించడం కష్టమని భావించారు.

ఒక వైపు సినిమాపై ప్రేమ… మరో వైపు అందుకు అనుగుణమైన వాతావరణం తెలుగు సినీ పరిశ్రమలో లేకపోవడం….ఈ రెండింటి మధ్య సంఘర్షణకు గురైన నవతరం యువకులు కొంతమంది, తమ చిరకాల స్వప్నమైన సినిమా తీయడం కోసం డబ్బులు సంపాదించాలనుకున్నారు. దానికోసం తాము చదివిన చదువు, వృత్తి నైపుణ్యాలను సోఫానంగా మలుచుకున్నారు…అమెరికా వెళ్ళారు…డబ్బు సంపాదించారు…ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు.

తెలుగు సినీ పరిశ్రమలో బలంగా నాటుకుపోయిన సంప్రదాయక నిర్మాతలు – దర్శకులు -హీరోల వెంట తిరక్కుండా, తామే స్వయంగా నిర్మాతా దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు…ఈ మొత్తం పరిణామం తెలుగు సినీ పరిశ్రమలో ఓ సంచలనమే! ఉన్నత చదువు, ఉన్నత ఉద్యోగం వల్ల వచ్చిన నవ్య భావనలు, విస్తృత సాహిత్య అధ్యయనం, ప్రపంచ సినిమాతో పరిచయం వంటివి వీరి కథల్లో నవ్యతకు దారి తీసాయి. ఇలా అమెరికా రిటర్న్డ్ సినీ పిపాసులకు ఓ సక్సెస్ స్టోరీగా నిలిచిన దర్శకుడూ శేఖర్ కమ్ముల! ’డాలర్ డ్రీమ్స్’ తో తన సనీ స్వప్నాన్ని సాకారం చేసుకున్న శేఖర్, ’ఆనంద్’ సినిమాతో తెలుగు సినీ గమ్యాన్నే కొత్త పుంతలు తొక్కించాడు…యాక్షన్..ఫ్యాక్షన్ హింసోన్మాదాల తెలుగు సినిమాకు మంచి కాఫీ తాగిన అనుభూతిని అందించాడు. దేవా కట్టా తెలుగు సినిమాకు ’వెన్నెల’ ను అందిస్తే రాధాకృష్ణ సరైన ’గమ్యం’ చూపించారు. మరో అమెరికా రిటర్న్డ్ సంగీతకారుడు రమణ గోగుల ఇప్పటికే తెలుగు సినీ సంగీతంలో ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చాడో తెలిసిందే. అలాగే నిర్మాతలు హరిచరణ్ ప్రసాద్, మోహన్ కూడా అమెరికా రిటర్న్డ్ తెలుగువారే!

డిఫరెంట్ సినిమాకి ’హ్యాపీడేస్’

‘ఎడ్యుకేషన్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్’ అనేది అమెరికన్ ప్రాగ్మాటిక్ తత్వవేత్త జాన్ డ్యూయి మాట! అంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే సంసిద్ధతను ఏర్పర్చేది విద్య అని అర్థం. ఇక స్వామి వివేకానంద, జిడ్డు కృష్ణమూర్తి వంటి భారతీయ తాత్విలుకు ’సంపూర్ణమూర్తినుత్వవికాసమే విద్యాలక్ష్యం’ అని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో ఇంతకాలం కొనసాగుతున్న విద్యావిధానం ఈ మహోన్నత లక్ష్యాలను ఎంతమేరకు సుసాధ్యం చేస్తున్నాయనే విషయాన్ని పక్కనపెడితే, అకడమిక్ చదువులు వ్యక్తి ఆోచనలో, దృక్కోణంలో, జీవనశైలిలో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం. ఈ తేడానే మన తెలుగు సినీరంగంలోని అత్యున్నత విద్యావంతులైన దర్శకులు, రచయితలు, ఇతర సాంకేతిక నిపుణులు సినిమాను చూసే, చూపించే విధానంలో వైవిధ్యతకు కారణమవుతోంది.

మన తెలుగు సినిమాకు సంబంధించినంతవరకు తెర వెనుక సినిమాను నడిపించే దర్శకులు, కథకులు, కెమెరామెన్, సంగీత దర్శకులకు సంబంధించి ప్రధానంగా రెండు రకాల ఔత్సాహికులు కనిపిస్తారు. ఒక రకమేమో, చిన్నప్పటినుంచి సినిమాలను చూసి, సినిమాలను ప్రేమించి చెప్పాపెట్టకుండా రైలెక్కేసి మద్రాస్ బాటనో, భాగ్యనగరం బాటనో పట్టేవాళ్ళు! వీళ్లకి సినిమా ఓ జీవితాశయం. సినిమా తప్ప మరేదీ కనిపించని మమేకభావం. ఇక మరో రకం ఉంటారు. వీరు అకడమిక్ గా అత్యున్నత చదువులు చదివిన వారు. ఇతర నైపుణ్యాలలో ఉన్నత స్థానానికి ఎదిగిన వారు. అదే సమయంలో సినిమాని, సినిమా కళని విపరీతంగా ప్రేమించినవారు. సినిమా మీది ఆకర్షణని, వ్యామోహాన్ని శాస్త్రీయంగా, విస్తృత అధ్యయనం చేసిన వారు….ఆకళింపు చేసుకున్నవారు. టెక్నిక్-ట్రీట్మెంట్-టేకింగ్ ల విషయంలో క్రియేటివిటీని ప్రపంచ స్థాయి ధోరణులను చొప్పించగలిగినవారు. వీరిలో ఈ విశాల దృక్పథానికి కారణం వారి చదువులే అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ రెండు రకాల సినీ ప్రేమికులలో ఇద్దరికీ సినిమా క్రాఫ్ట్ పట్ల ఉన్న ప్యాషన్ ని యాంబిషన్స్ ని తక్కువ అంచనా వేయలేము. కానీ ఇన్నాళ్ళ తెలుగు సినీ ప్రస్థానంలో ఆయా దర్శకులు – రచయితల ’అకడమిక్’ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, వారు సృష్టించిన సినిమాలలో తేడా ఇట్టే కనిపిస్తుంది. అకాడమిక్గా సైఅతం అత్యున్నత విద్యనభ్యసించిన దర్శకులు తెలుగు సినిమాకు ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచారని అర్థమవుతుంది. ఫార్ములా రొడ్డకొట్టుడు సినిమాలకు భిన్నమైన ’డిఫరెంట్ సినిమాని’ తెలుగు తెరకు పరిచయం చేసిన ’క్రియేటర్స్’ కూడా వీరే అని అర్థమవుతుంది. రాంగోపాల్ వర్మ, శేఖర్ కమ్ముల, జాగర్లమూడి రాధాకృష్ణ, దేవ కట్టా, ఇంద్రగంటి మోహనకృష్ణ, శ్రీకాంత్ అద్దాల వంటి వారే ఇందుకు ఉదాహరణ. 78 ఏళ్ళ తెలుగు సినిమా గమనంలో ఒక ’శివ’, ’ఆనంద్’, ’గమ్యం’, ’అష్టాచెమ్మా’ వంటి డిఫరెంట్ సినిమాలని సృష్టించింది అత్యున్నత విద్యావంతులైన సినిమా ప్రేమికులే! మున్నెప్పుడూ లేనంతగా ఇప్పుడు తెలుగు సినీ సీమలోకి విద్యాధికులంతోమంది వస్తుండడంతో రానున్న కాలం అంతా తెలుగు సినిమాకు ’హ్యాపీడేస్’ అనిపిస్తోంది!

Posted by మామిడి హరికృష్ణ on June 25, 2009 10:51 AM · permalink

ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు నటీనటుల పనితనం వీధినాటకాల వాళ్ల నటనకంటే తీసి కట్టుగా అనిపించిందా?, సెట్టింగుల్లో డొల్లతనం కళ్ళు మూసుకున్నా కనిపించిందా? నాసిరకం నిర్మాణ విలువలు అడుగడుగునా విసుగెత్తించాయా? ఇలాంటి సినిమాలకి ఏం పేరు పెట్టాలా అని ఆలోచన కలిగిందా? .హాలీవుడ్ వాళ్ళు అలాంటి వాటిని ఎడ్‍వూడ్స్ పిల్మ్స్ అని ముద్దుగా పిల్చుకుంటారు. ఈ ఎడ్‍వూడ్ ఎవరా అనుకుంటున్నారా? అయితే మీరు టిమ్ బర్టన్ సినిమా ఎడ్‍వూడ్స్ చూడాల్సిందే. ఆత్మ విశ్వాసం, పట్టుదల, స్నేహితుల తోడ్పాటు ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని చాలా కధల్లో చదివేసి, ఎన్నో సినిమాల్లో చూసేసిన మనకు ఇవన్నీ ఉన్నా అనుకున్నది సాధించలేని ఓ నిజ జీవితాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం చేదుగుళిక వంటిది. అయినా దానికి సరైన హాస్యన్ని రంగరించి వైఫల్యంలోని విజయాల్ని వెతుక్కొమ్మంటుందీ ఎడ్‍వూడ్స్ కధ.

1950ల నాటి కాలంలో జయాపజయాలతో పనిలేకుండా వారానికో సినిమాని జనాలమీదకి వదిలేసిన ఓ మహద్దర్శకుని జీవితగాధ ఈ చిత్రం. నాటకరంగంలో విమర్శకులు తన సామర్ధ్యాన్ని సరిగ్గా గుర్తించడంలేదన్న అసహనంతో హాలీవుడ్డే తనకి సరైన చోటని నిర్ణయించుకొని ఎడ్ అక్కడ ప్రయత్నాలు మొదలు పెట్టడంతో ఈ సినిమా ప్రారంభమౌతుంది. జార్జ్ అనే రెండవ రకం సినిమాలు నిర్మించే నిర్మాతను ఒప్పించి ’ఐ ఛేంజ్డ్ మై సెక్స్’ అనే వినూత్న (వాళ్ళిద్దరి దృష్టిలో) చిత్రానికి శ్రీకారం చుడతాడు. ముప్పైవ దశకంలో డ్రాకులా చిత్రాల ద్వారా ఓ వెలుగు వెలిగి చివరి రోజుల్లో చావుకోసం ఎదురు చూస్తున్న బెల లుగొసి అనే ఘనాపాటిని మచ్చిక చేసుకొని తన సినిమాలో నటించేందుకు కుదుర్చుకుంటాడు. బెల లుగొసి జతవ్వడంతో సినిమాకి స్టార్ వాల్యూ వచ్చేసింది కాబట్టి ప్రధాన పాత్రను తనే పోషించేసి, తన ప్రేయసిని హీరోయిన్గా నటింపచేసేస్తాడు. నిర్మాతగారు పోస్టర్ రెడీ చేసుకొని మరీ సినిమా నిర్మాణం మొదలుపెట్టీనా, తన చాకచక్యంతో షూటింగ్ పూర్తయ్యేప్పటికి అనుకున్న కధని రకరకాలుగా మార్చేసి టైటిల్ని ’గ్లెన్ ఆర్ గ్లెన్డా’ అని మార్చేస్తాడు. కేవలం నాలుగు రోజుల్లోనే సినిమాని పూర్తిచేసి గొప్పగా విడుదలచేసి విమర్శకుల ఛీత్కారానికి గురవుతాడు. అయితే ఆర్సన్ వేల్స్ తర్వాత మొదటి సినిమాలోనే రచయిత, నటుడు, దర్శకుడు మొదలైన భాద్యతలు స్వీకరించిన గొప్పవాడిగా తనను తాను అభివర్ణించుకుంటాడు.
జార్జ్ తను చెప్పినట్టుగా కాకుండా అన్నీ మార్చేయడం వల్లే సినిమా ఫలితం వికటించిందని కోపగించి ఎడ్‍ని బయటకి పంపేస్తాడు. చేసేది లేక తన ’గ్లెన్ ఆర్ గ్లెండా’ని వార్నర్ బ్రదర్స్‍కి చూపించి తర్వాతి సినిమాకి ఆర్ధిక సహాయం అడుగుతాడు. తమ జీవితంలో ఇంతటి కళాఖండాన్నీ ఎప్పుడూ చూసుండని ఆ సంస్ధవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఎడ్‍లోని టాలెంటుకు తాము సరితూగలేమని నచ్చ చెప్పి ఇలాంటి సినిమాల్ని తెరకెక్కించాలంటే ఇండిపెండెంట్ ప్రొడక్షన్స్ మొదలు పెట్టుకోవడం ఒకటే మార్గమని సలహా ఇస్తారు. దాంతో తన రెండవ సినిమాగా ’బ్రైడ్ ఆఫ్ ఆటమ్’ అనే సినిమాని మొదలు పెడతాడు. షరా మామూలుగానే లుగొస్‍ని, తన ప్రేయసిని ఇందులో కూడా నటింపజేస్తాడు. ప్రధాన పాత్రకు మాత్రం ఫేడవుటైపోయిన ఒక ఫైటర్ని తీసుకుంటాడు. కష్టపడి సినిమా పూర్తి చేసి ప్రివ్యూ వేస్తే, ప్రేక్షకులందరూ వెంటపడి రాళ్ళతోనూ, చెప్పులతోనూ దాడి చేసి తమ వ్యధను వ్యక్తం చేస్తారు. ప్రియురాలు కూడా ఎడ్ వింత ప్రవర్తన భరించలేక చెయ్యిచ్చేస్తుంది. ఈ అవమానం నుండి తేరుకోక ముందే లుగొస్ అనారోగ్యంతో చనిపోతాడు. ఉన్న ఒక్క స్టార్ని కూడా కోల్పోయి అసహనంతో తర్వాతి సినిమాకి నిధులు వెతుక్కుంటుండగా ఇంటి ఓనర్ అద్దె కోసం వస్తాడు. తనతో ఒక సినిమా తీస్తే వచ్చే డబ్బులతో పన్నెండు క్రైస్తవ సినిమాల్ని తెరకెక్కించొచ్చని బరోసా కల్పించి ఇంటి ఓనర్ని బుట్టలో పడేస్తాడు. అలా మొదలైందే ’ గ్రేవ్ రోబర్స్ ఫ్రం ఔటర్ స్పేస్’ అనే సైంటిఫిక్ రొమాంటిక్ థ్రిల్లర్ . అలవాటు ప్రకారం పూర్తయ్యేప్పటికి టైటిల్ కాస్తా ’ ప్లాన్ 9 ఫ్రం ఔటర్ స్పేస్‍గా’ రూపాంతరం చెందుతుంది. ఈ సినిమా ప్రివ్యూ రోజు తన రెండో గర్ల్ ఫ్రెండ్‍ని పెళ్ళిచేసుకోవడంతో సినిమా ముగుస్తుంది .
ఎడ్‍వూడ్స్ గురించి సినిమా అనగానే మొదట చాలామంది టిమ్‍బర్టన్‍ని రకరకాలుగా వారించారంట. అయినా సరే తనకున్న పలుకుబడినంతా ఉపయోగించి మరీ ఈ సినిమాని పూర్తిచేసాడు టిమ్‍బర్టన్‍. తాను ఎడ్ అభిమానిని అని చెప్పుకునే టిమ్, ఎడ్ వ్రాసిన కొన్ని ఉత్తరాలు చదివి ఆశ్చర్యపోయాడంట. తన ఉత్తరాల్లో సినిమాల గురించి వ్రాస్తూ తానేదో సిటిజెన్ కేన్ సినిమా తీస్తున్నంత గొప్పగా పీలయ్యేవాడంట ఎడ్. చాలాసార్లు తన తరంవారిలో ఆర్సన్ వేల్స్ తర్వాత తానే సినిమాకి సంబంధించిన అనేక శాఖల్ని నిర్వహించిన ప్రతిభావంతుడిగా పేర్కొన్నాడు కూడా ఎడ్. ఇక ఇంతటి మితిమీరిన స్వాభిమానాన్ని ప్రదర్శించే ఎడ్‍గా నటించింది జానీడెప్. తనకి జోడీ సారా జస్సికా పార్కర్ ( సెక్స్ అండ్ ది సిటీ ఫేం). జానీ డెప్ ఎంతగా ఈ పాత్రకి సరిపోయాడంటే, మీరు కనుక గ్లెన్ ఆర్ గ్లెండాలో నిజమైన ఎడ్‍ను ఈ సినిమాలో గ్లెన్ ఆర్ గ్లెండా షూటింగ్ సీన్లలోని జానీడెప్‍ను ప్రక్కప్రక్కన పెడితే ఎవరెవరో పోల్చుకోలేరు. కేవలం అలంకరణ మాత్రమే కాదు, పూర్తిగా ఎడ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు జానీ డెప్. తర్వాత చెప్పుకోవాల్సిన పేరు బెల లుగొసిగా చేసిన మార్టిన్ లాండౌ గురించి. వీళ్ళిద్దరి మధ్యా సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ముఖ్యంగా లుగొసి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసే సన్నివేశాలు. 1950ల నాటి అనుభూతి రావడం కోసం సినిమా అంతా నలుపు&తెలుపులలోనే చిత్రీకరించారు. ఇక ఎడ్‍తో ప్రతి సినిమాకి పనిచేసేవారితో ఉన్న సన్నివేశాలు కూడా చాలా నవ్వు తెప్పిస్తాయి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడ కోసం ప్రతిషాట్‍ను ఒకే టేక్‍లో ఒకే చెసెయ్యడం, సెట్టింగులు పడిపోతున్నా పట్టించుకోకుండా చిత్రీకరించేయడం, లుగొసి చనిపోయాక అతనికి డూప్ పెట్టి కవర్ చెయ్యడం కోసం చెయ్యి ముఖానికి అడ్డు పెట్టుకొని నటింపచేయడం, సినిమాకి పనిచేసేవాళ్ళు కూడా ఒక్కోసారి కెమెరాలో కనిపించేయడం, ప్రపంచ యుద్ధానికి సంబంధించినవి, ఎవరో సాహస యాత్రికులు తీసిన ఆక్టోపస్ వంటి raw footageని అవసరం ఉన్నా లేకున్నా అక్కడక్కడ తన సినిమాల్లో చొప్పించేయడం వంటి మొదలైన అంశాలని చాలా ఆహ్లాదంగా చిత్రీకరించారు.

ఎక్కడా విసుగు అనేది అనిపించకుండా నడిచిపోయే ఈ చిత్రం సరైనా ప్రచారం చెయ్యకపోవడం వల్ల అప్పట్లో అంతగా ఆదరణకు నోచుకోలేదు కానీ డివీడిల రూపంలో బాగానే నడిచింది. ఎడ్ జీవితాన్ని చూస్తే మనం అసహ్యించుకొనే ఎన్నో ( ముఖ్యంగా మనకు పరిచయమున్న చిన్న తెలుగు సినిమాలు ) సినిమాల వెనుక కూడా ఎంతో శ్రమ ఉన్నదన్న ఆలోచన కలిగి వాళ్ళపైన కూడా సానుభూతితో కూడిన గౌరవం కలుగుతుంది. ఎప్పుడూ విజయాన్ని రుచి చూడకపోయినా ఎడ్ ప్రతి సినిమాకి తప్పకుండా పనిచేసే కొంతమందిని సంపాదించుకోగలిగాడు. వీళ్ళంతా ఏం చూసి ఎడ్‍ని అంటిపెట్టుకొని ఉన్నారన్నది అంతుతెలియని ప్రశ్న. వీళ్ళంతా తెరవెనుక, తెరముందు కూడా చాలా సార్లు తమ శ్రమ దారపోసినవారే. కొంతమందంతే కష్టపడ్డం తెలుసు కానీ, సరైన విధానం తెలీదు. ఏదో చేసేస్తున్నాం అని కాకుండా చేసే పనిలో నాణ్యతని తరచి చూసుకోవాలన్న విషయాన్ని ఎత్తిచూపుతుంది ఎడ్ జీవితం.
అమెరికాలో కొన్ని ప్రముఖ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్లో ఎడ్ సినిమాలకి సంబంధించి ఒక ప్రత్యేకమైన సిలబస్ కూడా ఉంది. సినిమాలు తీసేప్పుడు ఎలాంటి తప్పులు చెయ్యకూడదో నేర్పడం కోసం ఎడ్ సినిమాల్ని విద్యార్ధులకి చూపిస్తారు. ఏదో ఒక విధంగా చలనచిత్ర రంగంలో తన పేరు నిలబెట్టుకున్న ఎడ్‍వూడ్స్ నిజంగా వైఫల్యంలో విజయం సాధించినట్టే.

Posted by శంకర్ on June 24, 2009 10:05 PM · permalink

అనగనగా ఒక కెనడాలో పట్టిన భారతీయ సంతతి వ్యక్తి. పేరు ఆనంద్ రామయ్య. కెనడియన్ భార్య. అప్పుడే మరో బిడ్డకు తండ్రయ్యాడు. సంతోషంగా సాగే జీవితం. హఠాత్తుగా కెనడాలో ‘మ్యాడ్ కౌ’ రోగం కమ్ముకుంది. రోజూతినే బర్గర్లోని బీఫ్ ద్వారా రోగాలు అంటుకునే ప్రమాదం ఏర్పడింది. ఆహారం విషయంలో అబద్రత ఏర్పడింది. తినేతిండి ఎంత సురక్షితమో ప్రశ్నార్థకం అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు మూల కారణం వెతకాలని తన వీడియో కెమెరాతో బయల్దేరాడు.

ఆనంద్ రామయ్య భార్య కుటుంబీకులు ఒకప్పుడు పశువుల పెంపకం వృత్తిగా కలిగినవారు. వారందరినీ కలిసి మాట్లాడాడు. తెలిసిందేమిటంటే పశువుల పెంపకం కుటుంబ వృత్తిగా ఉన్నంతవరకూ బాగానే ఉండేదని, కొన్ని కార్పొరేషన్లు/కంపెనీలు మాంసం ఉత్పత్తిని ఏకీకృతంచేసి గుత్తాధిపత్యం చెలాయించే స్థితికి వచ్చేసరికీ రైతుకు తీవ్రమైన నష్టాలువచ్చి, పశువుల పెంపకంకూడా కార్పొరేట్ల ఆధీనంలోకి వెళ్ళిపోయిందని తెలిసింది. మ్యాడ్ కౌ వ్యాధి మూలాలు ఇక్కడ్నించే మొదలయ్యాయనే నిజం ఆనంద్ కు తెలిసొచ్చింది.

కంజ్యూమర్/కస్టమర్ కు అతితక్కువ ధరకు బీఫ్ (పశుమాంసం) అందించి అధిక లాభాల్ని సంపాదించే వ్యూహంలో భాగంగా కారొరేషన్లు పశువుల దాణాలో వ్యర్థంగా మైగిలిపోయిన పశుమాంసాన్నే పౌడర్ రూపంలో కలిపే విధానానికి శ్రీకారం చుట్టారు. పశువుల ఆరోగ్యంతో సంబంధం లేకుండా శాఖాహారులైన పశువులకు పశువుల్నే తినిపించే ఘోరమైన పద్ధతిని అవలంభించారు. ‘మ్యాడ్ కౌ’ రోగం ఈ హేయమైన వ్యాపారపద్ధతికి మూలమయ్యింది.

ఒకవైపు రైతులు మరొక వైపు ప్రజారోగ్యం కారొరేషన్ల ధనదాహానికి బలైపోయాయి. తినేతిండి విషతుల్యమైపోయింది. అనే విషయం తెలుసుకున్న ఆనంద్ కు చాలా బాధకలిగింది. అదే సమయంలో తన పూర్వజులు భారతదేశంలో పశువులకున్న ప్రాధాన్యత గురించి, పవిత్రత గురించీ చెప్పిన విషయాలు మనసులో మెదులుతున్న ఆనంద్ ‘మ్యాడ్ కౌ’ (పిచ్చి పశువు) కు వ్యతిరేకమైన ‘సేక్రెడ్ కౌ’ (పవిత్ర పశువు)ను వెతుక్కుంటూ కేమెరా భుజాన వేసుకుని భారతదేశం వచ్చాడు.

ఏ పవిత్రమైన పశువు కోసం ఆనంద్ వెతుకుతూ తన పూర్వజుల భూమికొచ్చాడో ఆ నేలలోనూ ఆధునిక నాగరికత మధ్య ప్రశ్న చిహ్నమౌతున్న పశువును కనుగొన్నాడు. సాంప్రదాయక పంటలు, వృత్తులూ వ్యాపారాత్మకతను సంతరించుకుని పశువులకు నిలువ నీడలేకుండా చేశాయనే నిజం తెలిసొచ్చింది. దాదాపు అరవై ఐదు శాతం ప్రజలకు జీవనోపాధిలో నిలిచిన పశువు, సంక్షోభంలో ఉందనే సత్యం ఎరుకయ్యింది.

ఒకవైపు వ్యవసాయ రంగంలో సంక్షోభం, ఒకవైపు పర్యావరణ సంక్షోభం, కుటుంబాల్లో సంక్షోభం, పవిత్రమైన పశువు పేరుమీద మతంపేరుతో సంక్షోభం. ఇలా ఎన్నో సంక్షోభాల నడుమ పశువు భారతదేశంలో కూడా చీల్చిచండాడబడుతోందనే నిజాన్ని తెలుసుకుని, ప్రపంచీకరణ పవిత్రమైన పశువుల్ని కూడా పిచ్చి పశువులుగా చేసి వ్యాపారసంస్థూ, రాజకీయ పార్టీలూ, పారిశ్రామకవేత్తలూ మనుషుల జీవితాలతో ఆడుకుంటున్నారనే నిజాన్ని గ్రహించిన ఆనంద్ భారంగా కెనడా తిరుగు ప్రయాణం అవుతాడు.

ఈ డాక్యుమెంటరీ చిత్రం చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో చూపించబడింది. రెండు గోల్డెన్ షీఫ్ అవార్డుల్ని పొందింది. హైదరాబాద్ కు చెందిన ఫిల్మ్ మేకర్ ఫర్హతుల్లా బేగ్ ఈ చిత్రానికి చేసిన పరిశోధనకుగాను అవార్డుని పొందారు.

ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడండి.

Posted by K మహేశ్ కుమార్ on June 23, 2009 08:07 AM · permalink

మిత్రుడు, నవతరంగం అభిమాని, ఔత్సాహిక సినీ దర్శకుడు జొనాథన్ గురించి నవతరంగం పాఠకులకు పరిచయం చెయ్యనక్కర్లేదు. గతంలో జొనాథన్ రూపొందించిన మూడు లఘు చిత్రాలను నవతరంగంలో ప్రదర్శించడం జరిగింది. ఒక్కో సినిమాకు తన దర్శకత్వ ప్రతిభను పెంచుకుంటూ వెళ్తున్న జొనాథన్ రూపొందించిన మరో లఘుచిత్రం నవతరంగం పాఠకుల కోసం అందివ్వడం ఆనందంగా ఉంది.

త్వరలో జొనాథన్ లఘుచిత్రాల నుంచి పూర్తి స్థాయి చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదుగాలని ఆశిస్తూ ఈ లఘు చిత్రం మీకోసం…

<object classid="clsid:d27cdb6e-ae6d-11cf-96b8-444553540000" width="451" height="214" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"><param name="allowfullscreen" value="true" /><param name="allowscriptaccess" value="always" /><param name="src" value="http://vimeo.com/moogaloop.swf?clip_id=5136860&server=vimeo.com&show_title=1&show_byline=1&show_portrait=0&color=00ADEF&fullscreen=1" /><embed type="application/x-shockwave-flash" width="451" height="214" src="http://vimeo.com/moogaloop.swf?clip_id=5136860&server=vimeo.com&show_title=1&show_byline=1&show_portrait=0&color=00ADEF&fullscreen=1" allowfullscreen="true" allowscriptaccess="always"></embed></object>K- Short Film from Jonathan on Vimeo.

Posted by నవతరంగం on June 23, 2009 04:09 AM · permalink

కధా కధనాన్ని పక్కనపెడితే ఈ సినిమా ప్రత్యేకించి నటిశిరోమణి సావిత్రి జీవిత చరిత్రని ఆమూలాగ్రం స్ఫురింపచేస్తూ (ఆవిడ జీవితం చివర్లో విషాదాంతం,ఈ కధ సుఖాంతం అంతే తేడా) ఒక్కో చోట నిజమేనేమో అనిపింపచేస్తుంది కూడా కొన్ని సన్నివేశాల్లో.యధావిధిగా ఆమె ఇందులో కూడా తనకి మాత్రమే సొంతమయిన నటవిశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.ప్రత్యేకించి “మంచి మనసులు” సినిమా తర్వాత ఇదే సినిమాలో కొన్ని సన్నివేశాల్లో కనిపించినంత సౌందర్యంగా,చిలిపిగా మరే చిత్రంలో(నటనని మినహాయిస్తే) కనిపించలేదేమొ మరి.

ఇప్పటి నిర్మాతా,దర్శకులు,నటీమణులు తప్పకుండా నేర్చుకోవాల్సిన అంశాలు ప్రత్యేకించి లిప్స్టిక్ ఎడ్వర్టైజ్మెంట్స్ లాగ పెదాల కదలికలు,ఇంకా శరీరంలో ఎన్ని చోట్ల ఏ ఏంగిల్ లో చూపెట్టి కేష్ చేసుకోవచ్చో వగైయిరాల్లాంటి చీప్ ట్రిక్స్ లేకుండా ఎలా నటించచ్చో నటీమణులు నేర్చుకోవాల్సిన అంశం.

ఆమె చూపొక సమ్మోహనాస్త్రం,ఆమె నవ్వొక లాలిత్యం, మాటొక ఆణిముత్యం, నడకొక లయవిన్యాసం, స్పర్శ ఒక ఓదార్పు, నటనొక అనుభూతి, ఇవన్నీ కలగలిపి ఆమే ఒక ఆమే ఒక తీపిగుర్తు. నిమేషమాత్రంలో చేసే ఆ పెదాల విరుపులో పడిపోని మానవమాత్రుడుంటాడా అనేది సందేహమే, ఆమె ముగ్ధమోహన సౌందర్యానికి తలొగ్గని మగతనం ఉంటుందా అన్నది సందేహమే.ఆ నల్లత్రాచు లాంటి పొడవాటి జడని అలా ఓ రెండు అల్లికలేసి ఒక్క సారి అలా విసిర్తే అంతులేని అలౌకికానందంతో ప్రపంచాన్ని చుట్టొచ్చినట్టు చుట్టూ తిరిగొచ్చి ముందు నించి ఎడమభుజం మీదకి వాలడం అదొక ప్రత్యేకత.

“తినిపించాలేం పాపం” అంటూ అక్కినేనికి చిన్న చిన్న ముక్కలుగ చేసి ఇడ్లీ తినిపించే దృశ్యంలో ఎన్నిభావాలయిన వెతుక్కోవచ్చు ఎవరికి కావాల్సినవి వారు. ప్రేమలో అమాయకత్వమంటే ఇలా ఉంటుందా, అమాయకమయిన ప్రేమ ఇదా ఏమో, ప్రేమని ఎన్నిరకాలుగా వ్యక్తపరచచ్చో అన్నిరకలుగానూ వ్యక్తీకరించడమే ఈ సినిమా ప్రత్యేకత.

కుమారి జయలలితని ఈ సినిమాలో చూసిన వారెవ్వరికీ ఆమేనా ఇప్పటి ఈ జయలలితా అనిపించక మానదు..పోండి డాడీ అంటూ గారాలు కులుకుతూ వయ్యారాలొలుకుతూ పలికే ఆ ముద్దు ముద్దు చిలక పలుకుల్లో ఎన్ని సంగతులయినా వెతుక్కోచ్చు.అప్పట్లో ఆవిడకి మాత్రమే సాధ్యమయిన రేప్పూ..పాప్పూ డేన్సులు కూడా ప్రత్యేక ఆకర్షణే ఈ చిత్రంలో.

మిగతా నటులంతా వారి వారి పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు.

ఇంక కధలోకొస్తే వేణు(ఏ ఎన్ ఆర్) అన్న కుర్రాడు తన జీవితంలో జరిగిన దుస్సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఇంజినీర్ కావాలన్న దృక్పధంతో రాజారావనే పెద్దాయన(గుమ్మడి)చేరదీయడంతో ఆయన నీడలో పెరిగి పెద్దవాడయి అతని ఆశయాని నెరవేర్చుకునే ప్రక్రియలో ఆ పెద్దాయన కూతురు అయిన రాధ(సావిత్రి)ఇతన్ని ప్రేమిస్తుంది.ఆ ప్రేమని ఎన్ని రకాలుగ రాధ వ్యక్తపరిచినా వేణు గ్రహించడు,పైగా నాకటువంటి అభిప్రాయం లేదంటూ అతని ఏకైక ఆశయాని వ్యక్తపరుస్తాడు రాధకి.అలా తిరస్కరించ బడ్డ రాధ కి చీఫ్ ఇంజినీర్ గోపాలరావు (రమణారెడ్డి)అన్న కొడుకు భాస్కర్(జగ్గయ్య) తో వివాహం నిశ్చయం అవుతుంది.అప్పటిదాకా వేణుతో కలిసి మెలిసి తిరిగిన రాధ అప్పటితో ఇక వేణుతో కలివిడిగా ఉండడం మానేసి వేణూని కూడా అలానే దూరంగా ఉండమని చెపుతుంది. అప్పటికి గానీ వేణూకి తన జీవితంలో ఎంత విలువయిన వ్యక్తిని కోల్పోయాడో తెలిసిరాదు.అలా వేణూ తనని అత్యంత అభిమానించే స్త్రీ కి దూరమవుతాడు.

రాధ బావ శేషు మేన మామ తనని కాదని రాధని భాస్కర్ కి ఇచ్చి చేసినందుకు పగ బట్టి రాధ సంసారాన్ని ఎలాగయిన నాశనం చేసి ఆస్థి ఎలాగయినా కొట్టెయ్యాలని ఉద్దేశ్యంతో రాధ గర్భవతి గా ఉన్నప్పుడు ఆమెకి కొంచం దూరంగా ఉండల్సి రావడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ప్లేన్ అమలుచేస్తాడు శేషు. భాస్కర్ మీద రాణిని (విటురాలు – రాజశ్రీ) ప్రయోగించి అతనిని ఆ ఊబిలోకి లాగి మందు అలవాటు చేయించి అధోగతికి చేరుస్తారు. సరే అలా ఖాళీగా ఉండడం వల్ల భాస్కర్ ఇలా చెడు అలవాట్లకి బానిసవుతున్నాడని అనుకుని పట్నం వెళ్ళి కాంట్రాక్ట్స్ చేస్తాననగానే పెట్టుబడికి తండ్రితో డబ్బులు ఇప్పిస్తుంది రాధ.అలా చిన్న మకాం కూడా పట్నానికి మారి కొన్నాళ్ళు అవగానే అక్కడికి కూడా చేరిన శేషు మెల్లిగా అతన్ని వ్యవహారాలు చూసే నెపంతో మేనేజర్ గా కంపెనీ పనులు చూస్తూ ఉంటాను నువ్వు పూర్తిగా సుఖాల్ని అనుభవించమంటూ రాణి చేత ప్రపోజల్ పెట్టించి పూర్తిగా ఆమె వశమయ్యేట్టు చేస్తారు. అలా తాగుడుకి బానిసయిన పూర్తిగా ఇంటిని తనని బిడ్డని కూడ నిర్లక్ష్యం చేసే తన భర్త తనలో లేనిది ఆ రాణిలో ఏమి చూశాడో తెల్సుకోవాలని వెళ్ళి ఆమెతో జరిగిన సంభాషణలో ఆమె చెప్పినట్లు మీరు భార్యలు,మీకు కొంత పరిధి ఉంది కాబట్టి ఆ పరిధులు ఏమీ లేని మా దగ్గరకి వచ్చి ఆ కోరికల్ని తీర్చుకుంటారు అని చెప్పడంతో రాధ భర్తని ఆ ఇంటికి పోకుండా కట్టడి చెయ్యలనే తలంపుతో ఒకానొక సందర్భంలో భర్తతో కల్సి తను కూడా తాగాల్సి వస్తుంది, అలాగయినా భర్తని బయటకి పోనివకుండా కట్టు దిట్టంచెయ్యచ్చని భావించి తనూ భర్తకి చీర్స్ చెపుతుంది అతని ఆనందం కోసం.

ఇంకో పక్క వేణు ఇంజినీర్ అయి మంచిపేరు తెచ్చుకుంటాడు,అతనిని ప్రేమిస్తూ ఉంటుంది చీఫ్ ఇంజినీర్ గోపాలరావు కూతురు ఇందిర(జయలలిత). అలా ఇంజినీరింగ్ పూర్తిచెయ్యగనే సాగర్ డేం పనిలో ఉద్యోగం అది కూడా అప్పటికే అక్కడ చీఫ్ ఇంజినీర్ గోపాలరావు దగ్గరే అవడం మంచిదవు తుంది వేణుకి.

భాస్కర్ చేసే కాంట్రాక్ట్ వ్యవహారాలలో చాలా అవకతవకలు ఉండడంతో అతని బిల్ల్స్ పాస్ చెయ్యడానికి అభ్యంతరం చెపుతాడు వేణు. ఇక్కడ శేషు భాస్కర్ కి తెలియకుండా సాగర్ డేం కాంట్రాక్ట్స్ లో నాసిరకపు పనులు చేయిస్తూ డబ్బులు దోచేస్తూ ఉంటాడు.అలా అతని పనులకు సంబంధించిన బిల్ల్స్ నాసిరకపు పనుల కారణాన్ని చూపిస్తూ ఆపివేయడంతో డబ్బులకి ఇబ్బంది ఎదురవుతుంది భాస్కర్ కి.ఆ వ్యవహారంలో వేణు నిక్కచ్చిగా వ్యవహరించడంతో అర్ధాలూ పెడర్ధాలూ అపార్ధాలు లాంటి చిన్న చిన్న ట్విస్ట్ లతో చివరికి శేషు ఆటకట్టించడంతో కధ సుఖాంతం అవుతుంది.

కొన్ని ఆత్రేయ చెణుకులు:

అయినా ఎదటున్నవాడికి ఉత్తరమెందుకు? ఏమి రాసావో చెప్పేస్తే ఎదురుగానే సమాధానం చెప్పేస్తా కదా,

మీ వయసెంతండి పాపం నాలుగేళ్ళే కదా అంటే మరి మీ వయసెంతో అంటే నా వయసెంతండీ రెండే ఎందుకంటే గోదావరి పుష్కరాలకి పుట్టాను అందువల్ల ఇదిగో ఈ యేటికి రెండు నిండాయి,

ఆరోగ్యానికి మంచిది కానిదాంట్లో ఆనందముండదు…ఆ సంగతి అనుభవం మీద కాని తెలియదు కదా.

అందులో ఏమి సుఖం ఉందని ఇలా తాగుతారో అర్ధం కావట్లేదు,ఇంక మళ్ళీ అటుపక్క పోను అంటే

అలా తాగుడికి అలవాటయిన వాళ్ళంతా ఇలా అన్నవాళ్ళే అంటూ,

చెడిపోడానికి డబ్బే కారణమయితే డబ్బులేని వాడు కూడా ఎందుకు చెడిపోతున్నాడు,

మనిషిని డబ్బుతోటే కట్టెయ్యలేము కదా,మనసుతోటీ,మమతతోటీ కట్టేయ్యాలి కానీ…

వెనకటి రోజుల్లో దాహానికి మంచినీళ్ళూ,మజ్జిగా ఇచ్చేవరు,ఇప్పుడు కాఫీ ఇకపైనా విస్కీ బ్రాందీ ఇస్తారు…

ప్రతిదానికీ కొన్ని సాంప్రదాయాలుంటాయి.ఒంటరిగా తాగడం సాంప్రదాయం కాదు.అలా తాగితే ఒంటబట్టదు.

కొన్ని కోట్ల మందికి ద్రోహిని కావడం కన్నా కొంత మందికి కృతఘ్నుణ్ణయినా క్షమిస్తారని చేసాను రాధా..

బహుశా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల బాక్ డ్రాప్ గా తీసినట్లుగా అనిపిస్తుంది దాసరి తీసిన ప్రేమాభిషేకం

ప్రత్యేకించి రాధ తన భర్త భాస్కర్ కోసం విటురాలు రాణి ఇంటికెళ్ళిన సందర్భంలోనూ ఆమెతో జరిగే సంభాషణల్లో (ఈ సన్నివేశాన్ని చూసి ఆ సంభాషణల వరద పరంపరని అనుభవించాల్సిందే. .)

కామెడీ అసలు లేకపోడమే ఈ సినిమాకి పెద్ద లోటు.ఇలాంటి కధలో కామెడీ పాలుండకూడదను కున్నారో ఏమో రచయిత దర్శక నిర్మాతలు.ఒక వేళ అలా అంతగా అవసరమనిపిస్తే రమణారెడ్డి చేత అలవాటుగా అనిపించే వోయ్..వొయ్ అనే ఒక్క ఊత పదమే సరిపోతుందనుకున్నారో(అసలే చిన్న చిన్న ఆనందాలకే సంతృప్తి పడిపోతారు కదా అంధ్రా ప్రేక్షకులు) ఏమో కానీ 3గంటల సినిమాకి అదే పెద్దలోటయి కూర్చుంది ఆఖరికి.

అసలు ఆడది గట్టిగా మాటలాడ్డము,నవ్వడమూ కూడ పెద్ద తప్పూ,అనాగరికంగానూ చూసే రోజుల్లో ఈ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి పూనుకున్న నిర్మాతా దర్శకులు,అలా నటించడానికి (జీవించిందనచ్చేమో) ఒప్పుకున్న నటి సావిత్రి ని తప్పకుండా అభినందిచాల్సిందే .

ఇంక చివరిగా ముఖ్యంగా మన-సు-కవి ఆత్రేయ కలం యధావిధిగా తనదైన బాణీలో ప్రేమని, చలాకితనాన్నీ,అమాయకత్వాన్నీ,బాంధవ్యాన్నీ,ఆదర్శాన్నీ, వ్యసనాన్నీ, విషాదాన్ని,గుండెపోటునీ తన ఇంకుపోటుతో బాగానే స్పృశించింది.

అందువల్ల ఈ సినిమాని సావిత్రి ఆత్రేయ ల గుర్తుగా చూసుకోవచ్చు వారి వారి అభిమానులు తప్పకుండా…

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై 1965 లో వచ్చిన ఈ సినిమాలో

ఏ.ఎన్.ఆర్, జగ్గయ్య, సావిత్రి, జయలలిత, రమణారెడ్డి, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, రాజశ్రీ వగైరా నటవర్గం.

మూల కధ: యద్దనపూడి సులోచనారాణి.

మాటలు:ఆత్రేయ,

పాటలు: దాశరధి,సినారె,కొసరాజు,ఆత్రేయ.

సంగీతం: ఆస్థాన విద్వాంసుడు టి చలపతిరావు.

నేపధ్యగానం: ఘంటసాల,సుశీల,జానకి,జయదేవ్.

నిర్మాత: ఏ.వి. సుబ్బారావు

దర్శకత్వం: కె.ప్రత్యగాత్మ.

పాటలు:

1. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు,జంటగ నీ జతఒకరుంటే అన్నిటికీ మేలన్నారు
2. వెన్నెలలో మల్లియలు,మల్లెలలో ఘుమఘుమలు,ఘుమఘుమలో గుసగుసలు,ఏవేవో కోరికలూ,
3. సిగ్గేస్తుందా సిగ్గేస్తుందా నీకు సిగ్గేస్తుందా మొగ్గలాటి చిన్నది బుగ్గమీద చిటికేస్తే సిగ్గేస్తుందా సిగ్గేస్తుందీ సిగ్గేస్తుందీ నాకు సిగ్గేస్తుందీ చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే సిగ్గేస్తుందీ నాకు సిగ్గేస్తుందీ…
4. నేను తాగలేదు..నాకు నిషాలేదు..నాకు నిషా రాదూఊఊఊ…
5. నువ్వూ..ఎదురుగా ఉన్నావూ బెదిరిపోతున్నావూ…ఎందుకో ఉలకవు పలకవు…
6. నీ కాలికి నేనందినయనై, నీ కన్నులలో కాటుకనై…ఉండిపోనా నీతోనే…నిండీపోనా నీలోనే…
7. కన్ను మూసింది లేదూ..నిన్ను మరిచింది లేదూ..నీ తోడూ..ఓ ప్రియతమా….
8. నిన్ను చూడనీ…నన్ను పాడనీ ఇలా ఉండిపోనీ నిన్ను చూడనీ…

–శ్రీనివాస్ పప్పు

Posted by అతిథి on June 22, 2009 11:24 AM · permalink

ఓ ఫైన్ మార్నింగ్ వర్షం కురుస్తూండగా…మీ ప్రేయసి వచ్చి ..నువ్వే నాలో ప్రేమను మొలకెత్తించావు కాబట్టి నువ్వే నాలో ప్రేమను తీసెయి..అంటే మీరేం చేస్తారు..కంగారుపడి ఓ తింగరి చూపు చూస్తారు..లేదా ఆమెకు మానసికంగా ఏదన్నా సమస్య ఉందేమోనని అర్జెంటుగా డౌట్ తెచ్చేసుకుంటారు. అయితే ఈ రెండూ పనులు చేయక క్యాజువల్ గా ఆమెలో ప్రేమను తీసేయటానికి రెడీ అయ్యే హీరో కథే కరెంట్.మొదట ఇంటర్వెల్ పాయింటు అనుకుని ఆ తర్వాత దానికి పైనా క్రిందా కథ అల్లేసికుని ఆనందపడిపోయి తయారు చేసినట్లుండే కథనంతో తయారైన ఈ చిత్రం రిజెల్టు ఏమౌతుంది?

సుశాంత్‌ (సుశాంత్‌)కి మొదటనుంచీ నిన్నటి గురించి ఆలోచించడం..రేపటి కోసం ఎదురు చూడటంనచ్చదు. అందుకు పూర్తి వ్యతిరేకం స్నేహ (స్నేహా వుల్లాల్‌). ప్రతీది ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోయే ఆమెకు కాలేజీలో సుశాంత్ తగులుతాడు. ఆమెను చూసిన మరుక్షణమే అందరి హీరోల్లాగే ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనుక పడతాడు. ఛీ..పొమ్మన్నా ..నాటకాలు ఆడి మరీ ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూడా మోడ్రన్ గా ఆలోచించి కూతురు ప్రేమను ఏక్సెప్ట్ చేయటానికి రెడీ అయి ఫలానా టైమ్ కి రమ్మని అపాయింట్మెంట్ ఇస్తాడు. కానీ సుశాంత్ ఆ టైమ్ కి రాడు. ఎందుకు రాలేదు అంటే ఆ టైమ్ కి క్రికెట్ ఆడుతూంటాడు. ఇది చూసిన ఆమె నీకు భాద్యత లేదు..నీ ప్రేమ నాకు అక్కర్లేదు అని నిందిస్తుంది. అది విన్న మనవాడు నేను భాద్యత లేనివాడినని నా ప్రేమలో పడేటప్పుడు తెలియదా అని తెలివిగా చెప్పి కూల్ గా ఓకే మనం విడిపోదాం అంటాడు. మనం కంగారుపడి ఏంటిలా జరుగుతోంది..అతను ఆమెని నిజంగా ప్రేమించలేదా ..అని విచిత్రంగా చూస్తుండగానే ఆమె వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నిన్ను మర్చిపోలేకపోతున్నా..నువ్వే నాలో ప్రేమను పుట్టించావు కాబట్టి నువ్వే తీసెయ్యి అంటుంది. ఇదేంటి ఇలాంటి ట్విస్టు అనుకుంటుండగా హీరోగారు సరేనంటారు..అప్పుడు ఏం జరుగుతుంది అంటే తెరపై చూడాల్సిందే.

నువ్వే ప్రేమలో దించావు కాబట్టి నువ్వే దాన్ని తీసెయ్యి అనటం నావెల్టీగా చెప్పుకోవటానికి బావుండి ఉండవచ్చు. అయితే సినిమాకు దాన్ని స్క్రిప్టు గా మార్చేటప్పుడు …హీరో ..ప్రేమను ఆమె నుంచి తొలిగించే సన్నివేశాలు అద్బుతంగా ఉండేటట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. అలా కాకుండా సుశాంత్ తాతగారు నాగేశ్వర రావు కాలంనాటి ప్రేమాభిషేకం సన్నివేశాలు (త్రాగటం,వ్యభిచారిణి దగ్గరకెళ్లటం)రిపీట్ అయితే ఫలితమేముంటుంది.అయినా అక్కడ హీరో చచ్చిపోతాడు కాబట్టి ప్రేమను త్యాగం చేయటానికి హీరోయిన్ శ్రీదేవి మనస్సులోంచి ఆమెను తీసెయ్యటానికి ఈ డ్రామా ఆడి సానుభూతి సంపాదించి శభాష్ అనిపించుకుంటాడు. అదే ఇక్కడ మిస్సయింది. సానుభూతి మొత్తం మొదట హీరోయిన్ మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది (ఆ తరువాత మన మీద మనకే కలుగుతుందనుకోండి అది వేరే సంగతి). అలా కాకుండా ఆమెలో ప్రేమను తొలిగించే క్రమంలో హీరో నిజమైన ప్రేమ కనుగొంటే ఇంకా బావుండేది.

ఇక ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం పస్టాఫ్ మొత్తం విషయం లేకుండా నడపాల్సి రావటం మరో దురదృష్టం. దాంతో ప్రక్క క్యారెక్టర్ల సోది ఎక్కువయి ..బోర్ మొదలయ్యింది.కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. బ్రహ్మానందం ఉన్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దర్శకత్వ పరంగా కూడా కొత్త దర్శకుడి నుంచి ఆశించే మెరుపులు ఏమీ కనపడలేదు. అయితే నిర్మాతలను మాత్రం బాగా మెచ్చుకోవాలి. దేవీశ్రీప్రసాద్ వంటి సంగీత దర్సకుడుని తెచ్చి మరీ బాగానే ఖర్చుపెట్టారు. ఇక దేవీ సంగీతం ఎప్పటిలాగే బావుంది. అదే ఈ సినిమాకి ఉన్నంతలో ప్లస్. నటుడుగా సుశాంత్ మొదటి సినిమా కన్నా బెటర్. స్నేహ ఉల్లాల్ లావెక్కింది కానీ నటనలో మాత్రం ఎప్పటిలాగే ఉంది. హీరో తండ్రిగా తణికెళ్ళ,తల్లిగా సుధ అవే పాత్రలను మళ్ళీ బాగా చేసారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండేది. కెమెరా..దర్శకుడి టేస్ట్ కి తగ్గట్లే ఉంది.డైలాగులు కూడా చాలా వీక్ గా ఉన్నాయి. అక్కడక్కడా తప్ప పేలలేదు. వెన్నెల ఫేమ్ కిషోర్ కామెడీ బాగానే చేసాడు..కానీ ఆల్రెడీ ఆ ట్రాక్ చాలా సినిమాల్లో వచ్చిందే కాబట్టి పెద్దగా పంచ్ ఇవ్వలేదు.

‘కాళిదాసు’కెళ్ళాం ఖర్చయిపోయాం..ఈ రెండో సినిమా ‘కరెంటు’కైనా కరుణిస్తాడా అంటే ..అంత లక్ మీకు లేదు అని తేల్చేసాడు సుశాంత్. తన కజిన్ సుమంత్ లాగే సుశాంత్ కీ మంచి కథలు కొరతలాగుంది. అయినా ఇంటర్వెల్ పాయింటుని అనుకుని పైకీ,క్రిందకి కథ అల్లుకుంటే ఇలాంటి నెగిటివ్ ఫలితాలే వస్తాయనేది సుస్పష్టం.అలాగే డాన్స్ లు బాగానే చేసినా చాలా సన్నివేశాల్లో హీరో సుశాంత్ లో ఫేస్ ఫీలింగ్స్ పెద్ధగా పలకక పోవటం మరో ఇబ్బంది. ఇలా కథ,కథనాలు వీకైన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసినా ఏ వర్గాన్నీ ఆకర్షించేటట్లు కనపడటం లేదు.

ఏదైమైనా కథ,కథనాలు బావుంటే మిగతా డిపార్ట్ మెంట్లు ఎలా పనిచేసినా కొట్టుకుపోతుందనేది నిజం. అలాగే మంచి ప్రొడక్షన్ విలవులు ఉంటే సరిపోవు..అంతకు తగ్గ విజన్ కూడా ఉండాలని ఈ చిత్రం నిరూపిస్తుంది. సుశాంత్ నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. స్నేహ ఉల్లాల్ తెలుగులో నిలదొక్కాలంటే ..ఈ పోటీలో ఈ నటన చాలదు. దర్శకుడు నెక్ట్స్ సినిమా దొరికినా స్క్రిప్టు మీద కుస్తీ పట్టకపోతే నిలబడటం కష్టం. ఇక ప్రేక్షకులుకు ఈ కరెంట్ జోలికి వెళితే షాక్ కొట్టిన ఫీలింగ్ కలిగే అవకాశం ఉంది.

సంస్థ: శ్రీనాగ్‌ కార్పొరేషన్‌
నటీనటులు: సుశాంత్‌, స్నేహావుల్లాల్‌, చరణ్‌రాజ్‌, తనికెళ్ల భరణి, సుధ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌,షఫీ,రఘుబాబు తదితరులు.
కెమెరా : విజయ్ .సి.కుమార్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఫైట్స్ :కనల్ కన్నన్
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్‌
నిర్మాత: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
దర్శకత్వం: సూర్యప్రతాప్‌
విడుదల: 19,జూన్ 2009

Posted by జోస్యుల సూర్యప్రకాశ్ on June 20, 2009 01:22 AM · permalink

సినిమా రంగం అంటే లక్ష్మీదేవి ’కోటి’రూపా(యి)లతో తాండవ నృత్యం చేసే చోటు. నిన్న మొన్నటి వరకు ఆ రంగం పై మోజుతోనో, అక్కడ లభించే పేరు ప్రఖ్యాతులపై ఆశతోనో ఇల్లు, వాకిళ్లు వదిలి రైలెక్కేవారు, లేకుంటే తమ ప్రతిభ చూపుదామని ఆశించేవారే తప్ప, అదో వృత్తిగా ప్రవృత్తిగా భావించిన వారు అరుదు. ముఖ్యంగా కాస్త చదువుకున్నవారు వేరే దారి లేకపోతే తప్ప అందులో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ. ఎన్.టి.రామారావు బి.ఎ అనో, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అనో ఒకటో రెండో పేర్లు కనిపించేవి. ఇప్పుడు రోజులు మారాయి. ఇంజనీర్లు, కంప్యూటర్ మేధావులు, ఫారిన్ రిటర్న్డ్ లు సినిమా రంగాన్ని తమ ’గమ్యం’ గా ఎంచుకుంటున్నారు. డైరెక్టర్లు…అసిస్టెంట్లు…నటులు, సాంకేతిక నిపుణులు…అందరూ పెద్దపెద్ద చదువులు చదివిన వారే. ఇప్పుడు తెలుగు సినిమాకు లక్ష్మీ కటాక్షంతో పాటు సరస్వతీ కటాక్షం కూడా.

పాత తెలుగు సినిమాలలో ఈస్టమన్ కలర్ సినిమా టైటిల్స్ లో ’ఎన్.ఎన్.టి.రామారావు బి.ఎ,’ అని ’కె.రాఘవేంద్ర రావు బి.ఎ’ అని పేరుకి చివరన ఆ మహానుభావులు చదివిన డిగ్రీలను వేసుకోవడం కనిపించేది. అప్పట్లో బి.ఎ, చదువుకు ఉన్న పాత్ర, ప్రాముఖ్యత అంత గొప్పది. అత్యల్ప అక్షరాస్యతా శాతం ఉన్న కాలంలో వారు అత్యున్నత విద్యావంతులు అనే విషయాన్ని తేట తెల్లం చేయడం దీని ఉద్దేశం.

ఇప్పుడు కూడా తెర వెనుక కృషి చేసిన నిర్మాతలు, దర్శకులు, రచయితల పేర్ల టైటిల్స్ పడుతున్నాయి కానీ, వారి ఏడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనిపించడం లేదు. సినిమా రంగం అనగానే చాలామంది మదిలో నాటుకున్న అంశం ఏమిటంటే సినిమా మీది వ్యామోహం కొద్దీ ఇంట్లోంచి పారిపోయి వచ్చిన వాళ్ళే ఎక్కువమంది ఉంటారు అనేదే. చదువుకు నామం పెట్టిన వాళ్ళో, చదువును మధ్యలో వదిలేసిన వాళ్ళో ఉంటారనే అభిప్రాయం కూడా ఉంది. మరో విధంగా చెప్పలంటే సినిమా రంగానికి ’లక్ష్మీ కళ’ నే తప్ప ’సరస్వతీ కటాక్షం’ తక్కువ అనే అభిప్రాయం కూడా ఉంది.

కానీ, గత ఆరేడేళ్ళ కాలం నుండి తెలుగు తెరపై అధ్బుతాలు సృష్టిస్తున్న నవతరం కథకులు, రచయితలు, దర్శకులు, సంగీతకారులకు సంబంధించిన ప్రొఫైల్స్ ను, వారి బ్యాక్ గ్రౌండ్ ను గమనిస్తే అశ్చర్యపోకుండా ఉండలేం…సినిమా కళలో వారికున్న పట్టును, ప్రావీణ్యాన్ని చూసి ఎంత అభినందిస్తున్నామో, వారి ’అకడమిక్ క్వాలిఫికేషన్స్’ ని గమనిస్తే అంతే ఆశ్చర్యపోతాం. సమకాలీన తెలుగు సినిమాని లాలిస్తూ, పాలిస్తూ, శాసిస్తూ, శోధిస్తున్న ఈ new-gen సాంకేతిక నిపుణులు సినిమా ’ఈస్థటిక్స్’ ని ఎక్స్పీరీయన్స్ తోనే కాదు, ’ఏడ్యుకేషన్’ తో కూడా ఔపాసన పట్టిన వారని అర్థమవుతుంది. అంటే వీరంతా ’సరస్వతీ పుత్రులే’ అని కూడా తేటతెల్లమవుతుంది. అలాగే, తెలుగు సినిమాలో వారసులకో, స్టార్ బంధువులకో, బావమరుదులకో, తమకున్న ’స్టార్ కనెక్షన్’, ’పరిచయాల’ వల్ల మాత్రమే ఎంట్రీ దొరుకుతుందని….’లక్ష్మీ కళ’ తో మాత్రమే సినీ రంగ ప్రవేశం సాధ్యమనే అభిప్రాయం స్థానంలో. ఈ యంగ్ బ్రిగేడ్ ఇప్పుడు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులు, అమెరికా రిటర్న్డ్ ఉన్నతోద్యోగులతో ఇప్పుడు తెలుగు సినిమా సుసంపన్నం అవుతోంది. తెలుగు సినిమా ఇప్పుడు సరస్వతీ కటాక్షంతో అలవారుతోంది.

దర్శకులతో మొదలు

’డైరెక్టర్ ఈజ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అని అంటారు. సినిమాకు దశను, దిశను నిర్దేశించే అత్యున్నత సృజనాత్మక ప్రతిభాశాలి దర్శకుడు. తెలుగు సినీ రంగంలోకి ఇటీవల దూసుకువచ్చిన నవతరం దర్శకుల బ్యాక్ గ్రౌండ్ లోకి వెళితే, వారి కెరీర్ లోకి ఒక్కసారి దృష్టి సారిస్తే వారు చదివిన చదువులు, వారు చూసిన ప్రపంచం, వారికి ఉన్న విస్తృత అవగాహనకు మనం అభినందనలు చెప్పకుండా ఉండలేం. తెరమీద వారు ప్రదర్శిస్తున్న సృజనాత్మక ప్రతిభకి మూలాలు వారు చదివిన చదువుల్లో ఉన్నాయని తెలుసుకున్న తర్వాత వారి మీద మన అభిమానం, గౌరవం మరింత పెరగకమానదు. తెలుగు సినీ సీమలో రాం గోపాల్ వర్మ తో మొదలైన ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు విస్తృతమయింది.

తెలుగు సినిమాకు గొప్ప టర్నింగ్ పాయింట్ – రాం గోపాల్ వర్మ! ఆయన తీసిన ’శివ’,’క్షణ క్షణం’, ’గాయం’ ప్రతీదీ సంచలనమే. సినీ రంగంలోని వారసులకు, బమ్ధువులకు తప్ప కొత్త వారికి దుర్భేధ్యంగా ఉన్న కంచుకోటలాంటి సినిమా రంగంలోకి ’కొత్తగాలుల్ని’ ప్రసరింపచేసిన దార్శనికుడు ఆయన. ఇప్పటి తెలుగు సినిమా దర్శకులందరికీ ఆది గురువు అన్నా ఆశ్చర్యం లేదు. అలాంటి రాం గోపాల్ వర్మ ఇంజనీరింగ్ పట్టభద్రుడు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో ఆయన చదువుకున్నారు. ఆయన తొలి చిత్రం ’శివ’ కి ఆయన కాలేజీ అనుభవాలే ప్రేరణ అని ఆయన చెప్పారు.

ఇక, ఈ తరంలో ఇప్పుడు ఎంతో మందికి రోల్ మోడల్ గా, సక్సెస్ ఐకాన్ గా ఉన్న దర్శకుడు శేఖర్ కమ్ముల! రొటీన్ ఫార్ములాలో వెళ్తున్న తెలుగు సినిమాకు మంచి కాఫీలాంటి ’ఆనంద్’ ని వేసవిని చల్లగా ఉంచే ’గోదావరి’ ని అందించిన న్యూ ఏజ్ డైరెక్టర్ శేఖర్.

సినిమా చూడటాన్ని ’హ్యాపీడేస్’ అనే ఆనందకరమైన అనుభూతిగా మలిచిన సునిశిత దర్శకుడు.ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్. హైదరాబాదులోని ’చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ విద్యార్ధి. డిగ్రీ తర్వాత ఆయన అమెరికాలోని న్యూ జెర్సీ లో కంప్యూటర్స్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. అలాగే తన అభిరుచికి దగ్గరగా ’మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ కోర్సును వాషింగ్టన్ లోని ప్రఖ్యాత హోవార్డ్ యీనివర్శిటీ లో అభ్యసించారు. ’హ్యాపీడేస్’ లోని ఎన్నో సంఘటనలకు తన కాలేజీ లైఫే స్ఫూర్తి అని చెప్పడం ఇక్కడ గమనార్హం.

చలం రాసిన ’దోషగుణం’ కథని ’గ్రహణం’ సినిమాగా తెరకెక్కించి తెలుగు సినిమాకు కొత్త ఊపిరులు ఊదిన నవతరం దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి! గత సంవత్సరం ’అష్టా చెమ్మా’ తో ఓ కొత్త తరహా సక్సెస్ ను చవిచూపించారు. తెలుగు సినిమాను నవ్య పోకడలు పోనిస్తున్న ఈ దర్శకుడు ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్! ఆయన ఆంగ్ల సాహిత్యం, ఫిలాసఫీలలో మాస్టర్ డిగ్రీ హోల్డర్! అంతే గాక, టొరంటోలోని యార్క్ యూనివర్శిటిలో ’ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ప్రత్యేక సబ్జెక్ట్ గా ’మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ విద్యను చదువుకున్నారు. ’కమ్యూనికేషన్ అండ్ కల్చర్’ విభాగంలో డాక్టరేట్ పరిశోధనను మొదలెట్టిన విద్యాసంపన్నుడు ఆయన.

తెలుగు సినిమా డైలాగులకు ’ఇంటలెక్చువల్ పంచ్’ ల హాస్యాన్ని, కథకు లాజికల్ అద్భుతాన్ని, దర్శకత్వానికి నవ్యతని అద్దిన మరో న్యూజెన్ బహుముఖ ప్రజ్ఞాశాలి – త్రివిక్రమ్ శ్రీనివాస్! ఆయన డైలాగులు రాసిన ’చిరునవ్వుతో’, ’స్వయంవరం’, ’నువ్వు నాకు నచ్చావ్’, ’మల్లీశ్వరి’ సినిమాలు ఎంత హిట్టో, ఆయన దర్శకత్వం వహించిన ;అతడు’, ’జల్సా’ సినిమాలు కూడా అంతే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆయన యూనివర్శిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చదివారు. అంతే కాదు, ఆయన సబ్జెక్ట్ లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆయన భీమవరంలోని హోలీ ఏంజెల్స్ కాలేజీలో కొంత కాలం లెక్చరర్ గా పనిచేశాడు.

అలాగే ’లిటిల్ సోల్జర్స్’ సినిమాతో రంగప్రవేశం చేసి ’ఐతే’ వంటి నవ్య సినిమాలని అందించిన గంగరాజు గుణ్ణం కూడా అత్యున్నత విద్యావంతుడే. ఎన్నెన్నో కష్టాల మధ్య విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజిలో బి.ఏ ను, ఆ తర్వాత ఇంగ్లీష్ లిటరేచర్ లో ఎం.ఏ ను చదివిన ఆయన స్టేట్ బ్యాంక్ ఉద్యోగిగా కొంత కాలం పని చేశారు.

నూరు చిత్రాలకు పైగా కథ, మాటలను అందించి, ’శ్రావణ మాసం’ సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా మారి ’ఆపరేషన్ దుర్యోధన’ వంటి సంచలన రాజీయ చిత్రాన్ని నిర్మించిన దర్శకుడు పోసాని కష్ణమురళి. ’పోలీస్ బ్రదర్స్’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ప్రస్తుతం ’రాజావారి చేపల చెరువు’ అనే పొలిటికల్ సెటైర్ ని నిర్మించారు. ఆయన బి.కాం, బి.ఏ, ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన అత్యున్నత విద్యావంతుడే.

యంగ్ హీరో అల్లు అర్జున్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ’ఆర్య’! ఆ సినిమాను రూపొందించిన దర్శకుడు సుకుమార్. ’జగడం’ వంటి వెరైటీ సినిమాను తీసిన ఆయన ప్రస్తుతం ’ఆర్య-2′ పేరుతో ఒక సీక్వెల్ సినిమాని తీస్తున్నారు. ఆయన కూడా ఎమ్మేస్సీ (మ్యాథమేటిక్స్) పోస్ట్ గ్రాడ్యుయేట్! సినిమాల్లోకి రాకముందు ఆయన కొంతకాలం కాకినాడ ఆదిత్య ట్యుటోరియల్స్ లో లెక్చరర్ గా పనిచేశారు.

అలాగే ఆ మధ్య ’కుబుసం’ వంటి సామాజిక చైతన్య సినిమా చేసిన దర్శకుడు శ్రీనాథ్ డాక్టరేట్ పట్టా పొందిన అత్యున్నత విద్యావంతుడు. ’పల్లే కన్నీరు పెడుతుందో’ అనే గోరేటి వెంకన్న పాటను ఎంతో ప్రతిభావంతంగా చిత్రీకరించిన ఆయన సినిమాలలో ఆయన అధ్యయనం చేసిన సాహిత్య ప్రభావం కనిపిస్తుంది.

ఈ మధ్య ’కొత్త బంగారు లోకం’ తో అందమైన యువ ప్రేమ కథని తెలుగు తెరకి అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఎం.టెక్ చదివిన అత్యున్నత విద్యావంతుడే. అలాగే, ’కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాని రూపొందించిన దర్శకుడు కిశోర్ కుమార్ కూడా డిగ్రీ తో పాటు ’లా’ చదువును కూడా పూర్తి చేశారు. ఆయన విజయనగరం మహారాజా కాలేజీలో చదువుకున్నారు.

’కంత్రీ’ ఇప్పుడు ’బిల్లా’ సినిమాలతో భారీ తనానికి కేరాఫ్ గా నిలిచిన దర్శకుడు మెహర్ రమేశ్, సివిల్ ఇంజనీరిమ్గ్ లో డిప్లొమా హోల్డర్. ఇక ’అంకిత్ పల్లవి అండ్ ఫ్రెండ్స్; సినిమాతో పరిచయం అయిన హరి యెల్లేటి అమెరికాలో ఎమ్మెస్ మాత్రమే కాక, పి హెచ్ డి కూడా పూర్తి చేసిన హార్డ్ వేర్ ఇంజనీర్.

’చుక్కల్లో చంద్రుడు’ సినిమాతో పరిచయమై ’శౌర్యం’ తో హిట్ సాధించిన దర్శకుడు శివకుమార్. ఈయన బిట్స్, పిలానీ లో ఇంజనీరింగ్, అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్శిటీ నుండి ఎమ్మెస్ (మాస్ కమ్యూనికేషన్) డిగ్రీ ని సాధించిన ఉన్నత విద్యావంతుడు. ఆయన ప్రస్తుతం గోపిచంద్-త్రిషా జంటగా కొత్త సినిమాను తీస్తున్నారు. అలాగే ’బ్లాక్ అండ్ వైట్’ అనే థ్రిల్లర్ సినిమా దర్శకుడు శ్రీకాంత్ వేములపల్లి కూడా ఎం.టెక్, సివిల్ ఇంజనీరింగ్ చదువును పూర్తిచేసి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా పనిచేసిన వారే!

వీరే కాకుండా సమకాలీన తెలుగు సినిమాకు దిశానిర్దేశం చేస్తున్న జాగర్లమూడి రాధాకృష్ణ (గమ్యం) …’బొమ్మలాట’ వంటి ప్రయోగాత్మక చిత్ర దర్శకుడు కె.సూర్యప్రకాశ్ రావు, ’అల్లరి’ రవిబాబు వంటి న్యూవేవ్ దర్శకులందరూ అత్యున్నత చదువులు చదివిన వారే! ’స్నేహ గీతం’ తో దర్శకుడిగా పరిచయం అవుతున్న మధుర శ్రీధర్ రెడ్డి కూడా ఈ కోవలోకి చెందినవాడే.

-ఇంకావుంది

ఈ వ్యాసం మొదట ఆంధ్రభూమిలో ప్రచురితం

Posted by మామిడి హరికృష్ణ on June 19, 2009 06:30 PM · permalink

1980వ దశకంలో భారతీయ సినిమారంగంలో వెలుగు చూసిన మంచి చిత్రాల్లొ కేతన్ మెహతా నిర్మించిన “మిర్చ్ మసాలా” ఒకటి. సత్యజిత్‌రే “ఘరే బైరే”. ఆదూర్ గోపాలకృష్ణన్ “ముఖాముఖం”, అరవిందన్ “చిదంబరం” లాంటి గొప్ప చిత్రాల సరసన నిలిచే చిత్రం “మిర్చ్ మసాలా”. సమాజంలోని వాస్తవికతను ఆవిష్కరించే దిశలో ప్రేక్షకుల్ని తన వెంట లాక్కెళ్తుందీ చిత్రం. గొప్ప భావావేశంతో ఆద్యంతం చూపరుల్ని కట్టిపడేస్తుంది.

“మిర్చ్ మసాలా” చిత్రంలో ఉపయోగించిన మిర్చి రంగు గొప్ప ఉద్వేగభరితమయిన భావాల్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఈ చిత్రంలో ఎరువుతో సహా ఉపయొగించే రంగులన్నీ మన జానపద కళారూపాల్ని తలపింప చేస్తాయి. పాశ్చాత్య దేశాల ప్రజల అభీష్టాలకు భిన్నంగా ఉండే మన భారతీయుల రంగుల ప్రపంచాన్ని ఈ చిత్రం పిండి ఆరబోస్తుంది. మిర్చ్ మసాలా చిత్రానికి ఆయువుపట్టులా దర్శకుడు ఉపయోగించిన ఎరుపు అణచివేతకు, తిరుగుబాటుకు ప్రతిబింబంగా భాసిల్లుతుంది.

నిజానికి “మిర్చ్ మసాలా” చిత్రం మన సమాజంలో అణచివేతకు గురైన వాళ్లలోకెళ్లా అణచివేయబడ్డ ‘స్త్రీ’ లను ముఖ్యాభినేతలుగా చేసి నిర్మించబడింది. అయితే స్త్రీలను టైప్స్ గా కాకుండా, మాడల్స్ గా కాకుండా సజీవమయిన పాత్రలుగా మలచడంలో దర్శకుడు తన ప్రతిభను చూపించారు. సామాజిక మార్పునకు ఉత్ప్రేరకాలుగా నిలిచే స్త్రీ పాత్రలతో ఈ చిత్రం నిర్మితమయింది.

ఇందులో కేవలం రంగులే కాదు సంగీతాన్ని కూడా విలక్షణంగా వినియోగించారు. ఆ సంగీతం మూడు స్థాయిల్లో వినిపిస్తుంది. ఒక స్థాయిలో 1930-40 ల కాలంనాటి పాపులర్ సంగీతాన్ని , మరో స్థాయిలో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన జానపద సంగీత బాణిలో స్వరపరచిన జానపద పాటలు ఆకట్టుకుంటాయి. మూడో స్థాయిలో సినిమాకు నేపధ్యంగా విస్తృతంగా వినియోగించిన ధ్వని సంగీతంగా రూపాంతరం చెందిన స్థితి మొత్తం చిత్రానికి నిండుదనాన్ని తెచ్చింది.

చిత్ర కథాంశానికి వస్తే ఓ మారుమూల గ్రామంలో సుబేదారు క్యాంపు వేసి ఉంటాడు. ఆ ఊర్లో అందంగానూ, వయ్యారంగానూ ఉండే సోనాభాయీపై అతను కన్నేస్తాడు. చివరకు జులుం చేయడానికి కూడా సిద్ధపడతాడు. కాని అమె అందుకంగీకరించదు. ఆమె పారిపోయి ఆ ఊర్లో ఉన్న మిర్చి గోడవున్‌లో తల దాచుకుంటుంది. ఆమెతో పాటు మరికొంత మంది ఆ గోడవున్‌లో ఉంటారు. ఆ గోడవున్ గార్డు అబూమియా వారికి రక్షకుడిగా నిలుచుంటాడు. గోడవున్ గేట్ మూసేసి ఎలాంటి పరిస్థితిలోనూ తెరిచేది లేదంటాడు. సుబేదారు ఆ ఊరివారికి అల్టిమేటం జారి చేస్తాడు. సోనాబాయిని అప్పగించండి లేదా ఊరిని తగుల బెడతానంటాడు. గ్రమస్థులంతా భయంతో సోనాబాయిని లొంగిపొమ్మంటారు. కాని సోనాబాయి, అబూమియా ఇద్దరూ ఎదురు తిరుగుతారు. ఆ గొడవలో అబూమియా చనిపోతాడు. సోనాబాయి ఇతర స్త్రీలతో కలిసి సుబేదారు, అతని మనుషులపైన మిర్చితో దాడి చేస్తుంది. వాళ్లంతా వెనుదిరుగుతారు. సోనాబాయి సుబేదారుపై విజయం సాధిస్తుంది. చిత్రంలో ఇది ప్రధాన కథ కాగా దానికి సమాంతరంగా మరిన్ని కథలు నడుస్తాయి. అందులొ ఒకటి ఆ ఊరి ముఖియా భార్య కథ. ముఖియా అందరు గ్రామ పెద్దల్లాగే మరో స్త్రీతో సంబంధం కలిగి ఉంటాడు. అతని వైవాహికేతర సంబంధాన్ని ఆయన భార్య వ్యతిరేకిస్తుంది. కాని శారీరకంగానూ, వ్యక్తిత్వపరంగానూ అంత బలవంతురాలు కాని ఆమె ఎదురు తిరగలేకపోతుంది. తమ కూతురికి విద్యాబుద్ధులు నేర్పి గొప్పదాన్ని చేయాలనుకుంటుంది. ఆమె తన భర్తను ఎంత వ్యతిరేకించినప్పటికీ బయటపడదు.

మరోవైపు ఆ ఊరి ఉపాధ్యాయుడు దేశ స్వాతంత్ర్యం గురించి గ్రామస్థుల్ని చైతన్య పరచాలనుకుంటాడు. కాని సుబేదారుకు వ్యతిరేకంగా ప్రజల్ని సమాయత్తం చేయడంలో విఫలం చెందుతాడు. ఇంకోవైపు ముఖియా తమ్ముడు ఆ ఊళ్లో ఒక యువతిని ప్రేమిస్తాడు. కాని ఆమెను పెళ్ళాడటానికి అంతస్థులు, జాతి భేదాలు అడ్డం వస్తాయి. ఆ యువతి రాధ తండ్రి తీవ్ర మనస్థాపానికి గురై ఆమెను విపరీతంగా కొడతాడు. ఇన్ని పొరలుగా సాగే “మిర్చ్ మసాలా” కథలో సోనాబాయి, సుబేదారుల మధ్య చెలరేగిన ఘర్షణ ప్రధానాంశం. ఆకర్షణీయంగా ఉన్న సోనాబాయిని తన అధికార దర్పంతో సొంతం చేసుకోవాలనే సుబేదారు ప్రయత్నాల్ని ఆమె తన సహచర స్త్రీలతో కలిసి అబూమియా అండతో ఎదురుతిరగడమే చిత్రంలో మౌళిక అంశం. దాన్ని దర్శకుడు కేతన్ మెహతా గొప్ప ప్రతిభతో నడిపిస్తాడు. ఆ నడకలో దర్శకుడు కూర్చిన సన్నివేశాల్లో భావుకతకు తోడు సామాజిక నిబద్ధత కూడా కనిపిస్తుంది.

మిర్చి గోడవున్‌లో తలదాచుకున్న సోనాబాయి ఇతర మహిళలు సమిష్టిగా కాలం గడిపిన తీరు విశిష్టంగా ఉంటుంది. పనిచేస్తూ, పాటలు పాడుతూ, ఒకరితో ఒకరు సరదాగా పోట్లాడుకుంటూ, గేలి చేసుకుంటూ గడిపిన వైనం వారి సమిష్టి తత్వాన్ని సూచిస్తుంది. చివరికి ప్రసవ వేదనకు గురైన ఓ స్త్రీకి సహకరించడం వారి సామూహికతకు సాధికారిక దర్పణంలా నిలుస్తుంది. వారంతా కలిసి పాడుకున్న పాటల్లొ రస్టిక్ రియాలిటీస్‌తో కూడిన జానపద బాణీలు వినిపిస్తాయి. మరోవైపు సుబేదార్ తన క్యాంపులో కూర్చుని గ్రామఫోన్ లోంచి రొమాంటిక్ గీతాలు వింటూ ఉంటాడు. అతడు ఆ రోజుల్లో కోకిలగా పేరుగాంచిన కజ్జన్‌బాయి పాడిన పాటల్ని వింటూఉంటాడు. ఇలా దర్శకుడు గ్రామీణ మహిళలతో జాంపదాల్ని సుబేదార్ క్యాంపులో ఆధునిక ప్రేమ గీతాల్ని వినిపించి ఆ రెండు వర్గాల మధ్య తేడాని చెప్పకనే చెప్తాడు. పైగా సుబేదార్‌తో ఒకసారి ఇలా అనిపిస్తాడు. “అవాజ్ భీ అబ్ సర్కార్ కి గులాం హై”

మొత్తం మీద “మిర్చ్ మసాలా” అట్టడుగు వర్గానికి చెందిన ఒక స్త్రీకి, ఆమెను మోహించిన అధికారి సుబేదార్‌కి నడుమ సంఘర్షణని అందులో ఆ స్త్రీ తమ సమిష్టిబలంతో ఎదురు తిరిగి అధికారంపైనా, ఆధిపత్యంపైనా విజయం సాధించడాన్ని సూచిస్తుంది.

ఈ చిత్రంలో అందంగానూ, వయ్యారం వొలకబోస్తూనూ మరోపక్క తన వ్యక్తిత్వాన్ని కాపడుకుంటూ ఎదురుతిరిగే సోనాబాయి పాత్రలో స్మితాపాటిల్ అద్వితీయ ప్రతిభ కనబర్చారు. నసీరుద్ధిన్ షా మీసాలు మెలేస్తూ సుబేదార్ పాత్రలో అధికారం వొలకబోస్తూ ఒకవైపు, సంగీతాన్ని ఇష్టపడేవాడిగా, మరోవైపు భిన్న భావాల్ని గొప్పగా ప్రదర్శించారు. వ్యక్తిగత నిబద్ధత గల గార్డు పాత్రలో ఓంపూరి సజీవ నటనని అందించారు. దీప్తీనావల్, సురేశ్ ఓబెరాయ్ తదితరులు ప్రధాన భూమికల్ని పోషించారు. కేతన్ మెహతాకిది మూడవ చిత్రం. అంతకుముందు ఆయన “భవాని భవై”, “హోలీ” చిత్రాల్ని నిర్మించాడు. మిర్చ్ మసాలా జాతీయ స్థాయిలో మూడు అవార్డులు అందుకోవడంతో పాటు మాస్కో, హవాయి తదితర అంతర్జాతీయ ఫెస్టివల్స్ లో పాల్గొని ప్రశంసలు అందుకుంది.

మిర్చి మసాలా (హిందీ)

సినిమాటోగ్రఫీ – జహంగీర్ చౌదరి

సంగీతం – రజత్ డౌలకియా

దర్శకత్వం – కేతన్ మెహతా

నటీనటులు – స్మితాపాటిల్, నసీరుద్ధిన్ షా, ఓంపురి మొ..

Posted by వారాల ఆనంద్ on June 18, 2009 06:30 PM · permalink

సొంత ఇంటి దొంగలెవరో, ద్రొహులెవరో చాల చక్కగా  చూపిన నిర్మాత దర్శకుడు ఆనంద్ పట్వర్థన్. సెన్సారింగ్ మరియు దూరదర్శన్ లో ప్రసారం విషయం లో కొన్ని సంవత్సరాలు అప్పటి ప్రభుత్వపు నిరంకుశ నిషేదాజ్ఞలకు బలయి కొన్ని సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి చివరకు గెలిచినది బహూశా ఈయనే మొదటి వాడయి వుంటారు.

ఏన్నొ నదులు, ఉపనదులు.మూడుకాలాల్లో పండే అన్ని రకాల పంటలు, అవసరమొస్తే మొత్తం ప్రపంచపు ఆకలి తీర్చగల సత్తా ఉన్నా సస్యశ్యామల అన్నపూర్ణ అయిన మనదేశపు రాజకీయ వాతావరణం ఇలా ఎందుకు మారిపొయి అసలు సమస్యలు మరిచేలా ఉగ్రవాదం మతతత్వం ఎలా ఎందుకు ఎవరి చేత ప్రబలుతుందో దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్న అసలైన వారెవరో భారతీయ వర్తమాన సమాజం అసలు రంగుని ప్రపంచానికి కళ్ళకు కట్టినట్లుగా ఏంతో కష్టపడి ఎంతోమంది రాజకీయ గూండాల ఎన్నో బెదిరింపులకు ఎటువంటి భయాలకు లొంగకుండా తను అనుకున్నది సాధించారు. వాస్తవాలను సర్వ ప్రపంచం ముందుంచారు.

చంద్రయాన్ తో ఒక వైపు మన భారతదేశం వైజ్ఞానికంగా చిన్న చిన్నగా అడుగులు వేస్తుంటే దానికి పూర్తి విరుద్ధంగా అజ్ఞాన మూఢ విశ్వాసాలు, కుల మతతత్వాలతో లోనుంచి ఎలా తయారవుతున్నదో…మీరు నిజంగా…వాస్తవ దేశాన్ని చూడాలి అని అనుకుంటే…తప్పక చూడండి.

నిజంగా…ఇదిగో ఇలాంటి వారు,ఇలాంటి ఆలోచనలున్న వారు ఈ రోజు మన దేశ రాజకీయాలలో ప్రింట్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో టీచింగ్ ప్రొఫెషన్ లొ పొలీసులో ఉంటే ఈదేశం చాలా చక్కగ ఉంటుందనిపిస్తుంది.

ఏదో ఒక పక్షానికి లొంగకుండా వాస్తవాలను దృశ్యీకరించి మొత్తానికి అసలు రంగు ని ప్రపంచానికి చూపిన అరుదైన అద్భుత గుండె బలం ఉన్న దర్శకుడు,మానవతావాది ఆనంద్ పట్వర్ఢన్.

ఎటూ కాని సమయంలో ఒకట్రెండు సార్లు ఈయన డాక్యుమెంటరీ చిత్రాలను దూరదర్శన్ ప్రసారం చేసి, ప్రసారం చేసినం అని అనిపించుకుంది. ఆయన డాక్యుమెంటరీలను చూసాక ఎంతో మంది ఆలోచనలు మారిపొయినవి అనడంలో ఆశ్చర్యం లేదు.

ఆయన గురించి, ఆయన జీవితం, ఆయన డాక్యుమెంటరీల గురించి చాల చెప్పాలనిరాయాలని ఉంది. కాని మొదట మీరు www.patwardhan.com సైట్ ని చూడండి. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆయన డాక్యుమెంటరీలను చూడండి. చూసిన తరువాత లేక కనీసం ఆయన సైట్ ని చూసిన తరువాత మనసు కి అనిపిస్తే…కాస్త మీ స్పందనలను ఆయనకు మెయిల్ చేయ్యండి.

దేశం మీదున్న ఆయన ప్రేమకు ఆయన పడిన కస్టానికి కాస్త సంతోషమేస్తుంది. ఎందుకంటే వాస్తవాలని రాసే, వాస్తవాలని ప్రచురించే, వాస్తవాలని ప్రసారం చేసే, “గట్స్” లేని సోకాల్డ్ ఒక వర్గపు భారతీయ ఉన్నత మేధావి వర్గానికి చెందిన ఎడిటర్లు కొంతమంది చానల్ ల అధిపతులు
ఆయన గురించి అంతగ రాయలేదు. ఈ అసమాన చలనచిత్రకారున్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేయ్యలేదు. అతని చిత్రాలను చూపే సాహసం చెయ్యడం లేదు.

ఈయన చలన చిత్రాలు ఇప్పటికే చూసి వుంటే లేదా చూసినాక చర్చకు వస్తారని అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను.

Posted by సైఫ్ అలి గొరే సయ్యద్ on June 18, 2009 06:30 AM · permalink

ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా ఒకదాని వెంట ఒకటిగా ముందుకు కదులుతున్న లగేజ్. అందులో ఓ మనిషి పట్టేసేటంత సైజులో ఉన్న పెద్ద పెట్టె మిగతా వాటితో పాటు ముందుకు కదులుతూ ఉండగా సన్నివేశం ఫేడవుట్ అవుతుంది.

సూటు, బూటు వేసుకున్న ఓ మనిషి కాళ్ళు గబా గబా కదులుతూ పోతూ…..అంతలోనే కొంచెం కొంచెంగా వేగాన్ని తగ్గిస్తూ ఓ చోట ఆగుతాయి. అంత వరకు క్లోజ్ అప్ లో ఉన్న కెమెరా ఇప్పుడు మీడియం వ్యూలోకి వస్తుంది.

ఆ వ్యక్తి పేరు కెరోల్. అది పారిస్ లోని ఓ కోర్టు ఆవరణ. జేబులోనుండి ఓ పేపరు తీసి పక్కనే ఉన్న పోలీసుని అడుగుతాడు. “విడాకుల కేసులో నాకు సమన్లు అందాయి, ఈ రోజే విచారణ, ఎటువైపు వెళ్ళాలి?”

పోలీసతను దారి చూపిస్తాడు. కెరోల్ ఆదరా బాదరాగా అటువైపుగా వెళ్తూ….తన అడుగుల చప్పుడుకి భయపడి అటుఇటుగా ఎగిరిపోతూన్న పావురాల వైపు ఆప్యాయంగా చూస్తాడు. అతని ఆప్యాయతకి కానుకగా ఓ పావురం రెట్ట వేస్తుంది. సరిగ్గా అది అతని కోటు మీద పడుతుంది. తనో దురదృష్టవంతున్ని అని మనసులోనే అనుకుంటూ, ఆ రెట్టను తుడుచుకుంటూ విచారణ గదిలో అడుగుపెడతాడు. అప్పటికే అతని భార్య డోమినిక్ అక్కడ సిద్ధంగా ఉంటుంది.

విచారణ మొదలవుతుంది.

న్యాయాధికారి : కెరోల్ ని ఉద్ధేశించి ” మీ భార్య మీనుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నది, దీనికి మీ సమాధానం”

కెరోల్ : నా భార్యంటే నాకు చాలా ఇష్టం, నేను ఆమెకు విడాకులు ఇవ్వదలుచుకోవటంలేదు. తనను నేను మనసారా ప్రేమిస్తున్నాను. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. దయచేసి విడాకులు మంజూరు చేయకండి. ఆమె ఏం కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధం.

న్యాయాధికారి : డోమినిక్ ని ఉద్ధేశించి ” మీరెందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు?”

డోమినిక్ : నా భర్తతో కలిసి ఉండటం నాకు ఇష్టంలేదు

న్యాయాధికారి : కారణం?!

డోమినిక్ : (కొంచెం ఇబ్బందిగా) ఆయన నన్ను శృంగారంలో తృప్తిపరచలేకపోతున్నారు.

న్యాయాధికారి : అంటే మీ భర్తని మీరు ప్రేమించట్లేదా?

డోమినిక్ : ఒకప్పుడు ప్రేమించేదాన్ని.

న్యాయాధికారి : ఇప్పుడు

డోమినిక్ : (కొంత సేపు నిశ్శబ్ధం……..) లేదు.

కెరోల్ : గట్టిగా అరుస్తూ….లేదు, అబద్ధం! డోమినిక్! నువ్వు అలా……లేదు…..(అంటూ ఏడుస్తాడు.)

కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. బయటకు రాగానే, డోమినిక్ తన కారు డిక్కీలోనుంచి కెరోల్ సూట్ కేస్ ని (ఎయిర్ పోర్టు కెరేజల్ మీద చూపించినది) తీసి బయట పారేస్తూ…..అటుగా డోమినిక్! డోమినిక్!! అంటూ అరుచుకుంటూ వస్తున్న కెరోల్ ని చూసి “ఇది నీది తీసుకుపో” అంటూ చీత్కరించుకుని, కెరోల్ ఆగమంటున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది. కెరోల్ కి ఏం చేయాలో తెలియక, సూట్ కేస్ తీసుకుని డోమినిక్! డోమినిక్!! అంటూ కొంత దూరం కారు వెనకాలే పరిగెడతాడు. అయినా డోమినిక్ ఆగకుండా, నిస్సహాయుడైన కెరోల్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది.

ఇద్దరూ కలిసి నడుపుతున్న బ్యూటిపార్లర్ ని, కెరోల్ కష్టపడి కొనుక్కున్న ఇంటిని డోమినిక్ తన పేరు మీద ఎప్పుడో రాయించేసుకుంది. కొంత డబ్బు తీద్దామని ATM కి వెళ్ళి Debit card పెడితే అది కూడా Cancelled అని వస్తుంది. కెరోల్ కి ఏం జరిగిందో అర్థమయ్యేలోపే అక్కడున్న security ఆ కార్డు తీసి, దాన్ని రెండు ముక్కలు చేసేస్తాడు. “అది నా కార్డు” అని అడిగిన కెరోల్ కి. “ఒకప్పుడు, ఇప్పుడు కాదు” అని సమాధానం చెప్తాడు security. “మరి నా డబ్బు” అని ఇంకో ప్రశ్న అడుగుతాడు కెరోల్. ఈసారి security ఏమి మాట్లాడడు. కాని ముక్కలైపోయిన కార్డు చెప్పకనే చెబుతుంది. “నాలాగే నీ డబ్బు కూడా నీది కాదు”.

అసహనంగా పర్సు తీసి చూస్తాడు కేవలం నాలుగు ప్రాంకులే ఉన్నాయి. ఏం చేయాలో ఆలోచిస్తూండగానే చీకటి పడుతుంది, చీకటితో పాటు చల్లదనం పెరుగుతుంది, రోడ్డు పక్కన ఓ మూలగా కూర్చున్న కెరోల్ని ఒంటిమీదున్న కోటు కూడా చలి నుంచి కాపాడలేకపోతున్నది. కొంచెం సర్దుకుంటూ అప్రయత్నంగా కోటు జేబులోకి వెళ్ళిన చేతికి ఇంటి తాళాలు దొరుకుతాయి. కెరోల్ కళ్ళలో ఆశ చిగురిస్తుంది, అంతలోనే మరో ఆలోచన. ఇప్పుడు ఆ ఇల్లు తనది కాదు, డోమినిక్ తనని లోపలకి రానిస్తుందా? అయినా ఈ చలిలో ఇబ్బందిపడే కంటే ఓ ఛాన్స్ తీసుకోవడం మంచిదని నిర్ణయంచుకుని అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆ ఇంటికి బయలుదేరతాడు. డోమినిక్ ఇంటిలో లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడే తల దాచుకుంటాడు. ఆ తరువాత కొంత సేపటికి డోమినిక్ వచ్చి కెరోల్ ని చూసి చూడగానే కోపంతో ఊగిపోతూ తక్షణమే బయటికి పొమ్మంటుంది, తన దగ్గరున్న లైటర్ తీసి కిటికీ curtain లను తగలబెడుతుంది. ఏం జరుగుతున్నదో అర్థంకాక వెర్రి చూపులు చూస్తున్న కెరోల్ తో ” ఇప్పుడు నువ్వు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చావు, నన్ను చంపడానికి ప్రయత్నించావు, ఈ curtains ని కూడా తగలబెట్టావు, ఇక పారీస్ పొలీసులు నిన్ను వదలరు” అనంటుంది. విషయం అర్థమయిన కెరోల్ కి నిద్రమత్తు పోయి, వెంటనే తన సూట్ కేస్ తీసుకుని గబా గబా అక్కడనుంచి బయటపడతాడు.

ఇంత వరకు డబ్బులు లేక ఇబ్బంది ఉండేది, ఇప్పుడు పొలీసులనుంచి కూడా తప్పించుకోవాలి. ఎలా? పోలండ్ వెళ్ళిపోవాలి అవును అదొక్కటే ఈ సమస్యకు మార్గం. కాని ఎలా, అరె నా పాస్ పోర్ట్ కూడా డోమినిక్ దగ్గరే ఉందే. ఒకవేళ పాస్ పోర్ట్ ఉన్నా టికెట్ కి డబ్బులు లేవే…! ఎలా?!

ఆకలిగా ఉంది ఎంతోకొంత డబ్బులు సంపాదించాలి అని తన దగ్గరున్న కాగితాన్ని రెండు మడతలు పెట్టి దాని ద్వారా మృదువైన పోలిష్ సంగీతాన్ని వాయిస్తుంటాడు. నచ్చినవాళ్ళు డబ్బులిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం కెరోల్ దగ్గరకొచ్చి ఆ సంగీతాన్ని తదేకంగా వింటుంటాడు. కెరోల్ అడుగుతాడు, “ఏం కావాలి?” ఆ వ్యక్తి చెబుతాడు ” నా పేరు మికోలజ్, నేను కూడా పోలెండ్ వాసినే”. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది కెరోల్ కి. ఇద్దరు మాటల్లో పడతారు.

కెరోల్ : నన్ను మీతో పాటు పోలెండ్ తీసుకెల్లగలరా….?

మికోలజ్ : తప్పకుండా కాని ఒక నియమం

కెరోల్ : ఏంటది?

మికోలజ్ : నువ్వొక వ్యక్తిని చంపాలి, కంగారు పడకు ఇక్కడ కాదు, పోలెండ్ లో.

కెరోల్ : (భయంగా) హత్యా…..?

మికోలజ్ : కాదు, సహాయం! అవును అతనికి జీవితం మీద విరక్తితో చనిపోవాలని ఉంది. కాని తనకు తానుగా చావటానికి ధైర్యం చాలటం లేదు. నువ్వు సాయం చేయాలి.

కెరోల్ : కాని విరక్తి ఎందుకు? అతనికి భార్యాపిల్లలు లేరా….?

మికోలజ్ : ఉన్నారు.

కెరోల్ : మరి చనిపోవాల్సిన అవసరం ఏంటి?

మికోలజ్ : (మౌనం)

కెరోల్ : అతని సమస్య ఏంటో నాకు తెలీదు. నువ్వు కోరేది ఈ సహాయమే అయితే నేను చేయలేను. మికోలజ్ నన్ను చూడు. నా భార్య నా ఆస్తిపాస్తులు లాక్కొని నన్ను నిర్థాక్షిణ్యంగా రోడ్డున పడేసింది. తనంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. ఇంత జరిగినా తన మీద నాకు ప్రేమ పెరిగిందే కాని తగ్గలేదు.

మికోలజ్ : (కాస్త అపహాస్యం చేస్తూ) నిజంగా….! హ..హ….హా!!

కెరోల్ : ఇప్పుడే నిరూపిస్తా.(అని కెరోల్ ఆ పక్కనే ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి డోమినిక్ కి ఫోన్ చేస్తాడు.)

డోమినిక్ : హలో ఎవరు.

కెరోల్ : డోమినిక్ నేను కెరోల్, I love you డోమినిక్, I miss you a lot!

డోమినిక్ : హ…perfect timing, now listen. హ..హా…మ్…..మ్…..హా….. (అంటూ ఎవరితోనో శృంగారం జరుపుతూ, కెరోల్ కి వినిపించేట్టుగ గట్టిగా అరుస్తుంది)

కెరోల్ అది వినలేక, ఆ బాధను తట్టుకోలేక వెంటనే మికోలజ్ దగ్గరకు వచ్చి “నువ్వు నన్ను పోలెండ్ తీసుకెల్తున్నావు” అనంటాడు. “కాని ఎలా” అని ఎదురు ప్రశ్నిస్తాడు మికోలజ్. కొంచెం ఆలోచించి “ఈ సూట్ కేస్ లో” అని చెప్పి దాంట్లో ఉన్న సర్టిఫికెట్లు, ఇతరత్రా వస్తువులు అన్నీ తీసి బయటపడేసి, శ్వాస ఆడటం కోసం సూట్ కేస్ కి చిన్న కన్నాలు పెడతాడు అక్కడక్కడ. ప్రారంభ సన్నివేశంలో ఎయిర్ పోర్ట్ కెరేజల్ మీదుగా వెల్తున్న సూట్ కేస్ ఇదే.

పోలెండ్ చేరుకున్నాక అక్కడి ఎయిర్ పోర్ట్ పోలీసులు పెద్దగా ఉంది దీంట్లో ఏదో ఒక విలువైన వస్తువు ఉండకపోతుందా అని చెప్పి, ఈ సూట్ కేస్ ని ఎత్తుకుపోతారు. తీరా చూస్తే అందులో కెరోల్ ఉంటాడు. కెరోల్ వాళ్ళనుంచి తప్పించుకుని తన అన్నయ్య దగ్గరకు చేరుకుంటాడు. ఆ తరువాత మికోలజ్ ని కూడా కలుసుకుంటాడు. ఇద్దరూ తమ ఒప్పందం గురించి చర్చించుకుంటారు.

కెరోల్ : సరే నేను ఆ వ్యక్తిని చంపడానికి సిద్ధం, ఇంతకీ ఎవరా వ్యక్తి?

మికోలజ్ : నేనే!

కెరోల్ : వాట్? నీకెమైన పిచ్చెక్కిందా…..?

మికోలజ్ : నువ్వు మాటిచ్చావు

కెరోల్ : సరే ఎక్కడ?

మికోలజ్ : నాతో పద (అని జన సంచారం లేని ఓ ప్రదేశానికి తీసుకెల్తాడు). మికోలజ్ తనతొ పాటు తీసుకొచ్చిన గన్, బుల్లెట్లు కెరోల్ కి ఇచ్చి తనని షూట్ చేయమంటాడు. మికోలజ్ కళ్ళు మూసుకుంటాడు. కెరోల్ గన్ లోడ్ చేయడానికి కొంత సమయం తీసుకుంటాడు. లోడ్ చేసాక మికోలజ్ ని షూట్ చేస్తాడు.

పెద్ద శబ్ధం చేస్తూ తుపాకీ పేలుతుంది. మికోలజ్ గట్టిగా అరుస్తాడు. కొన్ని క్షణాల నిశ్శబ్ధం. ఆశ్చర్యం మికోలజ్ కి ఏం కాలేదు. కెరోల్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు మికోలజ్. ఇందాకటిది బ్లాంక్ షాట్, ఇప్పుడొచ్చేది రియల్. చెప్పు షూట్ చేయమంటావా….? అనడగుతాడు కెరోల్. ఒక్క క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకుని “వద్దు వద్దు కెరోల్, నాకు చావాలని లేదు, నాకు బతకాలని వుంది” అంటాడు మికోలజ్. ఆ రోజు నుంచి ఇద్దరూ మంచి స్నేహితులయిపోతారు.

ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెడతారు. అనూహ్యంగా అన్నీ కలిసొచ్చి పలుకుబడి, డబ్బు, మంచి పేరు సంపాదిస్తారు.

ఇప్పుడు కెరోల్ కి ఓ ఆలోచన వస్తుంది. డోమినిక్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. కాని ఎలా తను ఫ్రాన్సులో ఉంది, పోలెండ్ కు రప్పించడం ఎలా….? మికోలజ్ తో చర్చించి ఓ నిర్ణయానికి వస్తాడు. పథకం పారింది డోమినిక్ పోలెండ్ కి వచ్చింది. గుర్తించలేనంతగా అయిన కెరోల్ శవం పక్కనే నించొని విలపిస్తున్నది. అక్కడే ఉన్న కెరోల్ లాయర్లు తన తదనంతరం ఆస్తి మొత్తం డోమినిక్ కే చెందాలని కెరోల్ రాసిన విల్లుని చదివి వినిపిస్తున్నారు డోమినిక్ కి.

ఇదంతా ఎవరికి కనిపించకుండా దూరం నుంచి చూస్తున్న కెరోల్ తనలో తానే నవ్వుకుంటున్నాడు. కెరోల్ ఇక్కడుంటే మరి ఆ శవం ఎవరిది.

కెరోల్, డోమినిక్ ని పోలెండ్ రప్పించడం కోసం తను చనిపోయినట్టు నాటకం ఆడతాడు. తనలాగే ఉన్న ఓ శవాన్ని కొని (illegally) మొహం గుర్తుపట్టలేని విధంగా తయారుచేస్తారు. అంతకు ముందే డోమినిక్ కి కెరోల్ చనిపోయినట్టుగా ఓ సందేశం పంపించారు. కాని డోమినిక్ పోలెండ్ లో అడుగుపెట్టిన తరువాతే కెరోల్ చనిపోయినట్టుగా సృష్టిస్తారు. ఇది తెలియని డోమినిక్ డబ్బుమీదున్న ఆశతో కెరోల్ ఇంటికి వచ్చి అక్కడే ఉంటుంది. ఈ ఆస్తి అంతా తనదే అని ఆనందంలో తేలుతున్న డోమినిక్ దగ్గరకు ఎవరికీ కనిపించకుండా కెరోల్ వస్తాడు. కెరోల్ ని చూసి ఆశ్చర్యంతో షాక్ అయిన డోమినిక్ కి తనని రప్పించడం కోసమే ఇదంతా చేసానని, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని ఆమెతో శృంగారం జరిపి అక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా, తను వచ్చిన జాడ కూడా తెలియకుండా మాయమవుతాడు. డోమినిక్ ఆగమని చెప్పిన వినకుండా వెళ్ళిపోతాడు. ఇలా ఎందుకు చేసాడా? అని ఆలోచిస్తున్న డోమినిక్ కి షాకిస్తూ పోలెండ్ పోలీసులొస్తారు. కెరోల్ ని చంపిన కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నామంటారు. డోమినిక్ గట్టిగా నవ్వి కెరోల్ చనిపోలేదని బతికే ఉన్నాడని చెబుతుంది. ఇది విని విస్తుపోయిన పోలీసులు కెరోల్ Death Certificate చూపిస్తారు అయిన డోమినిక్ నమ్మదు. అయితే బతికున్న కెరోల్ ని నువ్వే చూపించు అంటారు. కెరోల్…కెరోల్ అని గట్టిగా పిలుస్తుంది, ఎవరూ రారు. తాను మోసపోయానన్న విషయం నెమ్మదిగా అర్థమయ్యి ఎటువంటి ప్రతిఘటన ఇవ్వకుండా నిశ్శబ్ధంగా పోలీసుల వెంట వెళ్ళిపోతుంది.

కొన్ని రోజుల తరువాత కెరోల్, డోమినిక్ జైలులొ ఎలా ఉందో చూడటం కోసం పథకం వేస్తాడు, దొంగ చాటుగా వెళ్లి తనకున్న పలుకుబడితో జైలు సెక్యూరిటీకి లంచం ఇచ్చి, దూరం నుంచే డోమినిక్ ని బయనాక్యులర్ తో చూస్తాడు. అరె డోమినిక్ ఒకప్పటి అందమైన తల వెంట్రుకలు, పిడుచుగట్టుకపోయాయే…..తీక్షణమైన ఆమె చూపులు ఇప్పుడు నిస్తేజంగా ఉన్నాయే…..సున్నితమైన ఆమె అందాల అరచేతులు ఉక్కు సంకెళ్ళ మధ్య ఇరుక్కుపోయాయే….!
మానసికంగా కృంగిపోయి, నైరాశ్యంలో ఉన్న డోమినిక్ ని చూసిన కెరోల్ బయనాక్యూలర్ని తన కళ్ళకు మరింతగా అదిమి పట్టాడు. వాటి క్రిందుగా సన్నటి నీటి బొట్టు కెరోల్ బుగ్గలమీదుగా జాలువారింది, మరుక్షణంలోనే నీటి బొట్టు కాస్త సన్నటి నీటి ధార అయింది. ఒక్కసారిగా బయనాక్యూలర్స్ తీసిన కెరోల్ కళ్ళు ఎర్రగా కందిపోయి ఉన్నాయి, అతని కళ్ళ నుండి నీటి ధార అప్రతిహతంగా ప్రవహిస్తున్నది. సందేహం లేదు, అది ముమ్మాటికి అతని మనసు పొరల్లోంచి తన్నుకొస్తున్న బాధే. కాని తనను పలు కష్టాల పాల్జేసి, ఆఖరుకు పరాయి దేశంలో తినడానికి తిండి కూడా లేకుండా చేసిన డోమినిక్ మీద అతనికి ఇంత ప్రేమ ఎందుకు?

ఈ ప్రశ్న ప్రేక్షకుల మెదడ్లను తొలుస్తుండగానే సినిమా ముగిసినప్పటికీ, ప్రేక్షకుల మనోభావాలకు విలువనిస్తూ, ఆ కారణాన్ని ఎవరికి వారే సినిమాకి అన్వయించుకొనే స్వేచ్ఛనివ్వడమే దర్శకుడి ప్రయత్నంగా మనకు స్ఫురిస్తుంది.

ఇది Krzysztof Kieslowski దర్శకత్వం వహించిన The Three colours trilogy లో రెండోది. ఫ్రెంచ్ జాతీయ పతాకంలో తెలుపు రంగు సమానత్వానికి ప్రతీక, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ చిత్రంలో ఆకాశం ప్రతీ చోట తెల్లగానే కనపడేట్టు ఛాయాగ్రహణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం గమనార్హం. ఈ చిత్రానికి గాను బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో Kieslowski దర్శకత్వ శాఖలో Silver Bear అవార్డు అందుకున్నారు.

P.S: నిఝంగా నాకు ప్రేమ అంటే ఏంటో వివరంగా తెలీదు. ఈ సినిమాలో కెరోల్ మానసిక సంఘర్షణను చెప్పటం కోసం, డోమినిక్ మీద అతనికున్న ఇష్టాన్ని పాఠకులకు స్పష్టంగా తెలియచెప్పడం కోసం ఆ పదాన్ని విరివిగా ఉపయోగించాల్సి వచ్చింది.

Posted by రాజశేఖర్ on June 17, 2009 03:30 AM · permalink

“the great editing skill will protect the director from committing suicide”
- Sean penn, Actor/Director

“కట్” అనే మాట సినిమా ప్రారంభమై రోజుల్లో అస్సలుండేదే కాదు. రైలు ప్రయాణించడమో, ఫ్యాక్టరీ నుంచీ వర్కర్లు బార్లుబార్లుగా బయటికి రావడమో లాంటి నిత్యజీవిత దృశ్యాల్ని ఆ దృశ్యం అయిపోయేవరకో లేక  కెమరాలో ఫిల్మ్ అయిపోయేంతవరకో అట్టాగే పెట్టేసి తెరకెక్కించి జనాలకు చూపించేసేవాళ్ళు. ఇందులోని వైవిధ్యం కొంతే. కదులుతున్న నిత్యజీవితంలోని బొమ్మల్నే, వీధుల్లో సందుల్లో కనిపించే దృశ్యాల్నే డబ్బులిచ్చిమరీ తెరమీద  ఎన్నాళ్ళని చూస్తారూ! అందుకే సినిమా ఒక పనికిరాని భవిష్యత్తేలేని సాంకేతిక  ప్రయోగంగానే మిగిలిపోయే ప్రమాదం ఏర్పడింది. అప్పుడొచ్చాడు కత్తెర తీసుకుని మన ప్రప్రధమ ఎడిటర్ ఎడ్విన్ పోట్టర్.

ఎడ్విన్ పోట్టర్ తన కత్తెరతో “ఇంటర్ కట్” అనే ఒక అద్వితీయ ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఒకే సమయంలో జరుగుతున్న రెండు వేరు వేరు పరస్పర సంబంధమైన ఘటనల్ని మార్చిమార్చి చూపించడం ద్వారా ఒక అద్భుతాన్ని సృష్టించాడు. ఒకవైపు మంటల్లో రగులుతున్న భవనం. మరోవైపు గుర్రబ్బళ్ళలో మంటల్ని ఆర్పడానికి వస్తున్న ఫైర్ మెన్. వచ్చారా…రక్షించారా…ఏమయ్యింది అని ఉత్కంఠంతో ప్రేక్షకులు ఊపిరిబిగబట్టి సినిమా చూశారు. 1903 లో సినిమాల్లో ఎడిటర్ జన్మించాడు. దానితోపాటూ ఒక కొత్త భాష, కొంగ్రొత్త కళ ఉద్భవించాయి. ఒక్క కనురెప్ప మూసిన క్షణంలో దిగంతాలనుంచీ అనంతాలవరకూ, మానవ ముఖకవళికలనుంచీ తన బుర్రలోని అధోలోకాలవరకూ తెరమీద ఆవిష్కరించగల కళారూపం సృష్టించబడింది.

ఏడిటింగ్ సమయాన్ని నిదానించగలదు. సమయాన్ని వేగవంతం చెయ్యగలదు. ఒక్క కట్ తో ప్రేక్షకుల్ని కుర్చీల్లోంచి లేచి నుంచోపెట్టగలదు. ఆశ్చర్యపరచగలదు. భయపెట్టగలదు. షాట్ నిడివి, సీన్ నడవడికను నిర్ణయించి కథన రీతిని నిర్దేశింగలదు.  ప్రేక్షకులభావేశాన్ని నియంత్రించగలదు. బహుశా తన జీవితాన్ని నిర్దేశించాలనుకునే మనిషిలోని అంతర్లీన కోరికకు ఎడిటింగ్ ప్రతీకలాగా అనిపిస్తుంది. ప్రతి మనిషీ తన జీవితంలోని బోరుకొట్టే చెడ్డభాగాలను కత్తిరించి పారెయ్యాలనుకుంటాడు. ఆసక్తికరమైన భాగాలను నిదానంగా,లోతుగా తరచి చూసి ఆనందించాలనుకుంటాడు. ఆవేశాన్నీ కోపాన్నీ ఉద్వేగాన్నీ వేగంగా ముగించెయ్యాలనుకుంటాడు. అదే సౌలభ్యం ఎడిటింగ్ లో ఉంది. బహుశా ఎడిటింగ్ వలనే మనిషికి సినిమా నచ్చుతుంది. ఎడిటింగ్ లేకపోతే సాధారణ జీవితంలాంటి సినిమా బోర్ కొట్టదూ!

రచయితకు పదం లాగా. సంగీత విద్వాంసుడికి స్వరంలాగా. ఎడిటర్ కు “ఫ్రేం” అతి ముఖ్యం. సాధారణంగా రెండున్నర గంటల నిడివిగల సినిమా తియ్యాలంటే కనీసం రెండువందల గంటల ఫిల్మ్ ఎక్పోజ్ చెయ్యల్సొస్తుంది. ప్రతి సెకనుకు 24 ఫ్రేముల చొప్పున రెండొందల గంటల ఫిల్మ్ లో ఎన్ని ఫ్రేములుంటాయో ఒకసారి లెక్కెయ్యండి…హమ్మో! అనిపించదూ. కానీ ఈ కోట్లది ఫ్రేముల్ని కట్ చేసి వీనులవిందైన,కనులకు పసందన, మిగతా ఇంద్రియాలకు ఇంపైన సినిమా సంగీతాన్ని అందించే కళాకారుడే ఎడిటర్.

అలాంటి కత్తెర కళాకారుల్లో ఆదిగురువు ఎడ్విన్ పోట్టర్ అయినా, ఆధునిక ఎడిటింగ్ కళకు నిర్వచనం చెప్పింది మాత్రం డి.డబ్లూ. గ్రిఫిత్ అని చెప్పుకోవాలి. పోట్టర్ తో పది సంవత్సరాలు పనిచేసిన గ్రిఫిత్ ఎడిటింగ్ యొక్క ఓనమాల్ని సృష్టించాడని చెప్పొచ్చు. అలాగే షాట్ ల విభజన,జోడింపు ద్వారా ప్రేక్షకుల్ని ఎలా సమ్మోహితుల్ని చెయ్యాలో 1912 లో తను చేసిచూపిన తీరు ఎడిటింగ్ కు మూలమైన వ్యాకరణంగా ఈ నాటికీ నిలిచి ఉంది. అప్పటి వరకూ నాటకలలో కొంత దూరం నుంచీ మాత్రమే నటుల్ని కాళ్ళనుంచీ తలదాక చూసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా ముఖాన్ని పెద్దగా క్లోజప్ లో చూపించి చకితుల్ని చేసాడు. ఇలా వివిధ సైజుల్లో షాట్లను కంపోజ్ చేసి కొత్త వ్యాకరణాన్ని సృష్టించాడు. క్లోజప్, లాంగ్ షాట్, మిడ్ షాట్ అంటూ మనం సాధారణంగా చెప్పుకునే సినీపదజాలానికి ఆద్యుడు గ్రిఫిత్. ఈ షాట్లను సృజనాత్మకంగా జోడించి ప్రేక్షకుల్లో రసస్పందనను కల్పించిన ఆధునిక కత్తెర మాంత్రికుడు గ్రిఫిత్.

1914 లో వచ్చిన “బర్త్ ఆఫ్ నేషన్” సినిమా ఇప్పటికీ ఒక అద్భుతమే అని చెప్పాలి. క్లోజప్ లు, ఫ్లాష్ బ్యాక్ లు, ప్యారలెల్ యాక్షన్లూ వంటి ఎన్నో విధానాల ద్వారా ఎడిటింగ్ కళను ముందుకు తీసుకెళ్ళిన సినిమా ఇది. ఈ చిత్రం ద్వారా ఎడిటింగ్ ప్రక్రియకు మూలమైన నియమం “invisible cut”- అదృశ్య కత్తెరను పరిచయం చేశాడు. ఒక షాట్ నుంచీ మరొక షాట్ కు మారేప్పుడు నటుల కదలిక కొనసాగింపుగా ఉండి ప్రేక్షకుడికి ఆ కత్తెర ప్రయోగం తెలీనట్టే ఉండేవిధం “కట్టింగ్ ఆన్ ది మూమెంట్” ను సృష్టించాడు. నేటికీ ఈ విధానం ఒక golden rule గా అనుసరింప బడుతోంది.

అది రష్యన్ విప్లవ తరుణం. గ్రిఫిత్ సృష్టించిన మెలోడ్రామా ఎడిటింగ్ రష్క్యన్లకు బూర్జువాశైలిగా అనిపించింది.1929 లో జిగెరటోవా అనే రష్క్యన్ లఘుచిత్ర దర్శకుడు తన “మ్యాన్ విద్ ద మూఈ కేమరా” తొ ఎడిటింగ్ ను వేగవంతం చేసి సాధారణ దినచర్యను కూడా ఒక విప్లవంలా చూపించి ఎడిటర్ ను విప్లవంలో భాగం చేసి మురిపిస్తే, లెవ్ కుల్షేవ్ అనే నాటకకారుడు విభిన్నైన షాట్లను కూర్చి juxtaposition ద్వారా కొత్త అర్థాల్ని ప్రేక్షకులు అనువదించుకునేలా చేశాడు. ఒకనటుడి ఒకే ముఖకవళికను తీసుకుని ఒకసారి సూప్ బౌల్, మరొకసారి భర్త చనిఫొయి ఏడుస్తున్న మహిళ మరొసారి బొమ్మతో ఆడుకుంటున్న చిన్నారి పాప షాట్లతో జోడించి, ప్రేక్షకులను నటుడు వేరేషాట్లకు అనుగుణంగా స్పందించినట్లుగా భ్రమింపజేసాడు. ఈ ప్రయోగంతో ప్రేక్షకుల సైకాలజీని మ్యానిప్యులేట్ చేసే ఎడిటింగ్ ప్రారంభమయింది.

అంటే కనిపించే ఆ రెండు బొమ్మలకన్నా అవి ఉత్పన్నంచేసే మూడో భావన సినిమాకు ప్రధానంగా తయారయ్యే ప్రక్రియ  ఈ ఎడిటింగ్ తో ప్రారంభమయ్యింది. దాన్నే montage గా వ్యవహరించడం మొదలెట్టారు. సర్గీ ఐజిన్ స్టైన్ ఈ ప్రక్రియకు మార్కిజాన్ని అద్ది “బ్యాటిల్ షిప్ ప్టొంకిన్” తో సంచలనాన్ని సృష్టించాడు. అర్థాన్ని షాట్లద్వారా కాకుండా అవి ఒకదానితో ఒకటి పోటీపడే విధానం ద్వారా తెలపడం ఈ దర్శకుడి దార్శనికతోనే మొదయ్యింది. గ్రిఫిత్ కట్ అదృశ్యంగా ఉండాలి ఆంటే, ఆ కట్ చూపించడం ద్వారా రెండుషాట్లకూ మించిన మూడోఅర్థాన్ని కల్పించాలి అని ఐజిన్ స్టైన్ నమ్మాడు. కమ్యునిజాన్ని కమ్యూనికేట్ చేసే బలవత్తరమైన సాధనంగా సినిమాని చూశాడు. తన విప్లవం కలలు కాదుగానీఆ శైలివలన ఎంటర్ టైన్మెంట్ విప్లవం మాత్రం సినిమాల్లోకి దూసుకొచ్చేసింది.

ఆ తరువాత ఎందరో ఎడిటర్లు, ఎందరో దర్శకులు ఎడిటింగ్ కళను ముందుకు తీసుకెళ్ళి ఇప్పటి ఘనత స్థాయికి తీసుకొచ్చారు.

దురదృష్టవశాత్తూ ఒకప్పుడు  అదృశ్యకత్తెర సృష్టికర్తలైన ఎడిటర్ల పనిని చాలా ఏళ్ళు అదృశ్యంగానే ఉంచేసింది. సరైన గుర్తింపు లేకుండా చేసింది. ఫిల్మ్ ని కట్ చేసే కూలివాళ్ళుగానే ఈ ఎడిటర్లను గుర్తించారేగానీ సృజనాత్మక సినీసృష్టిలో భాగస్వాము గుర్తించడం జరగలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి దానికి విపరీతం. దర్శకుడు అత్యంత ఎక్కువ (ఒంటరి) సమయం గడిపేది ఎడిటర్ తోనే. షూట్ చేసిన రషెస్ ని objective గా చూసి దర్శకుడి ఎమోషనల్ అటాచ్మెంట్ ను తగ్గించి సినిమాను ప్రేక్షకులకు అనుగుణంగా కత్తిరించి దర్శకుడి ప్రతిభకు మెరుగులు దిద్దేది ఎడిటరే. అంటే మనం చూసే సినిమాని “సినిమా” చేసింది ఈ ఎడిటరే.

Posted by K మహేశ్ కుమార్ on June 16, 2009 10:09 AM · permalink

‘దొంగలు పడ్డ ఆరునెలలకి కుక్క మొరిగిందన్నట్టు’ డబ్బాలు తిరిగొచ్చిన యిన్ని రోజుల తరువాత, ఈ సినిమా గురించి, యిప్పటికే నవతరంగంలో రెండు వ్యాసాలు వచ్చేకా, యింకో టపా రాయడం అవసరమా అన్న విషయం పరిగణించాను. ఈ సినిమా గురించే కాక, ఈ తరహా సినిమాల గురించి కలిగిన అభిప్రాయాలకి నాకు స్పష్టత కలగడంకోసం టపా రాయచ్చని భావనతో, యిక్కడైతే కొంత చర్చ జరిగే అవకాశం వుండటం ఈ టపా ప్రచురించడంలో వుద్దేశ్యం.

సినిమాలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా హీరోయిన్ (లక్ష్మి) తండ్రి పాత్రా చిత్రణ, ఆ పాత్రధారి (కామేశ్వరరావు?) దాన్ని నిర్వహించిన తీరు చాలాబావున్నాయి. అలాగే దేవరకొండ – ఆ ఊళ్ళోనే షూటింగ్ చేసారో లేదో తెలియదు కానీ – ఏరియల్ షాట్స్, పల్లెటూరిలో సొంతంగా బతకాలన్న యిష్టంతో ఉన్న ప్రధాన పాత్రలు, కొన్ని సన్నివేశాలు, దృశ్యాలు చాలా మంచి ముద్రవేసాయి. నాకు మళ్ళీ మళ్ళీ గుర్తకొచ్చే ఒక దృశ్యం హీరో (అక్బర్) ఆటో టాపు మీద పడుకుని సేద తీరే దృశ్యం, యిన్ని వున్నా ఒక మంచి సినిమా చూసామన్న ఆనందం ఈసినిమా చూస్తే ఎందుకు కలగలేదు అన్నది ప్రశ్న.

ఒక కారణం, ఈ సినిమాలో క్లైమేక్స్ – అక్బర్ ముస్లిమ్ అని తెలిసిన తరువాత లక్ష్మి తండ్రి, వాళ్ళ వివాహానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో హీరో అక్కడనుంచి నిష్ర్కమించడం, ‘రెండు సంవత్సరాల తరువాత’ అనే బోర్డు, తరవాత పంచాయితీ ప్రెసిడెంట్ గా అక్బర్ ఉపన్యాసం విన్న లక్ష్మి తండ్రి వాళ్ళ పెళ్ళికి అంగీకరించడం – అసంతృప్తిగా అనిపించింది. ఆసక్తి కరమైన అశం ఏమంటే, నవతరంగంలో వున్న స్క్రీన్ ప్లే (4వ చిత్తుప్రతి) చూస్తే, అందులో ముగింపు అలా లేదు. వాళ్ళు పెళ్ళి చేసుకోలేదనీ, పరిణితిగల మనుషుల్లా ఎడబాటుని అధిగమించారని ఆ సూచనతో సినిమా ముగించాలని ఉంది. పెళ్ళి చేసుకోవడం రాజకీయంగా సరైన ముగింపు అవుతుందని భావించడం చేతో, సంతోషకరమైన ముగింపు వ్యాపారాత్మకంగా సినిమాకి మంచిదని భావించో ఆ తరువాత మార్చి ఉంటారు, నా వరకైతే, యిప్పుడు పరిస్థితులు అనుకులించక సాధ్యం కాలేదు కానీ భవిష్యత్తులో మరోచోట, మరో పరిస్థితుల్లో అలాంటి జంటలు ఏకమవగలిగే అవకాశం ఉందన్న సూచనతో ముగించడం యిలా నడిపించిన సినిమాకి సరిపోయేదోమో అనిపించిది. ఒకవేళ అక్బర్ లక్ష్మిని ఎలా పెళ్ళి చేసుకున్నాడో చెప్పడమే సినిమా ఉద్దేశ్యం అయితే, అక్బర్ పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్ గా ఎన్నికవడంతో ప్రారంభించి, మిగతా కథంతా ఫ్లాష్ బ్యాక్ గా చెప్పి, పెళ్ళితో ముగించడం లాంటి విధానం అవలంభించి ఉడచ్చనిపించింది.

కొంత అభిరుచితో, విలువలగురించిన పట్టింపుతో తీసిన ఈ తరహా వ్యాపారాత్మక చిత్రాల అవసరం తెలుగులో చాలానే వుంది. ఒక పని ఎలా చెయ్యాలో తెలుసుకోవడం జ్ఞానం అని, ఆ పని ఎందుకు చెయ్యాలో తెలుసుకోవడం విజ్ఞానం (wisdom) అని ఎవరో పెద్ద మనిషి అన్నారు. అనీష్ కథ చెప్పడానికి మంచి పాత్రలు ఎంచుకున్నారు కానీ, వాటిలోతు వ్యక్తమయ్యేలాంటి డ్రామా సృష్టించండంలో సఫలం కాలేదనిపించింది. లక్ష్మి ఉద్యోగం చేసుకోవాలని కాక, సొంతంగా ఏదో సాధించాలనుకున్న అణుకువ గల చదువుకున్న అమ్మాయి. ఆ పాత్ర ప్రధాన లక్ష్యం ‘విశ్వవిఖ్యాత రాజమండ్రి ఆవకాయ’ని మార్కెట్ చేయడం. అమెకి ప్రత్యర్ధులు ఎవరూలేరు. ఉన్న కొద్దిపాటి ప్రతికూలతకి సహనంగా ప్రయత్నం కొనసాగించమే పరిష్కారం. పరిస్థితుల వల్ల చిగురించిన ప్రేమకి తండ్రి ప్రత్యర్ధి అనుకున్నా ఆయనతో ఘర్షణ లేకుండానే ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. అక్బర్ పెద్ద ఆశలు వున్న కష్టపడే వ్యక్తి. అతని లక్ష్యం మంచి బతుకు సాధించడం, పెళ్ళి చేసుకుని కుటుంబ జీవితం గడపడం. పరిస్ధితుల వల్ల గ్రామ రాజకీయలలో పాలు పంచుకోవల్సి వచ్చింది. లక్ష్మి ప్రేమ అతని ఒక లక్ష్యమైన మంచి కుటుంబం ఏర్పరుచుకోవడానికి అవసరమైనా దానికి ప్రత్యర్ధి, లక్ష్మి తండ్రి, తో అతని మంచితనం వల్ల అతను ఘర్షణ పడలేడు. లక్ష్మి సాయంతో డిగ్రీ పాస్ అవడం, పోటీలో గెలిచి గ్రామంలోని ప్రత్యర్ధులని జైలుకు పంపడంతో ‘రెండేళ్ళ తరువాత’ అని చెప్పి అతన్ని గ్రామ నాయకుణ్ణి చేయడం తప్ప వేరే రకంగా కథ నడిపే అవకాశమూ కలగలేదు.

ఈ సినిమా ఆడియన్స్ యువత. వినోదం కోసం తీసే వ్యాపారత్మక సినిమాలలో సహజత్వంకన్నా జనరంజకత్వం ఉండాల్సిన అవసరం వాటికి వుంది. ఆటో పోటీ లాంటి అలాంటి అంశాలతో నాకేమి పేచీలేదు. నిజానికి సినిమాలో ఈ సీన్ కనపడలేదు కానీ, స్క్రీన్ ప్లేలో ఆ పోటీకి ముందు మాస్టర్ జీ హుక్కా తాగుతూ టి.వి.లో ‘నయదౌర్’ సినిమాలో ఎడ్లబండి పందెం చూస్తన్నట్టు ఒక నేపధ్యం కూడా సృష్టించాడు. కథనం విషయంలో ఈ సినిమా బృందం చాలా శ్రద్ధ పెట్టారనడానికి ఇలాంటి నిదర్శనాలు చాలానే వున్నాయి. అయినా ఈ సినిమా (శేఖర్ కమ్ముల ఆనంద్, గోదావరి కూడా) అసంతృప్తికరంగా అనిపించడానికి కారణం వాళ్ళకి సినిమా గురించిన జ్ఞానం లేకపోవడం వల్లకాదని కళాత్మక విలువలతో వ్యాపార చిత్రాలని సమర్ధవంతంగా నడిపిన బి.ఎన్.రెడ్డి, బాపు / రమణ వంటి వారికి వున్న మూలాలు, తాత్విక భూమిక వీళ్ళకి లేకపోవడమని అనిపిస్తుంది. సినిమాలు చూసి తీసిన సినిమాలకి, జీవితాన్ని అధ్యయనం చేసేక్రమంలో పాత్రలు సృష్టించి తీసే సినిమాలకి చాలా తేడా వుంటంది.

నచ్చారు కనకే శేఖర్ ని, అనీష్ ని మళ్ళీ మళ్ళీ విమర్శించాలి. రిఫరెన్స్ యివ్వడానికి నాదగ్గర పుస్తకాలు యిప్పుడు లేవు కానీ, బహుశా ఢిల్లీ తెలుగు సంఘం వాళ్ళు ప్రచురించిన ‘గురజాడ సంస్మరణ’ సంచికలో అనుకుంటా ఒక వ్యాసం, కన్యాశుల్కం నాటకంలో సారాకొట్టు అంకం రాసే రోజుల్లో, రోజు సాయంత్రం విజయనగరంలో వున్న సారాకొట్టు దగ్గర కండువా కప్పుకున్న ఒక పెద్దమనిషి చుట్టకాల్చుకుంటూ కూర్చునే వాడని. అది గురజాడ అప్పరావుగారే నని ఒకటి వుంది. చాదస్తంలా అనిపించేటి అంత నిబద్ధత లేకుండా రక్తమాంసాలతో చెమట వాసనలు వెదజల్లే పాత్రలు సృష్టించడం సాధ్యమవుతుందా? శేఖరూ అనీషూ అలాంటి చాదస్తం కూడా నేర్చుకుంటారని ఆశ నాకైతే యింకా కొంత వుంది.

Posted by రమణ on June 15, 2009 06:30 PM · permalink

anveshi
anveshi
anveshi
anveshi
saamethalu
anveshi
anveshi
anveshi
anveshi
anveshi
anveshi
anveshi